క్యాచ్‌ వదిలేశాడని బౌలర్‌ బూతు పురాణం | Shannon Gabriel AbusesBad Words On Darren Bravo Dropping Catch | Sakshi
Sakshi News home page

క్యాచ్‌ వదిలేశాడని బౌలర్‌ బూతు పురాణం

Published Sat, Dec 12 2020 1:34 PM | Last Updated on Sat, Dec 12 2020 4:09 PM

Shannon Gabriel AbusesBad Words On Darren Bravo Dropping Catch - Sakshi

వెల్లింగ్టన్‌ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో విండీస్‌ బౌలర్‌ షానన్ గాబ్రియేల్ సహచరు క్రికెటర్‌ డారెన్‌ బ్రావోపై నోరు పారేసుకున్నాడు. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ హెన్రీ నికోలస్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న బ్రావో జారవిడిచాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గాబ్రియేల్‌ బ్రావోనుద్దేశించి 'ఫక్‌ యూ..' అనే అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ విషయం స్టంపింగ్‌ మైక్‌లో రికార్డు అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. వెల్లింగ్టన్‌ వేదికగా విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కివీస్‌ ఇన్నింగ్స్‌ 41వ ఓవర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

అలా గాబ్రియేల్‌ బౌలింగ్‌లో 47 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న నికోలస్‌ ఆ తర్వాత 174 పరుగులు చేసి తన టెస్టు కెరీర్‌లో అత్యధిక స్కోరును నమోదు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం క్యాచ్‌ వదిలేసినందుకు ఎవరైనా ఇలా తిడతారా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : పుట్టినరోజునాడే యువీ ఎమోషనల్‌ ట్వీట్‌)

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 460 పరుగులకు ఆలౌటైంది. విండీస్‌ ఫేలవ బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో అన్ని రకాలుగా తేలిపోయింది. మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న హెన్రీ నికోలస్‌ 174 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో 42 బంతుల్లోనే 66 పరుగులు చేసిన బౌలర్‌ వాగ్నర్‌ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. జోషు దా సిల్వ, చేమర్‌ హోల్డర్‌ క్రీజులో ఉన్నారు. కివీస్‌ బౌలర్లో కైల్‌ జేమిసన్‌ 5 వికెట్లతో చెలరేగగా.. సౌతీ 3 వికెట్లతో రాణించాడు.(చదవండి : 'పేడ మొహాలు,చెత్త గేమ్‌‌ప్లే అంటూ..')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement