పోర్టు ఆవ్ ప్రిన్స్: కరేబియన్ దేశం హైతీ ప్రధానమంత్రి ఆరియల్ హెన్రీ ఎట్టకేలకు పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. రాజధానిలోని 80శాతం పైగా సాయుధ ముఠాల చేతుల్లోకి వెళ్లిపోవడం, పలు ప్రభుత్వ కార్యాలయాలను ముఠాలు ఆక్రమించడం, అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరగడంతో హెన్రీ ఈ మేరకు నిర్ణయించినట్లుగా భావిస్తున్నారు.
హెన్రీ ప్రస్తుతం పొరుగుదేశం పోర్టోరికోలో ఉన్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం పోర్టు ఆవ్ ప్రిన్స్‌లోని విమానాశ్రయంలో ల్యాండయ్యేందుకు సాయుధ ముఠాలు అంగీకరించకపోవ డంతో దేశం వెలుపలే ఉండిపోయారు. 2021లో అప్పటి అధ్యక్షుడు జొవెనెల్‌ను సాయుధులు ఇంట్లో ఉండగా∙ చంపారు. అప్పటి నుంచి హెన్రీ ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment