భారత క్రికెట్‌కు శుభవార్త. ఐపీఎల్ 2024 సందర్భంగా గాయపడిన యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ తిరిగి రంగంలోకి దిగాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అనంరతం మయాంక్ ఇవాళే ప్రాక్టీస్ షురూ చేశాడు. మయాంక్ నెట్స్‌లో సాధన చేస్తున్న దృశ్యాలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.
Mayank Yadav has been gearing up for the tour against Sri Lanka and Zimbabwe in July. pic.twitter.com/PZ7WS8mFo9
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 11, 2024
గత సీజన్‌తోనే లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన మయాంక్ ఆడిన 4 నాలుగు మ్యాచ్‌ల్లో తనేంటో రుజువు చేసుకున్నాడు. తన ప్రధాన అస్త్రమైన పేస్‌తో భారత క్రికెట్‌లో హాట్ టాపిక్ అయ్యాడు. దాదాపుగా ప్రతి బంతిని 150 కిమీ పైగా వేగంతో సంధించగల సత్తా ఉన్న మయాంక్.. తన పేస్ పదునుతో ప్రత్యర్ధులను గడగడలాడించాడు.
తన అరంగేట్రం మ్యాచ్‌లోనే (పంజాబ్‌పై (4-0-27-3)) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న మయాంక్.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో (4-0-14-3) మరింత రెచ్చిపోచి, వరుసగా రెండో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. సీజన్‌లో ముగిసే లోపు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంటాడనుకున్న తరుణంలో మాయంక్ గాయపడ్డాడు. గుజరాత్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన మయాంక్.. ఆ మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక ఓవర్ వేసి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత అతను తిరిగి బరిలోకి దిగలేదు.
తాజాగా గాయం పూర్తిగా నయం కావడంతో మయాంక్ తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. వచ్చే నెల (జులై) భారత జట్టు శ్రీలంక, జింబాబ్వే పర్యటనలకు వెళ్లాల్సి ఉండగా.. భారత సెలెక్టర్లు మయాంక్ పేరును పరిశీలించవచ్చని తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment