లక్నో సూపర్ జెయింట్స్ యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ తన ఐపీఎల్ అరంగేట్ర సీజన్‌లో సత్తాచాటుతున్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడిన మయాంక్ యాదవ్ 6 వికెట్లు పడగొట్టి.. పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనే ఆరు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మయాంక్.. దురదృష్టవశాత్తు ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో గాయపడ్డాడు.
భుజం నొప్పి కారణంగా కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేసి యాదవ్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయం అంత తీవ్రమైనది కానిట్లు తెలుస్తోంది. అతడు రాబోయే మ్యాచ్‌ల్లో కూడా సత్తాచాటేందుకు సిద్దంగా ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో తన సంచలన బౌలింగ్‌తో అదరగొట్టిన మయాంక్‌పై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది.
ఈ జాబితాలో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ చేరాడు. మయాంక్‌కు అద్బుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని, ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని ఎంఎస్‌కే అభిప్రాయపడ్డాడు.
"మయాంక్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను భయపెడుతున్నాడు. అతడి బౌలింగ్ స్పీడ్‌కు వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం ఆడేందుకు ఇబ్బంది పడతున్నాడు. అతడు భవిష్యత్తులో భారత జట్టుకు ముఖ చిత్రంగా మారుతాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు మహ్మద్ షమీ దూరమయ్యాడు. ఇప్పుడు సెలక్టర్లు బుమ్రా, సిరాజ్‌తో పాటు బంతిని షేర్ చేసుకునే మూడో పేసర్ కోసం వెతుకుతున్నారు.
కాబట్టి షమీ స్ధానాన్ని వరల్డ్‌కప్ జట్టులో మయాంక్‌తో భర్తీ చేయాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ యాదవ్‌లో ఉన్నాయి. అతడు ప్రస్తుతం ఆడుతున్నది వేరే ఫార్మాట్ అయితే నేను కాస్త ఆలోచించి నా నిర్ణయాన్ని వెల్లడించేవాడిని.
కానీ ఐపీఎల్ అనే అనేది ఒక మెగా వేదిక. ఇక్కడ ప్రదర్శన చేయడం అంత సులభం కాదు. ప్రతి గేమ్‌లో ఒత్తిడి ఉంటుంది. కానీ మయాంక్ మాత్రం ఒత్తడిని తట్టుకుని మరి నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. అందుకే అతడికి వరల్డ్‌కప్ కోసం భారత జట్టులో చోటు ఇవ్వాలని సూచిస్తున్నాని" ప్రసాద్ రేవ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు
Comments
Please login to add a commentAdd a comment