
హామిల్టన్ హ్యాట్రిక్
సింగపూర్: ఇటలీ, బెల్జియం గ్రాండ్‌ప్రిలలో నెగ్గిన హామిల్టన్ సింగపూర్ రేసులోనూ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఆదివారం వర్షంలో సాగిన ఈ సింగపూర్ రేసును 61 ల్యాప్‌ల నుంచి 58కి కుదించారు. ఐదో స్థానం నుంచి రేసును ప్రారంభించిన హామిల్టన్ 2 గంటల 45 ని.008 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ రికియార్డో రెండో స్థానం పొందగా, వాల్టెరి బొటాస్ (మెర్సిడెజ్) మూడో స్థానంలో నిలిచాడు.
ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్ ఐదు, ఈస్టెబన్ ఒకాన్ పదో స్థానం సాధించారు. ‘పోల్ పొజిషన్’ సాధించిన వెటెల్ (ఫెరారీ) కారు ఇంజిన్‌లో సమస్య వల్ల తొలి ల్యాప్‌లోనే వైదొలిగాడు. సీజన్‌లోని తదుపరి రేసు మలేసియా గ్రాండ్‌ప్రి అక్టోబర్ 1న జరుగుతుంది.