
మౌంట్‌మాంగనూయి : వెస్టీండీస్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. బే ఓవల్ మైదానం వేదికగా జరిగిన రెండో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కివీస్ బ్యాట్స్‌మన్లలో గ్లెన్ ఫిలిప్స్ 51 బంతుల్లోనే 108 పరుగులు చేయగా, కాన్‌వే 65, ఓపెనర్ గుప్టిల్ 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. మంచి హిట్టర్లతో కూడిన విండీస్ లైనప్‌లో ఏ ఒక్క బ్యాట్స్‌మన్ కూడా నిలదొక్కుకోకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేసి 72 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. కెప్టెన్ పొలార్డ్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, జేమిసన్ 2, సోదీ, సౌతీ, పెర్గ్యూసన్, నీషమ్ తలా ఒక వికెట్ తీశారు. (చదవండి : టీమిండియాపై స్మిత్ అరుదైన రికార్డు)
ఆకాశమే హద్దుగా చెలరేగిన ఫిలిప్స్
కివీస్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ ఫిలిప్స్ ఇన్నింగ్స్ ఆసాంతం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 46 బంతుల్లోనే సెంచరీ సాధించిన ఫిలిప్స్ న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేగాక ఫిలిప్స్ మూడో వికెట్‌కు డెవోన్ కాన్వే (65 నాటౌట్)తో కలిసి మూడో వికెట్‌కు 183 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. (చదవండి : వారెవ్వా అయ్యర్.. వాట్ ఏ త్రో)
Comments
Please login to add a commentAdd a comment