Henry
-
మహోన్నత నైతిక శిఖరం..
దశాబ్దాలు గడుస్తున్నా దేశ ప్రజాస్వామ్య ప్రయాణం ప్రజా ఆకాంక్షలు నెరవేర్చే దిశగా నడవ లేదనడం వాస్తవ దూరం కాదు. ప్రజా భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అందుకు ప్రజలే చొరవ చూపాలి. రాజకీయ, పాలనా వ్యవస్థలపై అవగాహన పెంచుకొని ఉద్యమించాలి. అందుకు అమెరికా తాత్త్వికవేత్త థోరో రచనలు బాగా దోహదం చేస్తాయి.ఆయన రచన ‘సివిల్ డిబీడియన్స్’ (శాసనోల్లంఘన) మహాత్మాగాంధీని అమితంగా ఆకర్షించింది. కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో చదువుతున్నప్పుడే దీన్ని చదివారాయన. దక్షిణాఫ్రికాలో ఆసియా వాసుల హక్కుల కోసం ఈ సిద్ధాంతాన్ని సంధించి పోరాటం చేశారు. శాసనోల్లంఘనను మాతృ భాషలోకి అనువదించి సహచరులకు అందించారు. 1919లో బిటిష్వాళ్లు రౌలట్ చట్టాన్ని ప్రతిపాదించినపుడూ, తరువాతి కాలం (1930)లోనూ శాసనోల్లంఘన సిద్ధాంతం అనుసరించి ఉద్యమం నిర్మించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు.హెన్రీ డేవిడ్ థోరో అమెరికాలో 1817 జులై 12న పుట్టారు. నలభై నాలుగు ఏళ్ళు జీవించి 1862లో మరణించారు. సివిల్ డిసొబీడియన్స్ గ్రంథం మసాచుసెట్స్‌లో 1849లో ప్రచురితమయ్యింది. ఇది చిన్న పుస్తకం. కానీ బలమైన రాజకీయ రచన. మేల్కొలిపే తాత్విక చింతన.ప్రభుత్వం, రాజకీయ దోపిడీ, జైళ్ళు, అహింసా మార్గం, ప్రజల హక్కులు, పేదరికం, నైతిక విలువలు, యుద్ధం, అజ్ఞానం, మానవ సంబంధాల ప్రాముఖ్యం వంటి ఎన్నో ముఖ్య విషయాలు ఈ పుస్తకం ద్వారా థోరో మన ముందు ఉంచారు. ఈ రచన వచ్చి 175 ఏళ్ళు అయింది. దీనిలోని ‘నామమాత్రంగా పాలించే ప్రభుత్వమే ఉత్తమ ప్రభుత్వం. ఇదే నా ఆదర్శం. ప్రభుత్వం అతి తొందరగా ఆ విధంగా పాలించేటట్లు చేయుటే నా అభిలాష.’ అనే ప్రారంభ వాక్యాలు సమకాలిక రచయిత జాన్ స్టువార్ట్ మిల్ అన్నవి. థోరో కవి, తాత్వికుడు, వ్యాసకర్త, ప్రకృతి ప్రేమికుడు. ఆయన ఏం చెప్పాడో అదే ఆచరించిన మహోన్నత నైతికశిఖరం.మన కులపోడనో, ఊరి వాడనో, రాజ వంశీకుడనో, ఫలానా పార్టీ వాడనో, మతం వాడనో, సినీ నటుడనో, ప్రలోభాలకు లొంగో ఓటు వేసి గెలిపించి చట్ట సభకు పంపితే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో చూస్తున్నాం. ఆ చేదు ఫలితాలు అనుభవిస్తున్నాం. ఎన్నికలు చేసే మంచి ఎంత? ప్రాతినిధ్య ప్రజాస్వామ్య విధానంతో వచ్చే మంచి చెడులు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. వీటిని థోరో తన రచనలో చర్చించారు. శాసనోల్లంఘన రచనలోని ప్రజాస్వామ్య భావనలు జీర్ణించుకొని, నైతికంగా ఎదిగి, లోపాలు చక్కదిద్దుకోవడానికి మనం తయారైతే సమాజ వికాసం జరుగుతుంది. – వి. వరదరాజు, శ్రీకాకుళం -
లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో మాథ్యూ హెన్రీ
న్యూజిలాండ్ పేస్ బౌలర్ మాథ్యూ హెన్రీకి ఐపీఎల్లో ఆడే అవకాశం లభించింది. గత ఏడాది జరిగిన వేలంలో హెన్రీని ఏ జట్టూ తీసుకోలేదు. అయితే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సభ్యుడు, ఇంగ్లండ్ పేస్ బౌలర్ డేవిడ్ విల్లే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. దాంతో లక్నో ఫ్రాంచైజీ విల్లే స్థానంలో హెన్రీని అతని కనీస ధర రూ. 1 కోటీ 25 లక్షలకు తీసుకుంది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న 32 ఏళ్ల హెన్రీ న్యూజిలాండ్ తరఫున 25 టెస్టులు, 82 వన్డేలు, 17 టి20లు ఆడి 256 వికెట్లు పడగొట్టాడు. -
హైతీ ప్రధాని రాజీనామా
పోర్టు ఆవ్ ప్రిన్స్: కరేబియన్ దేశం హైతీ ప్రధానమంత్రి ఆరియల్ హెన్రీ ఎట్టకేలకు పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. రాజధానిలోని 80శాతం పైగా సాయుధ ముఠాల చేతుల్లోకి వెళ్లిపోవడం, పలు ప్రభుత్వ కార్యాలయాలను ముఠాలు ఆక్రమించడం, అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరగడంతో హెన్రీ ఈ మేరకు నిర్ణయించినట్లుగా భావిస్తున్నారు. హెన్రీ ప్రస్తుతం పొరుగుదేశం పోర్టోరికోలో ఉన్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం పోర్టు ఆవ్ ప్రిన్స్‌లోని విమానాశ్రయంలో ల్యాండయ్యేందుకు సాయుధ ముఠాలు అంగీకరించకపోవ డంతో దేశం వెలుపలే ఉండిపోయారు. 2021లో అప్పటి అధ్యక్షుడు జొవెనెల్ను సాయుధులు ఇంట్లో ఉండగా∙ చంపారు. అప్పటి నుంచి హెన్రీ ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
HAITI: హైతీ ప్రధాని రాజీనామా
పోర్ట్ ఆవ్ ప్రిన్స్: హైతీ ప్రధాని ఏరియెల్ హెన్రీ తన పదవికి రాజీనామా చేశారు. హెన్రీ రాజీనామాను ఆమోదించినట్లు చైర్ ఆఫ్ ద కరేబియన్ కమ్యూనిటీ ఇర్ఫాన్ అలీ ప్రకటించారు. హెన్రీ హైతీకి చేసిన సేవలకుగాను ఈ సందర్భంగా అలీ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో తిరుగుబాటు చేసిన సాయుధ గ్యాంగులతో పోరాటంలో సహకరించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి(యూఎన్) ఇంటర్నేషనల్ సెక్యూరిటీ మిషన్‌ను కోరేందుకు గత నెల హెన్రీ కెన్యా వెళ్లారు. సరిగ్గా ఈ సమయంలో రాజధాని పోర్ట్ ఆవ్ ప్రిన్స్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దీంతో హెన్రీ దేశం బయటే అమెరికాకు చెందిన పూర్టో రికో ప్రాంతంలో ఉండిపోవాల్సి వచ్చింది. సాయుధ గ్యాంగులు హెన్రీ దిగిపోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హైతీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సోమవారం జమైకాలో ప్రాంతీయ నేతల సమావేశం జరిగింది. ఇంతలోనే హెన్రీ తన రాజీనామా సమర్పించారు. 2021లో అప్పటి దేశాధ్యక్షుడు మొయిస్ హత్య తర్వాత హెన్రీ హైతీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. హైతీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు వేగవంతం చేయాలని అమెరికా కూడా ఇప్పటికే కోరింది. హెన్రీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని, ఎన్నికలు జరగకుండా వాయిదా వేస్తున్నారని దేశంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. హైతీలో తొలుత శాంతి భద్రతలు పునరుద్ధరించాలని, స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగేందుకు కావాల్సిన వాతావరణాన్ని కల్పించాలని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ కోరారు. 2016 నుంచి హైతీలో ఎన్నికలు జరగలేదు. ఇదీ చదవండి.. అమెరికాలో టిక్‌టాక్ పాలిటిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్ -
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్.. న్యూజిలాండ్‌కు బిగ్ షాక్!
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు పేస్ బౌలర్ మాట్ హెన్రీ పక్కటెముక గాయం కారణంగా విండీస్ సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా ఇటీవల ముగిసిన యూరప్ పర్యటనలో న్యూజిలాండ్ జట్టులో హెన్రీ భాగంగా ఉన్నాడు. ఇక గాయపడిన హెన్రీ స్థానంలో బెన్ సియర్స్‌ను న్యూజిలాండ్ క్రికెట్ ఎంపిక చేసింది. ఇక ఇప్పటి వరకు టీ20లకు మాత్రమే పరిమితమైన సియర్స్.. ఇప్పుడు వన్డేల్లో కూడా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. "గత వారం ప్రాక్టీస్ సెషన్లో ఎడమ వైపు పక్కటెముకకు గాయమైంది. దీంతో అతడు తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు.అతడి గాయం తీవ్రమైనది కానప్పటికీ.. మేము ఆడించి రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు. ఈ క్రమంలో అతడికి విశ్రాంతి ఇవ్వాలని భావించాము. అ అతడు జట్టుకు దూరం కావడం మాకు పెద్ద ఎదురు దెబ్బ. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నాము" అని పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో విండీస్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడనుంది. మూడు వన్డేలు కూడా కింగ్స్టన్ ఓవల్ వేదికగానే జరగనున్నాయి. చదవండి: WI vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన విండీస్! యువ స్పిన్నర్ ఎంట్రీ -
హెన్రీ 15–7–23–7
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ పేస్ బౌలర్ మాట్ హెన్రీ (7/23) అద్భుత ప్రదర్శనతో చెలరేగడంతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 95 పరుగులకే కుప్పకూలింది. జుబేర్ హమ్జా (25) టాప్ స్కోరర్‌గా నిలవగా, ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. భారత్‌పై సిరీస్ గెలిచి జోరు మీదున్న సఫారీలు 49.2 ఓవర్లలోనే తలవంచారు. ఎల్గర్ (1), మార్క్రమ్ (15), వాన్ డర్ డసెన్ (8), బవుమా (7) విఫలం కావడంతో టీమ్ చేతులెత్తేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సందర్భంలో 1932 తర్వాత (నాడు 36 పరుగులు) దక్షిణాఫ్రికాకు టెస్టుల్లో ఇదే అత్యల్ప స్కోరు. వ్యక్తిగత కారణాలతో ట్రెంట్ బౌల్ట్ టెస్టుకు దూరం కావడంతో అవకాశం దక్కించుకున్న హెన్రీ పదునైన స్వింగ్, సీమ్ బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. తన ఏడో ఓవర్లో రెండు వికెట్లు తీసిన హెన్రీ... ఆ తర్వాత మరో ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. ఓవరాల్‌గా హెన్రీ వేసిన 15 ఓవర్లలో 7 మెయిడెన్లు ఉన్నాయి. అనంతరం న్యూజిలాండ్ తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 116 పరుగులు చేసి 21 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. నికోల్స్ (37 బ్యాటింగ్), కాన్వే (36) రాణించారు. ఫీల్డింగ్‌లోనూ ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేసిన దక్షిణాఫ్రికా జట్టు కివీస్‌కు కోలుకునే అవకాశం ఇచ్చింది. -
కనీసం 30 ఓవర్లయినా ఆడలేకపోయింది!
ఏమాత్రం ఆశల్లేకుండా కప్‌లో అడుగు పెట్టిన శ్రీలంక... తమ తొలి మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన కనబర్చింది. బ్యాట్స్‌మెన్ ఒకరి వెంట వరుస కట్టిన వేళ... జట్టు కనీసం 30 ఓవర్లయినా ఆడలేకపోయింది. శుక్రవారం వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్‌లాగే... శనివారం న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రత్యర్థిని కివీస్ పేసర్లు హెన్రీ, ఫెర్గూసన్ అల్లాడించారు. ముఖ్యంగా హెన్రీ పేస్, స్వింగ్ బంతులతో మొదట్లోనే దెబ్బ కొట్టాడు. అనంతరం బౌలింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయిన లంక 10 వికెట్ల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. కార్డిఫ్: ప్చ్...! లంక ఆట మారలేదు. ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌లోనూ వారి ఆటగాళ్లు ఫామ్ అందుకోలేదు. ఫలితం... న్యూజిలాండ్‌పై దారుణ ఓటమి. పేసర్లు రాణించడంతో రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక... మాట్ హెన్రీ (3/29), లాకీ ఫెర్గూసన్ (3/22) పేస్ దెబ్బకు 29.2 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ దిముత్ కరుణరత్నె (84 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు) ఒక్కడే అజేయంగా పోరాడాడు. కుశాల్ పెరీరా (24 బంతుల్లో 29; 4 ఫోర్లు), తిసారా పెరీరా (23 బంతుల్లో 27; 2 సిక్స్‌లు) కాసేపు నిలవగలిగారు. వీరు కాక మరే బ్యాట్స్‌మన్ రెండంకెల స్కోరు చేయలేకపోవడం గమనార్హం. అనంతరం ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ (51 బంతుల్లో 73 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), కొలిన్ మున్రో (47 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) దూకుడైన ఆటతో 16.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 137 పరుగులు చేసి న్యూజిలాండ్ లక్ష్యాన్ని అందుకుంది. లంకను కోలుకోలేని దెబ్బకొట్టిన హెన్రీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. అతడు మినహా...! హెన్రీ వేసిన తొలి బంతినే బౌండరీకి తరలించి తిరిమన్నె (4) లంక ఇన్నింగ్స్ ఖాతా తెరిచాడు. కానీ, మరుసటి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ ఔటివ్వకున్నా కివీస్ సమీక్ష కోరి విజయవంతమైంది. వన్‌డౌన్‌లో వచ్చిన కుశాల్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. హెన్రీ, బౌల్ట్ బౌలింగ్‌లో రెండేసి ఫోర్లు కొట్టాడు. అయితే, నాలుగు ఓవర్ల తొలి స్పెల్ ముగిసినా విలియమ్సన్... హెన్రీని కొనసాగించడం ఫలితం ఇచ్చింది. అతడి బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన కుశాల్ మిడాన్‌లో గ్రాండ్‌హోమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. మరుసటి బంతికి కుశాల్ మెండిస్ (0) స్లిప్‌లో గప్టిల్ డైవింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. ధనంజయ డిసిల్వా (4)ను ఫెర్గూసన్ ఎల్బీ చేశాడు. మాథ్యూస్ (0), జీవన్ మెండిస్ (1) ఇలా వచ్చి అలా వెళ్లారు. 60/6తో నిలిచిన ఈ దశలో కరుణరత్నె, తిసారా వికెట్ల పతనాన్ని అడ్డుకుని జట్టు స్కోరును 100 దాటించారు. కానీ, తిసారా, ఉదాన (1) వరుస ఓవర్లలో వెనుదిరగడంతో పరిస్థితి చేయిదాటింది. లక్మల్ (7), మలింగ (1) తర్వాత వరుస కట్టారు. 81 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కరుణరత్నె నాటౌట్‌గా మిగిలాడు. ప్రపంచ కప్‌లో ఇన్నింగ్స్ ఆసాంతం నాటౌట్‌గా నిలిచిన రెండో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఎదురులేకుండా... బంతి బ్యాట్‌పైకి వస్తుండటంతో ఛేదనలో కివీస్ ఓపెనర్లు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఆడారు. మలింగ వేసిన తొలి ఓవర్లోనే గప్టిల్ రెండు ఫోర్లు బాది దూకుడు చూపాడు. లక్మల్ బౌలింగ్‌లో మున్రో ఫోర్, సిక్స్‌తో ధాటిని ప్రదర్శించాడు. ఓవర్లు పెరుగుతున్న కొద్దీ స్కోరును మరింత ముందుకు తీసుకెళ్లారు. ఉదాన ఓవర్లో సిక్స్‌తో గప్టిల్ (39 బంతుల్లో), తిసారా బౌలింగ్‌లో రెండు పరుగులు చేయడం ద్వారా మున్రో (41 బంతుల్లో) అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 13వ ఓవర్లోనే కివీస్ 100 పరుగుల మార్క్ అందుకుంది. మిగిలినవాటిని మరో 3.1 ఓవర్లలోనే పూర్తి చేసి గెలిచేసింది. -
ప్రేమ గెలిచిన బహుమతి
♦ కథాసారం ప్రేమ ప్రేమనే అడుగుతుంది. కానీ ప్రేమను చూపించేదెలా? అవును! ప్రేమను చూపించాలంటే త్యాగం చెయ్యాలి. నిన్ను నువ్వు ఇచ్చుకోవాలి. నీ ఇష్టాన్ని వదులుకోవాలి. తనలో... తన సంతోషంలో నిన్ను చూసుకోవాలి. నువ్వే బహుమతి కావాలి... ప్రేమ గెలిచేంత బహుమతి కావాలి. ఒక డాలరు ఎనబై ఏడు సెంట్లు. మొత్తం ఉన్నది అంతే. మాంసమో, మరోటో కొన్నప్పుడల్లా జాగ్రత్తగా మిగిల్చిన ఒక్కో సెంటు అది. మూడుసార్లు లెక్కించింది డెల్లా. ఒక డాలర్ ఎనబై ఏడు సెంట్లు. రేపే క్రిస్మస్! మంచం మీద పడి ఏడవటం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి. డెల్లా అదే చేసింది. జేమ్స్ డిలింగ్హుమ్ యంగ్‌కు గతంలో వారానికి 30 డాలర్లు వచ్చేవి. ఇప్పుడు 20 డాలర్లే వస్తున్నప్పుడు ఆ పేరు మరీ పొడుగ్గా కనబడుతోంది. జేమ్స్ డి.యంగ్ అంటే చాలు. దాన్ని కూడా పొట్టి చేసి ‘జిమ్’ అని పిలుస్తుంది డెల్లా. ఏడ్చిన తర్వాత ఆ శోకపు గుర్తులను ముఖం మీద తుడిచేసుకుంది. కిటికీ దగ్గర నిలబడి నిరాసక్తంగా బయటకు చూసింది. రేపే క్రిస్మస్ పండుగ. జిమ్ కోసం బహుమతి కొనడానికి ఆమె దగ్గర ఉన్నవల్లా 1.87 డాలర్లు మాత్రమే. నెలలుగా పోగేసినదానికి ఇదీ ఫలితం! ఇరవై డాలర్లతో వారంపాటు ఇల్లు గడపడం సాధ్యమా? అన్నీ ధరలు పెరిగిపోయే. 1.87 డాలర్లు మాత్రం ఉన్నాయి జిమ్‌కు బహుమతి కొనడానికి. తన జిమ్ కోసం. జిమ్‌కు తగ్గ బహుమతి ఇవ్వాలని గంటలు గంటలు ఆలోచించింది. కానీ ఏం లాభం? గది కిటికీల మధ్య ఒక సన్నటి అద్దం ఉంది. దాన్లో మొత్తం మనిషి ఒకేసారి కనబడటం కష్టం. మొత్తం కనబడాలంటే కొంత నైపుణ్యం ఉండాలి. డెల్లా లాంటి నాజూకు అమ్మాయి ఆ కళలో నిష్ణాతురాలైంది. కిటికీ దగ్గర నుంచి వచ్చి అద్దం ముందు నిలబడింది. ఆమె కళ్లు కాంతిమంతంగా మెరుస్తున్నాయి. కానీ ముఖం వివర్ణమైంది. తన జుట్టును మొత్తంగా కిందికి వదిలేసింది. డెల్లా, జిమ్ దంపతులు రెండు విషయాలకు గర్వపడతారు. ఒకటి జిమ్ బంగారపు వాచీ. అది వాళ్ల నాన్న నుంచి అతడికి వచ్చింది. అంతకు చాలా ఏళ్ల క్రితం వాళ్ల తాతది. ఏ రాజు దగ్గర కూడా అలాంటి వాచీ ఉండివుండదు. ఇక వాళ్లు గొప్పగా భావించే రెండో విషయం, డెల్లా జుట్టు. ఆ జుట్టు ఏ రాణి దగ్గర ఉన్న వజ్రాభరణాల కన్నా కూడా అందమైనది. డెల్లా వదిలిన జుట్టు చూడ్డానికి గోధుమరంగు నీటిప్రవాహంలా మెరుస్తోంది. ఆమె మోకాళ్ల దగ్గరకు వచ్చింది. అదే ఆమెను దుస్తుల్లాగా కప్పింది. దాన్ని మళ్లీ త్వరగా ముడేసుకుంది. ముడేసుకున్నాక ఒక్క క్షణం అలా నిస్తేజంగా నిలుచుంది. రెండు కన్నీటి చుక్కలు ఆమె చెంపల మీదుగా జారిపోయినై. తన పాత బ్రౌన్ కోటు వేసుకుని, పాత బ్రౌన్ టోపీ పెట్టుకుని వీధిలోకి వచ్చింది. నడుస్తూ ఒక బోర్డు ఉన్న చోట ఆగింది. ‘మిసీజ్ సోఫ్రోనీ. అన్ని రకములైన జుట్టు సరుకులు’. రెండో అంతస్థు వరకు ఆగకుండా పరుగెత్తి, అలుపు తీర్చుకోవడానికి ఆగింది డెల్లా. తెల్లగా భారీగా వున్న మిసీజ్ సోఫ్రోనీ నిరాసక్తగా చూసింది డెల్లా వంక. ‘మీరు నా జుట్టు కొంటారా?’ అడిగింది డెల్లా. ‘నేను ఉన్నదే అందుకు’ అంది సోఫ్రోనీ. ‘నీ టోపీ తీసేయ్; జుట్టు చూడాలి’. మరోసారి గోధుమవర్ణపు నీటిప్రవాహం కిందకు జారింది. జుట్టు బరువును అంచనా వేస్తున్నట్టుగా ఎత్తి, ‘ఇరవై డాలర్లు’ అంది సోఫ్రోనీ. ‘త్వరగా ఇవ్వండి’ మరి రెండు గంటల పాటు డెల్లా నగరంలోని ఒక దుకాణం నుంచి మరో దుకాణానికి పరుగెత్తి్తంది, జిమ్‌కు తగిన బహుమతి వెతకడం కోసం. అన్ని దుకాణాలు గాలించిన తర్వాత ఎట్టకేలకు దొరికింది. అది కచ్చితంగా జిమ్ కోసమే తయారైవుండాలి. అదొక బంగారు వాచీ గొలుసు. నిరాడంబరంగా ఉంది. దాని గొప్పతనం అంతా దానికోసం వాడిన మెటీరియల్‌లో ఉంది. ఒకటేదైనా సరళంగా, నిరాడంబరంగా ఉందంటే అది విలువైనదని అర్థం చేసుకోవచ్చు. మంచి వస్తువులన్నీ అలాగే వుంటాయి. జిమ్ వాచీకి ఈ గొలుసు సరిగ్గా నప్పుతుంది. దానికోసం 21 డాలర్లు చెల్లించింది. దాన్ని తీసుకుని చేతిలో మిగిలిన ఎనబై ఏడు సెంట్లతో ఇంటికి వేగంగా నడిచింది. ఇక ఈ గొలుసు గనకవుంటే జిమ్ తన వాచీని ఎప్పుడైనా ఎక్కడైనా చూసుకోవచ్చు. అంత మంచి వాచీకి తగిన పట్టీ లేదు. అందువల్ల జిమ్ ఎవరి సమక్షంలోనైనా దాన్ని బయటకు తీసి టైమ్ చూసుకోవడానికి ఇబ్బంది పడేవాడు. ఇప్పుడిక ఆ బాధ లేదు. ఇంటికి వచ్చిన డెల్లా మనసు కాస్త కుదుట పడింది. ఇప్పుడు మరింత యుక్తిగా ఆలోచించి, కత్తిరించినది పోగా మిగిలిన జట్టును తన ముఖానికి నప్పేలా దువ్వింది. నలబై నిమిషాల తర్వాత ముఖం చూడబుద్ధేసేలా తయారైంది. పాఠశాల పిల్లాడిలాగా కనబడుతోంది. అద్దంలో తనను తాను చాలాసేపు అలాగే చూసుకుంది. ‘జిమ్ గనక నన్ను చంపకపోతే’ తనలో తాను అనుకుంది డెల్లా. ‘రెండోసారి నన్ను చూసినప్పుడు, డబ్బుల కోసం ఆడిపాడే అమ్మాయిలా ఉన్నాననుకుంటాడు. కానీ ఏం చేయగలను నేను? ఉన్న ఒక డాలర్ ఎనబై ఏడు సెంట్లతో.’ ఏడు వరకు డిన్నర్ రెడీ చేసింది. జిమ్ ఏరోజూ ఆలస్యంగా రాడు. వాచీ గొలుసును చేతిలో పట్టుకుని జిమ్ వచ్చే తలుపు దగ్గర కూర్చుంది. అతడి అడుగుల శబ్దం వినపడగానే ఆమె ముఖం పాలిపోయింది. ‘దేవుడా, ఆయన నేను ఇప్పుడు కూడా అందంగా ఉన్నాననుకునేట్టు చేయి’ అని లోలోపల ప్రార్థించింది. గుమ్మంలోంచి జిమ్ ఇంట్లోకి వచ్చాడు. డెల్లాను వింతగా చూశాడు. అతడి ముఖం అభావంగా ఉంది. డెల్లాకు దాన్ని చదవడం సాధ్యం కాక, భయపడింది. ‘జిమ్, డియర్’ అంటూ ఏడ్వడం మొదలుపెట్టింది. ‘నన్ను అలా చూడకు. నేను జుట్టును అమ్మేశాను. నీకు బహుమతి ఇవ్వకుండా ఈ క్రిస్మస్ గడపడం నా వల్లకాలేదు. నా జుట్టు త్వరగానే పెరుగుతుంది. నువ్వు పట్టించుకోవుకదా? మనం సంతోషంగా ఉందాం. నీకోసం ఏం తెచ్చానో చూడు’. ‘నువ్వు జట్టు కత్తిరించావా?’ నెమ్మదిగా అడిగాడు జిమ్. జరిగినది అర్థం చేసుకోవడానికి అతడు శ్రమపడ్డాడు. ‘కట్ చేసి అమ్మశాను’ చెప్పింది డెల్లా. ‘ఇప్పుడు నేను నచ్చడం లేదా? జుట్టు లేకపోయినా నేను నీ పాత డెల్లానే’. జిమ్ ఊరడిస్తున్నట్టుగా ఆమె చుట్టూ చేతులు వేశాడు. పది సెకన్ల తర్వాత తన కోటు జేబులోంచి కాగితంలో చుట్టివున్నదాన్ని టేబుల్ మీద పెట్టాడు. ‘నీ జుట్టు పోయినంత మాత్రాన నీ మీద నా ప్రేమ ఏమీ తగ్గదు డెల్. కానీ నువ్వు ఆ కాగితం తెరిచి చూస్తేగానీ నా బాధేమిటో నీకు అర్థం కాదు’. ఆ కాగితం విప్పుతూనే డెల్లా సంతోషంతో అరిచింది. ‘ఓ ఓ’. వెంటనే ఆ సంతోషం కన్నీళ్లుగా కరిగిపోయింది. అందమైన దువ్వెనలు! వాటికి నగలు పొదిగివున్నాయి. డెల్లా అందమైన జుట్టుకు బాగుంటాయని తెచ్చాడు. ఆమె వాటినో షాపులో చూసి ఇష్టపడింది. అవి ఖరీదైనవైనా తన సొంతం అవుతాయన్నంత విశ్వాసంతో చూసింది. అవి వచ్చేసరికి ఆమెకు జుట్టు లేకుండా పోయింది. ఇంకా జిమ్ తన బహుమతి ఏమిటో చూడలేదు. డెల్లా చేతిలో ఉన్న ఆ బంగారు గొలుసు ఆమె చేతిలా మెరుస్తోంది. ‘బాగుందా జిమ్? దీనికోసం నగరమంతా గాలించాను. నీ వాచీ ఇవ్వు’. జిమ్ కూర్చుని నవ్వాడు. ‘డెల్లా, మన క్రిస్మస్ బహుమతుల్ని కాసేపు పక్కన పెడదాం. ఆ దువ్వెనలు కొనడానికి నేను వాచీని అమ్మేశాను. మనం డిన్నర్ చేయడం మంచిదేమో’. భూమ్మీద ఎందరో బహుమతులు ఇచ్చుకుంటారు. కానీ ఈ యువదంపతులు ఒకరిమీద ఒకరికి గల అపారమైన ప్రేమతో ఇచ్చుకున్న బహుమతులు ఎంత గొప్పవి! ఒ.హెన్రీ అన్న కలంపేరుతో కీర్తినొందిన కొసమెరుపు కథల మాస్టర్ విలియమ్ సిడ్నీ పోర్టర్ కథ ‘ద గిఫ్ట్ ఆఫ్ మ్యాజీ’ సారం ఇది. 1862లో జన్మించి 1910లో మరణించిన ఈ అమెరికన్ కథకుడి ‘ద లాస్ట్ లీఫ్’ కథ కూడా జగత్ప్రసిద్ధం. ఒ.హెన్రీ -
పాయ్ ఇంటర్నేషనల్ నుంచి ఎల్ఈడీ టీవీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ పాయ్ ఇంటర్నేషనల్ తాజాగా ఎల్ఈడీ టీవీలను ప్రవేశపెట్టనుంది. ‘హెన్రీ’ పేరిట వీటిని ఈ పండుగ సీజన్లో అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ ఎండీ రాజ్‌కుమార్ పాయ్ చెప్పారు. ఇందుకోసం సుమారు రూ. 40-50 కోట్లు వెచ్చిస్తున్నామని ఆయన తెలిపారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 1,200 కోట్ల టర్నోవరు లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజ్‌కుమార్ శుక్రవారమిక్కడ విలేకరులకు తెలిపారు. 2015-16లో టర్నోవరు రూ. 890 కోట్లు. ప్రస్తుతం మొత్తం 80 స్టోర్స్ ఉన్నాయని, ఏటా 10-15 షోరూమ్‌లు నెలకొల్పడంపై దృష్టి పెడుతున్నామని ఆయన వివరించారు. ఇందుకు అవసరమయ్యే నిధులను ప్రస్తుతం అంతర్గతంగాను, బ్యాంకు రుణాల రూపంలోనూ సమకూర్చుకుంటున్నామన్నారు. విస్తరణ ప్రణాళికల అవసరాలను బట్టి వీసీల (వెంచర్ క్యాపిటలిస్టులు) నుంచి దాదాపు రూ. 500 కోట్లు సమీకరించే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో నేడు 6 షోరూమ్‌లు ప్రారంభం.. : కొత్తగా హైదరాబాద్‌లో మరో ఆరు షోరూమ్‌లు శనివారం ప్రారంభిస్తున్నట్లు రాజ్‌కుమార్ తెలిపారు. వీటితో కలిపి తెలంగాణంలో తమకు మొత్తం 15 స్టోర్స్ ఉన్నట్లవుతుందని, దశలవారీగా వీటిని 25కి పెంచుకోనున్నామని ఆయన తెలిపారు. ఒక్కో షోరూమ్‌కు రూ. 3-5 కోట్ల దాకా వెచ్చిస్తున్నట్లు వివరించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరలో కార్యకలాపాలు విస్తరించనున్నట్లు రాజ్‌కుమార్ పాయ్ చెప్పారు. -
హత్యలకి గల కారణమే, వివాహేతర సంబంధం!
శిక్ష మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 37 ఆ హత్యకి కారణం వైవాహిక జీవిత వ్యవస్థ పుట్టాక కొన్ని కోట్ల సార్లు జరిగిన హత్యలకి గల కారణమే, వివాహేతర సంబంధం! తన భార్య లూసీకి, తన ఫ్రెండ్ లేన్సింగ్‌తో గల సంబంధం గురించి హెన్రీకి తెలిసి నమ్మలేకపో యాడు. కానీ తను నియమించిన డిటెక్టివ్ ఋజువు సంపాదించి తెచ్చి చూపించాక నిర్ఘాంతపోయాడు. లేన్సింగ్ని చంపాలని నిర్ణ యించుకున్నాడు. లూసీ కోసం చంపు తున్నాడు కాబట్టి ఆమె కళ్ల ముందే అతణ్ని చంపదలచుకున్నాడు. తనని పోలీసులకి పట్టిస్తే తనమీద కన్నా లేన్సింగ్ మీదే ఆమెకి అధిక ప్రేమ ఉన్నట్లు లేదా తనని గాఢంగా ప్రేమిస్తున్నట్లు అని భావిం చాడు. తగిన అవకాశం కోసం ఓపికగా వేచి ఉన్నాడు.ఆ శనివారం రాత్రి తన ఇంటికి వచ్చిన లేన్సింగ్‌తో కలిసి ఎప్పటిలా హెన్రీ డ్రింక్ తీసుకున్నాడు. ఇద్దరూ పిట్ట గోడ దగ్గర నిలబడి ఉండగా హెన్రీ తన భార్యతో చెప్పాడు. ‘‘ఇటు చూడు లూసీ.’’ ఆమె తల తిప్పి చూడగానే లేన్సింగ్ రెండు కాళ్లూ పట్టుకుని ఎత్తి అతన్ని కింద పడేసాడు. ఏడో అంతస్థు నించి తలకిందు లుగా పడ్డ లేన్సింగ్ తల పగిలి పుర్రెలోని మెదడు కూడా బయటికి వచ్చేసింది. ఆడవాళ్లు ఎమోషనల్‌గా ప్రవర్తిస్తారు. ఆ ఎదురు చూడని దుర్ఘటనకి లూసీ సరిగ్గా అలాగే ప్రవర్తించింది. అయితే హెన్రీ పోలీసులు వచ్చేలోగా లూసీని తన అధీనంలోకి తీసుకోగలిగాడు. ‘‘లేన్సింగ్ తాగిన మత్తులో జారి కిందపడ్డాడని నేను పోలీసులతో చెప్తాను. నువ్వూ అదే చెప్పడం మంచిది. నువ్వు నిజం చెప్పినా అందుకు ఋజువు లేదు. ఋజువు లేని సాక్ష్యాన్ని కోర్టులో కొట్టే స్తారు. మనిద్దరి మీదా పత్రికల్లో అవా కులు, చెవాకులు రాస్తారు. వాటిలో ఒకటి లేన్సింగ్‌తో నీకు గల సంబంధం. ఆ ఋజువు కోర్టుకిస్తే, నాకు శిక్షపడే పక్షంలో నా ఆస్తిలోంచి నీకు పెన్నీ కూడా రాదు. కాబట్టి లేన్సింగ్ మరణం ప్రమాదవశాత్తూ జరిగిందని చెప్పడం నాకన్నా నీకే మంచిది. నేను అన్నిటికీ తెగించినవాణ్ని.’’ లూసీ పోలీసులు వచ్చేసరికి షాక్‌లోనే ఉంది. తన భర్త చెప్పిందే వారికి చెప్పింది. ఆమె మానసిక స్థితిని గమనించిన పోలీసులు కూడా లూసీని గుచ్చి గుచ్చి ప్రశ్నించలేదు. ‘‘లేన్సింగ్ డిప్రెస్డ్గా కనిపించాడు. ఒంటరిగా ఉండలేనని ఫోన్‌చేసి ఇంటికి వచ్చాడు. భోజనానికి మునుపు, తర్వాత చాలా తాగాడు. లాయర్‌గా లేన్సింగ్ ఆదాయం ఈ మధ్య బాగా తగ్గడం అందుకు కారణం’’ హెన్రీ పోలీసులకి చెప్పాడు. చివరగా లేన్సింగ్ టై పిట్టగోడ దగ్గరికి చేరుకున్నాక అతని కదలికల్ని గురించి కూడా చెప్పాడు. వాళ్లకి ఆ దంపతులు అబద్ధం ఆడుతున్నా రన్న అనుమానం కలగలేదు. లేన్సింగ్ ఆదాయం తగ్గిందన్న సంగతి వారి విచారణలో నిర్ధారణయ్యాక ఆ కేసుని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా మూసేసారు. తనకి వచ్చిన కేన్సర్.. మూలాల నించి తొలగిపోయిందని తెలిసిన రోగిలా ఆనందించాడు హెన్రీ. ‘‘లూసీ! లేన్సింగ్ చేసిన ద్రోహానికి అతన్ని నేను చంపాను. నేనిక ఎన్నటికీ వాడి మొహం చూడాల్సిన అవసరం లేదు’’ కొద్ది రోజుల తర్వాత హెన్రీ తన భార్యతో చెప్పాడు. ఆ హత్య జరిగాక మొదటిసారి లూసీ తన భర్త మొహం వంక కొద్దిసేపు దీర్ఘంగా చూసింది. ఆ మొహంలో పగ కాని, బాధ కాని, క్రోధం కాని, జాలి కాని... అసలెలాంటి భావాలు కనిపించలేదు. ‘‘ఏమిటా చూపు?’’ అడిగాడు. లూసీ జవాబు చెప్పలేదు. ఓ ప్రశ్న అడిగింది. ‘‘ఏం జరగనట్లే మానసిక క్షోభ లేకుండా జీవించగలరా? మీ ప్రియ మిత్రుడ్ని చంపాననే బాధ లేదా? మీరు శిక్షకి అర్హులని మీకు అనిపించడం లేదా?’’ ‘‘నా మీదకి దాడి చేసిన క్రూర మృగాన్ని చంపినట్లుగానే నీ ప్రియుడ్ని చంపాను. ఇది అతి పాత న్యాయం. కన్నుకి కన్ను. చేతికి చెయ్యి. శిక్ష దేనికి?’’ వారిద్దరి మధ్యా లేన్సింగ్ గురించి జరిగిన ఆఖరి సంభాషణ అది. హెన్రీ ఆమెకి ఇంకో ప్రియుడు లభించే అవకాశం కల్పించదలచుకోలేదు. తన భార్య పూర్తిగా తనకే దక్కాలనే స్వార్థంతో తన పన్నెండు మంది మగ మిత్రులకి దూరం అయ్యాడు. కాని ఆమె పెట్టెలో అడుగున వెదికి ఉంటే లూసీ లేన్సింగ్ని మర్చిపో లేకపోతోందని అతని ఫోటోని చూసి గ్రహించేవాడు. ఆఫీస్ పనిమీద హెన్రీ చికాగోకి కారులో బయదేరాడు. అకస్మాత్తుగా మంచు కురవసాగింది. కార్ రేడియోని ఆన్ చేస్తే మంచు తుఫాను అని తెలిసింది. ఇంకో అరగంటలో గమ్యానికి చేరతాడు కాబట్టి హెన్రీ కారుని మధ్యలో ఆపదలచు కోలేదు. కారుని జాగత్తగా, వేగం పరిమితి మించకుండా పోనివ్వసాగాడు. పొగ మంచు వల్ల రోడ్డు ఐదారు అడుగుల మేర దూరమే కనిపించసాగింది. పక్క రోడ్లోంచి వచ్చిన కలప లారీ డ్రైవర్‌కి హెన్రీ కారు కనపడలేదు. రెండు లైట్ల కాంతి హెన్రీ కంట్లో గుచ్చుకుంది. సరిగ్గా నాలుగైదు క్షణాల్లో అతని కారు ఆ పద హారు చక్రాల లారీ కిందికి వెళ్లిపోయింది. హెన్రీ మరణించలేదు. లూసీ హాస్పి టల్‌కి హెన్రీని చూడడానికి వచ్చినప్పుడు చెప్పింది. ‘‘డాక్టర్ ఇది అద్భుతం అని చెప్పాడు. మీ మొహానికి తప్ప శరీరంలోని ఇంకే భాగానికీ దెబ్బ తగల్లేదుట.’’ అతను ఆరు వారాలు హాస్పిటల్లోనే గడిపాడు. ఆరో వారం డాక్టర్ హెన్రీతో చెప్పాడు. ‘‘కట్లు విప్పాక తెలిసింది. మీ మొహం బాగా దెబ్బతింది. పిల్లలు చూస్తే జడుకునేలా ఉంది. ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. కాని అది మీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో కవర్ కాదు. మీరు వ్యక్తిగతంగా బిల్ చెల్లిస్తే ప్లాస్టిక్ సర్జన్ వచ్చి మిమ్మల్ని చూస్తాడు.’’ కట్లు విప్పిన అతని మొహాన్ని చూడ గానే లూసీ మొహం వివర్ణమైంది. ‘‘అంత భయంకరంగా ఉందా?’’ అడిగాడు. ‘‘అవును. మన ఇల్లు అమ్మయినా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోండి.’’ ‘‘ఇది నువ్వు కోరిన శిక్ష అనుకుంటు న్నావా? కాదు’’ చెప్పాడు. ఎనిమిది వారాల తర్వాత కట్లు విప్పారు. భర్తకి అద్దం ఇచ్చి చెప్పింది లూసీ... ‘‘చూసుకోండి.’’ అద్దంలోకి చూసిన హెన్రీ కెవ్వున అరిచాడు. ఎదురుగా లేన్సింగ్ ప్రతిబింబం కనిపించింది. ‘‘ప్లాస్టిక్ సర్జన్ ఆపరేషన్‌కి ముందు మీ ఫోటో అడిగితే లేన్సింగ్ ఫోటోని ఇచ్చాను. ఇది మీ నేరానికి తగిన శిక్ష’’ లూసీ నెమ్మదిగా చెప్పింది. (మిరియం లించ్ కథకి స్వేచ్ఛానువాదం)