New Zealand Vs West Indies ODI Series: New Zealand Pacer Matt Henry Ruled Out Due To Rib Injury - Sakshi
Sakshi News home page

NZ vs WI: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌.. న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌!

Published Sun, Aug 14 2022 10:45 AM | Last Updated on Sun, Aug 14 2022 11:31 AM

New Zealand pacer Matt Henry ruled out due to rib injury - Sakshi

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు పేస్‌ బౌలర్‌ మాట్ హెన్రీ పక్కటెముక గాయం కారణంగా విండీస్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా ఇటీవల ముగిసిన యూరప్ పర్యటనలో న్యూజిలాండ్‌ జట్టులో హెన్రీ భాగంగా ఉన్నాడు. ఇక గాయపడిన హెన్రీ స్థానంలో బెన్ సియర్స్‌ను న్యూజిలాండ్‌ క్రికెట్‌ ఎంపిక చేసింది.

ఇక ఇప్పటి వరకు టీ20లకు మాత్రమే పరిమితమైన సియర్స్‌.. ఇప్పుడు వన్డేల్లో కూడా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కివీస్‌ హెడ్‌ కోచ్‌  గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. "గత వారం ప్రాక్టీస్ సెషన్‌లో ఎడమ వైపు పక్కటెముకకు గాయమైంది. దీంతో అతడు తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు.అతడి గాయం తీవ్రమైనది కానప్పటికీ.. మేము ఆడించి రిస్క్‌ తీసుకోవాలని అనుకోలేదు.

ఈ క్రమంలో అతడికి విశ్రాంతి ఇవ్వాలని భావించాము. అ అతడు జట్టుకు దూరం కావడం మాకు పెద్ద ఎదురు దెబ్బ. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని ఆశిస్తున్నాము" అని పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో విండీస్‌ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడనుంది. మూడు వన్డేలు కూడా కింగ్‌స్టన్‌ ఓవల్ వేదికగానే జరగనున్నాయి.
చదవండి: WI vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. జట్టును ప్రకటించిన విండీస్‌! యువ స్పిన్నర్‌ ఎంట్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement