కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్‌లగా వెనుదిరిగిన ప్లేయర్‌గా నరైన్ నిలిచాడు.
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌటైన నరైన్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో నరైన్ ఇప్పటివరకు 44 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.
ఇంతకుముందు ఈ చెత్త రికార్డు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అలెక్స్ హెల్స్ పేరిట ఉండేది. హెల్స్ 43 సార్లు డకౌటయ్యాడు. తాజా మ్యాచ్‌తో హెల్స్‌ను నరైన్ అధిగమించాడు. అదే విధంగా ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన రెండో ఆటగాడిగా పియూష్ చావ్లా సరసన సునీల్ నరైన్ నిలిచాడు.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 16 సార్లు ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ డకౌటయ్యాడు. దీంతో పాటు మరో రికార్డును కూడా నరైన్ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్( అంతర్జాతీయ, లీగ్‌లు)లో 550 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా సునీల్ నరైన్ నిలిచాడు.
ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 625 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ 574 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment