హామిల్టన్‌కు ‘పోల్‌’ | Hamilton is the winner of the Spanish Grand Prix | Sakshi

హామిల్టన్‌కు ‘పోల్‌’

May 26 2019 4:59 AM | Updated on May 26 2019 4:59 AM

Hamilton is the winner of the Spanish Grand Prix - Sakshi

మొనాకో: ఈ సీజన్‌లో వరుసగా ఆరో రేసులోనూ మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్లు హామిల్టన్, బొటాస్‌ తొలి రెండు స్థానాల నుంచి ప్రారంభించనున్నారు. శనివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో హామిల్టన్‌ అందరికంటే వేగంగా ఒక నిమిషం 10.166 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ‘పోల్‌ పొజిషన్‌’ సాధించాడు. హామిల్టన్‌ సహచరుడు వాల్తెరి బొటాస్‌ ఒక నిమిషం 10.252 సెకన్లలో ల్యాప్‌ను ముగించి రెండో స్థానంలో నిలిచాడు. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) మూడో స్థానం నుంచి, వెటెల్‌ (ఫెరారీ) నాలుగో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. గత ఐదు రేసుల్లో మెర్సిడెస్‌ డ్రైవర్లకే టైటిల్స్‌ లభించాయి. ఆస్ట్రేలియా, అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రిలలో బొటాస్‌... బహ్రెయిన్, చైనా, స్పెయిన్‌ గ్రాండ్‌ప్రిలలో హామిల్టన్‌ విజేతలుగా నిలిచారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement