మయాంక్ యాదవ్ (PC: LSG/IPL)
లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం మయాంక్ యాదవ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. కెప్టెన్ కేఎల్ రాహుల్ సహా పలువురు మాజీ క్రికెటర్లు ఈ ‘స్పీడ్‌గన్’ నైపుణ్యాలకు ఫిదా అవుతున్నారు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో మయాంక్ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే.
గంటకు 156.7 కిలో మీటర్ల వేగంతో బంతిని విసిరి ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేశాడు మయాంక్. ఇక మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు కూల్చాడు.
పవన కుమారుడు... తుఫాన్
ఈ క్రమంలో 21 ఏళ్ల ఫాస్ట్ బౌలర్‌ను.. పవన కుమారుడిగా అభివర్ణిస్తూ వెస్టిండీస్ మాజీ స్టార్ ఇయాన్ అభినందించాడు. మరోవైపు.. టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్.. తుఫా..న్ అంటూ కొనియాడాడు. ఇక మయాంక్ ఆరాధ్య ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ అయితే.. సీరియస్ బాల్ అంటూ ప్రశంసలు కురిపించాడు.
𝙎𝙃𝙀𝙀𝙍 𝙋𝘼𝘾𝙀! 🔥🔥
— IndianPremierLeague (@IPL) April 2, 2024
Mayank Yadav with an absolute ripper to dismiss Cameron Green 👏
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/sMDrfmlZim
ఇక టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం ఈ పేస్ గన్ గురించి ప్రస్తావిస్తూ.. అతడు ఇదే జోరు కొనసాగిస్తే పర్పుల్ క్యాప్ రేసులో నిలవడం ఖాయమన్నాడు. ‘‘మయాంక్ యాదవ్ మరోసారి తన పేస్‌తో ప్రత్యర్థి జట్టును కకావికలం చేశాడు.
సెలక్టర్లను ఆలోచించేలా చేస్తాడు
గత మ్యాచ్‌లో 155.8KMPH.. ఇప్పుడు 156.7KMPH. ఏంటా వేగం? కచ్చితంగా అతడు పర్పుల్ క్యాప్ రేసులో ఉంటాడు. అంతేకాదు.. టీమిండియాకు సెలక్ట్ అవుతాడో లేదో గానీ.. కచ్చితంగా టీ20 వరల్డ్‌కప్ జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లు తన గురించి ఆలోచించేలా చేస్తాడు’’ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
అదే విధంగా.. ఆర్సీబీతో మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించిన లక్నో ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను సైతం ప్రశంసించాడు. కాగా లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు మయాంక్ యాదవ్.
వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో
ఐపీఎల్-2024లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే తన స్పీడ్ పవర్‌ను బ్యాటర్లకు పరిచయం చేశాడు. మూడు వికెట్లు తీసి ఆ మ్యాచ్‌లో జట్టును గెలిపించాడు. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ లక్నో విజయంలో కీలక పాత్ర పోషించి వరుసగా రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్నాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఆరు వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు.
చదవండి: MI: పాండ్యా ఒక్కడిని అలా వదిలేశారు.. అంతటికీ కారణం పెద్ద తలకాయలే!
Comments
Please login to add a commentAdd a comment