![IPL 2025: LSG approach VVS Laxman for coaching role - Report](/styles/webp/s3/article_images/2024/07/21/vvs-laxman2.jpg.webp?itok=9JU-p--s)
భారత మాజీ క్రికెటర్, హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ ఐపీఎల్‌లోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కోచింగ్ స్టాప్‌లో లక్ష్మణ్ భాగం కానున్నట్లు సమాచారం.
లక్నో ఫ్రాంచైజీ తమ కోచింగ్ స్టాప్‌లోకి భారత దిగ్గజ ఆటగాళ్లను తీసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే లక్ష్మణ్‌పై కన్నేసినట్లు వినికిడి. అతడిని తమ జట్టు మెంటార్‌గా నియమించాలని లక్నో యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే లక్ష్మణ్‌తో లక్నో ఫ్రాంచైజీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
కాగా లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ( (NCA) ఛీప్‌గా ఉన్నాడు. లక్ష్మణ్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. తన కాంట్రాక్ట్‌ను పొడగించే అవకాశం బీసీసీఐ ఇచ్చినా.. వీవీయస్ మాత్రం అందుకు సుముఖంగా లేనట్లు సమాచారం.
లక్ష్మణ్ తన నిర్ణయాన్ని బీసీసీఐ ఇప్పటికే తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇక మెంటార్‌గా లక్ష్మణ్‌కు అపారమైన అనుభవం ఉంది. 2013 నుంచి 2021 వరకు ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు లక్ష్మణ్ పనిచేశాడు.
ఆ తర్వాత ఏన్సీఏ హెడ్‌గా బాధ్యతలు చేపట్టడంతో మెంటార్ పదవి నుంచి ఈ ఈ సొగసరి బ్యాటర్ తప్పుకున్నాడు. ఇక లక్ష్మణ్ తర్వాత ఎన్సీఏ ఛీప్‌గా మాజీ భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment