పోర్ట్ అవ్ ప్రిన్స్:హైతీలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న ఇంధన ట్యాంకర్ పేలిపోయింది.తీర నగరం మిరాగానేలో శనివారం(సెప్టెంబర్14) ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మందికిపైగా దుర్మరణం పాలవ్వగా 50 మందికిపైగా గాయపడ్డారు.
రోడ్డుపై వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ టైరు తొలుత పంక్చర్ అయింది. దీంతో ఆయిల్ కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ సమయంలో పేలుడు జరిగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం హెలికాప్టర్‌లో తరలించారు.ప్రమాద స్థలాన్ని ప్రధాని గ్యారీ కొనల్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘ఇది చాలా భయంకర ప్రమాదం. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అత్యవసర బృందాలు పనిచేస్తున్నాయి’అని తెలిపారు. హైతీలో కొన్ని ప్రాంతాలు మిలిటెంట్ గ్యాంగుల ఆధీనంలో ఉండటంతో అత్యవసర వస్తువుల రవాణాకు రోడ్డు మార్గం కంటే నౌకలను ఎక్కువగా వాడుతుండడం గమనార్హం.
ఇదీ చదవండి.. చమురు ట్యాంకర్‌కు మంటలు
Comments
Please login to add a commentAdd a comment