ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 30) లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. లక్నో హోం గ్రౌండ్ అయిన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎఖానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు. లక్నో జట్టులో మరిన్ని మార్పులు జరిగాయి. క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. అర్షిన్ కులకర్ణి జట్టులోకి వచ్చాడు.
ముంబై విషయానికొస్తే.. లూక్ వుడ్ స్థానంలో గెరాల్డ్ కొయెట్జీ తిరిగి జట్టులోకి వచ్చాడు. లక్నో ఈ మ్యాచ్‌తో పాటు మిగతా మ్యాచ్‌లన్నీ గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ముంబై ప్లే ఆఫ్స్‌పై ఆశలు దాదాపుగా వదులుకుంది. ప్రస్తుతం లక్నో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. ముంబై చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.
తుది జట్లు..
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా
ఇంపాక్ట్ ప్లేయర్స్: నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, డెవాల్డ్ బ్రెవిస్, నమన్ ధీర్, షమ్స్ ములానీ
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్
ఇంపాక్ట్ ప్లేయర్స్: అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్
Comments
Please login to add a commentAdd a comment