ఐపీఎల్-2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ ఏప్రిల్ 30న ఏక్నా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్ అందింది.
గాయం కారణంగా గత నాలుగు మ్యాచ్‌లకు దూరమైన ఆ జట్టు పేస్ సంచలనం మయాంక్ యాదవ్.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. సోమవారం నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షను మయాంక్ క్లియర్ చేశాడు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ధ్రువీకరించాడు.
దీంతో అతడు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు జట్టు సెలక్షన్‌కు యాదవ్ అందుబాటులో ఉండనున్నాడు. "మయాంక్ యాదవ్ ఫుల్ ఫిట్‌గా ఉన్నాడు. అతడు అన్ని రకాల ఫిట్‌నెస్ టెస్ట్‌లను క్లియర్ చేశాడు. మాకు ఇది నిజంగా గుడ్ న్యూస్. మంగళవారం జరిగే మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండనున్నాడు.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా అతడిని ఉపయోగించే ఛాన్స్ ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్‌లో మోర్కెల్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో మయాంక్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. 155 కిలోమీటర్ల పైగా వేగంతో బౌలింగ్ చేసి ప్రత్యర్ధి బ్యాటర్లను వణికించాడు.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మయాంక్ ఫిట్‌నెస్ సాధించడం టీమిండియాకు కూడా కలిసిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. మయాంక్‌ను టీ20 వరల్డ్‌కప్-2024కు ఎంపిక చేసే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment