న్యూజిలాండ్ పేస్ బౌలర్ మాథ్యూ హెన్రీకి ఐపీఎల్‌లో ఆడే అవకాశం లభించింది. గత ఏడాది జరిగిన వేలంలో హెన్రీని ఏ జట్టూ తీసుకోలేదు. అయితే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సభ్యుడు, ఇంగ్లండ్ పేస్ బౌలర్ డేవిడ్ విల్లే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. దాంతో లక్నో ఫ్రాంచైజీ విల్లే స్థానంలో హెన్రీని అతని కనీస ధర రూ. 1 కోటీ 25 లక్షలకు తీసుకుంది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న 32 ఏళ్ల హెన్రీ న్యూజిలాండ్ తరఫున 25 టెస్టులు, 82 వన్డేలు, 17 టి20లు ఆడి 256 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment