ఐపీఎల్-2025 సీజన్ ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని వీడిడంపై ఊహాగానాలు ఊపుందుకున్నాయి. రోహిత్ వచ్చే ఏడాది సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్‌తో జతకట్టనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అతడి కోసం ఎంత మొత్తాన్ని నైనా వెచ్చించేందుకు లక్నో ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా లక్నో ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి.
"శర్మ వేలంలోకి వస్తే అతడిని స్వాగతించేందుకు లక్నో సూపర్ జెయింట్స్ సిద్దంగా ఉంది. అతడు చాలా గొప్ప ఆటగాడు. హిట్‌మ్యాన్ వేలంలోకి వస్తే ప్రతీ ఫ్రాంచైజీ అతడిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ముంబై ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న సమయంలో రోహిత్‌తో చాలా క్లోజ్‌గా పనిచేశా. అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకెంతో ఇష్టమని" న్యూస్ 24కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోడ్స్ పేర్కొన్నాడు. దీంతో రోహిత్‌పై లక్నో దృష్టిసారించినట్లు తేటతెల్లమైంది.
కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి ముంబై తమ జట్టు పగ్గాలు అప్పగించింది.
అప్పటి నుంచి ముంబై యాజమాన్యం పట్ల హిట్‌మ్యాన్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీ మారేందుకు రోహిత్ శర్మ సిద్దమైనట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment