39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81
కోల్‌కతాకు ఎనిమిదో విజయం
పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి
98 పరుగులతో ఓడిన లక్నో
లక్నో: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ టోరీ్నలో ఎనిమిదో విజయం నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 98 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గతంలో రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా తాజా విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచి్చంది. రాజస్తాన్, కోల్‌కతా జట్లు 16 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ... మెరుగైన రన్‌రేట్‌తో కోల్‌కతా టాప్ ర్యాంక్‌ను అందుకుంది.
టాస్ గెలిచి లక్నో జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు సాధించింది. ఓపెనర్ సునీల్ నరైన్ (39 బంతుల్లో 81; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరిపించాడు. ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్), రమణ్‌దీప్ సింగ్ (6 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడారు. అనంతరం 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన లక్నో జట్టు 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. స్టొయినిస్ (21 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు.
ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ మరోసారి కోల్‌కతా జట్టుకు శుభారంభాన్నిచ్చారు. తొలి బంతి నుంచే వీరిద్దరు లక్నో బౌలర్ల భరతం పట్టారు. మోసిన్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో నరైన్ చెలరేగిపోయాడు. వరుసగా మూడు ఫోర్లతోపాటు ఒక సిక్స్ కూడా బాదడంతో ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. ఐదో ఓవర్లో సాల్ట్ అవుట్‌కాగా, పవర్‌ప్లే ముగిసేసరికి కోల్‌కతా 70 పరుగులు సాధించింది.
పవర్‌ప్లే తర్వాత కూడా నరైన్ తన జోరు కొనసాగించాడు. 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టొయినిస్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో నరైన్ మూడు సిక్స్‌లు కొట్టాడు. రవి బిష్ణోయ్ వేసిన 12వ ఓవర్లో ఒక సిక్స్ కొట్టిన నరైన్ ఆ తర్వాత మరో భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. నరైన్ వెనుదిరిగాక... శ్రేయస్, రమణ్‌దీప్ దూకుడును కొనసాగించడంతో కోల్‌కతా స్కోరు 230 దాటింది.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) రాహుల్ (బి) నవీనుల్ 32; నరైన్ (సి) సబ్–పడిక్కల్ (బి) బిష్ణోయ్ 81; రఘువంశీ (సి) రాహుల్ (బి) యు«ద్‌వీర్ 32; రసెల్ (సి) సబ్–గౌతమ్ (బి) నవీనుల్ 12; రింకూ సింగ్ (సి) స్టొయినిస్ (బి) నవీనుల్ 16; శ్రేయస్ అయ్యర్ (సి) రాహుల్ (బి) యశ్ ఠాకూర్ 23; రమణ్‌దీప్ సింగ్ (నాటౌట్) 25; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 235. వికెట్ల పతనం: 1–61, 2–140, 3–167, 4–171, 5–200, 6–224.
బౌలింగ్: స్టొయినిస్ 2–0–29–0, మోసిన్ ఖాన్ 2–0–28–0, నవీనుల్ హక్ 4–0–49–3, యశ్ ఠాకూర్ 4–0–46–1, కృనాల్ పాండ్యా 2–0–26–0, రవి బిష్ణోయ్ 4–0–33–1, యు«ద్‌వీర్ సింగ్ 2–0–24–1.
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) రమణ్‌దీప్ (బి) హర్షిత్ 25; అర్షిన్ (సి) రమణ్‌దీప్ (బి) స్టార్క్ 9; స్టొయినిస్ (సి) హర్షిత్ (బి) రసెల్ 36; దీపక్ హుడా (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 5; పూరన్ (సి) సాల్ట్ (బి) రసెల్ 10; బదోని (సి) స్టార్క్ (బి) నరైన్ 15; టర్నర్ (సి అండ్ బి) వరుణ్ 16; కృనాల్ పాండ్యా (సి) సాల్ట్ (బి) హర్షిత్ 5; యు«ద్‌వీర్ (సి) రసెల్ (బి) వరుణ్ 7; బిష్ణోయ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షిత్ 2; నవీనుల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 137. వికెట్ల పతనం: 1–20, 2–70, 3–77, 4–85, 5–101, 6–109, 7–125, 8–129, 9–137, 10–137.
బౌలింగ్: వైభవ్ 2–0–21–0, స్టార్క్ 2–0–22–1, నరైన్ 4–0–22–1, హర్షిత్ రాణా 3.1–0–24–3, వరుణ్ చక్రవర్తి 3–0–30–3, రసెల్ 2–0–17–2.
Comments
Please login to add a commentAdd a comment