
PC:BCCI/IPL.com
వెస్టిండీస్ మాజీ క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ సునీల్ నరైన్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నరైన్ తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు తిరిగి జాతీయ జట్టుకు ఆడేందుకు నరైన్ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
విండీస్ క్రికెట్‌తో పాటు ఆ జట్టు టీ20 కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ సైతం నరైన్‌ను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయంపై విండీస్ క్రికెట్ నుంచి కానీ నరైన్ నుంచి కానీ ఇప్పటవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కాగా నరైన్ ప్రస్తుతం ఐపీఎల్-2024 సీజన్‌లో దుమ్ములేపుతున్నాడు. ఆటు బ్యాట్‌తోనూ ఇటు బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌గా వస్తున్న నరైన్ ప్రత్యర్ధి జట్లపై విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్నాడు.
ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన నరైన్.. 276 పరుగులు చేశాడు. ఆటు బౌలింగ్‌లోనూ 7 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడినిటీ20 వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్‌లో భాగం చేయాలని విండీస్ క్రికెట్ ప్లాన్ చేస్తోంది. కాగా నరైన్ గతేడాది నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు విండీస్ తరపున చివరి మ్యాచ్ 2019లో ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment