కేకేఆర్‌తో ల‌క్నో పోరు.. తుది జ‌ట్లు ఇవే! స్టార్ బౌల‌ర్ దూరం | Lucknow Super Giants Opt To Bowl Against Kolkata Knight Riders | Sakshi
Sakshi News home page

KKR vs LSG: కేకేఆర్‌తో ల‌క్నో పోరు.. తుది జ‌ట్లు ఇవే! స్టార్ బౌల‌ర్ దూరం

Published Sun, May 5 2024 7:19 PM | Last Updated on Sun, May 5 2024 7:26 PM

Lucknow Super Giants Opt To Bowl Against Kolkata Knight Riders

ఐపీఎల్‌-2024లో మ‌రో కీల‌క స‌మ‌రానికి రంగం సిద్ద‌మైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఏక్నా స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ల‌క్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ల‌క్నో యువ పేస‌ర్ మ‌యాంక్ యాద‌వ్ దూర‌మ‌య్యాడు. అత‌డి స్ధానంలో య‌ష్ ఠాకూర్ వ‌చ్చాడు. మ‌రోవైపు కేకేఆర్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగింది .

తుది జ‌ట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా

లక్నో సూపర్ జెయింట్స్:  కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement