Race championship
-
క్రీడారంగంలో అడుగుపెట్టిన నాగచైతన్య.. ఏ టీమ్ అంటే?
టాలీవుడ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్ అంచనాలు మరింత పెంచేశాయి. ఈ మూవీని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.అయితే నాగచైతన్య తాజాగా క్రీడారంగంలోకి అడుగుపెట్టారు. అదేంటి ఆయన యాక్టర్ కదా.. ప్లేయర్ ఎప్పుడు అయ్యారని అనుకుంటున్నారా? అదేం కాదండి. ఎందుకంటే ఆయన ఎంట్రీ ఇస్తున్నది ఆటగాడిగా కాదు.. యజమానిగా. ప్రముఖ ఫార్ములా రేసింగ్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్‌ను చైతూ కొనుగోలు చేశారు. దీంతో ఓ రేసింగ్ టీమ్ యజమానిగా టాలీవుడ్లో మొదటి హీరోగా నిలిచారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్-2024 గేమ్స్ ఆగస్ట్ 24 నుంచి మొదలుకానున్నాయి.కాగా.. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో మొత్తం ఆరు టీమ్స్ పోటీపడనున్నాయి. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌తో పాటు కోల్‌కతా రాయల్ టైగర్స్, స్పీడ్ డెమోస్ ఢిల్లీ, చెన్నై టర్బో రైడర్స్, బెంగళూరు స్పీడ్‌స్టర్స్, గోవా ఏసెస్ జేఏ రేసింగ్‌లో పోటీ పడనున్నాయి. వీటిలో కోల్‌కతా రాయల్ టైగర్స్ టీమ్‌కు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఓనర్‌గా వ్యవహరించనున్నాడు. స్పీడ్ డెమోస్ ఢిల్లీ టీమ్‌ను అర్జున్ కపూర్, గోవా ఏసెస్ టీమ్‌ను జాన్ అబ్రహం కొనుగోలు చేశారు.Yuva Samrat @chay_akkineni leads the charge at the Indian Racing Festival with Hyderabad Blackbirds ❤🔥💥Catch all the action at the Indian Racing Festival 2024 🏁✨#IndianRacingFestival #NagaChaitanya #BlackBirdsHyderabad #IRL2024 pic.twitter.com/KhNVc1Lti1— TeamAkkineni (@TeamAkkineni) August 22, 2024 -
Race Walking Championship 2023: అక్ష్దీప్ సింగ్‌కు స్వర్ణం
నోమి (జపాన్): ఆసియా 20 కిలోమీటర్ల రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ అక్ష్దీప్ సింగ్ 1 గంట 20 నిమిషాల 57 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఓపెన్ కేటగిరీలో పోటీపడిన భారత అథ్లెట్లు వికాష్ సింగ్, పరమ్‌జీత్ ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు, పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. ప్రపంచ చాంపియన్‌షిప్, పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయం 1 గంట 20 నిమిషాల 10 సెకన్లను వికాష్ (1గం:20ని :05 సెకన్లు), పరమ్‌జీత్ (1గం: 20:08 సెకన్లు) అందుకున్నారు. నిబంధనల ప్రకారం ఓపెన్ కేటగిరీలో పోటీపడిన వారి సమయాన్ని పతకాల కోసం పరిగణనలోకి తీసుకోరు. -
వెన్నులో వణుకుపుట్టించిన దృశ్యం.. గాల్లో కార్ల రేసింగ్
ఫార్ములా వన్ రేసింగ్... కార్లు జెట్‌స్పీడ్‌లో ట్రాక్‌మీద దూసుకుపోతుంటే... ఊపిరి బిగబట్టి చూడటం ప్రేక్షకుల వంతవుతుంది. ఇక అవే కార్లు గాల్లో ఎగిరిపోతుంటే ఉండే థ్రిల్ అంతా ఇంతా కాదు. వినడానికే వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ఈ ఎగిరేకార్ల రేసింగ్ గురువారం నాడు ఆస్ట్రేలియాలో జరిగింది. దీపావళి పండుగరోజు మన దగ్గర రాకెట్ పటాకులు ఆకాశంలో కాంతులీనితే... ఆస్ట్రేలియాలో మాత్రం రెండు కార్లు గాల్లో దూసుకుపోయాయి. ఎయిర్‌స్పీడర్ సంస్థ ఎక్సా సిరీస్ పేరుతో నిర్వహించిన ఫ్లయింగ్ కార్స్ రేస్‌లో అలౌడా ఎరోనాటిక్స్ కంపెనీ తయారు చేసిన ఎమ్కె3 (ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ అండ్ల్యాండింగ్) కార్లు పాల్గొని విజయవంతంగా రేస్ పూర్తి చేశాయి. రన్‌వే అవసరమే లేదు... ఈ కార్లను నిపుణులైన ఆపరేటర్స్ రిమోట్ సా యంతో (డ్రోన్ల మాదిరిగా) కంట్రోల్ చేశారు. ఈ ఎమ్కె3 ఎగిరే కార్లు టేకాఫ్ అయిన 2.3 సెకన్లలోనే గంటకు వంద కి.మీ. వేగాన్ని అందుకోగలవు. సాధారణంగా విమానం, హెలికాప్టర్ టేకాఫ్ అవ్వడానికి రన్‌వే అవసరం. కానీ.. ఈ కార్లలో ఉన్న వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ కోసం థర్డ్ డైమెన్షన్‌ను యాడ్ చేశారు. దీంతో ఉన్న చోటనుంచే గాల్లోకి ఎగరగలదు కారు. 2022 నాటికి పైలట్ నడిపేట్టుగా... దాదాపు వంద కేజీల బరువున్న ఈ కార్లను కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. పైలట్ నడపాలంటే మాత్రం ఎమ్కె 4 తయారు చేయాలంటోంది కంపెనీ. 2022 కల్లా సాధ్యం చేసి చూపిస్తామని చెబుతోంది. క్షణాల్లో బ్యాటరీ రిప్లేస్మెంట్... సాధారణంగా ఫార్ములావన్ రేసింగ్‌లో ఫ్లాట్ టైర్ అయితే క్షణాల్లో మార్చే అవకాశం ఉంటుంది. ఫ్లయింగ్ కార్లలోనూ బ్యాటరీ రిప్లేస్మెంట్ వేగంగా చేయడం కోసం స్లైడ్ అండ్ లాక్ సిస్టమ్ రూపొందించారు. కారు గాల్లో ఉన్నప్పుడు రోటర్ లేదా బ్యాటరీ సిస్టమ్ ఫెయిల్ అయినా సురక్షితంగా ల్యాండయ్యేలా రూపొందించారు. సో పైలట్ సేఫ్. 2050 నాటికి లక్షల కోట్ల ఇండస్ట్రీ... జాబీ, అలౌడా, జెట్సన్, మేజర్ వంటి ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీలన్నీ ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ వాహనాల మీద పనిచేస్తున్నాయి. ఈ ‘ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఇండస్ట్రీ’ 2050 సంవత్సరం నాటికి లక్షన్నర కోట్ల పరిశ్రమగా అవతరిస్తుందని మోర్గన్ స్టాన్లీ అంచనా. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
హామిల్టన్‌కు ‘పోల్’
మొనాకో: ఈ సీజన్లో వరుసగా ఆరో రేసులోనూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు హామిల్టన్, బొటాస్ తొలి రెండు స్థానాల నుంచి ప్రారంభించనున్నారు. శనివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 10.166 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. హామిల్టన్ సహచరుడు వాల్తెరి బొటాస్ ఒక నిమిషం 10.252 సెకన్లలో ల్యాప్‌ను ముగించి రెండో స్థానంలో నిలిచాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానం నుంచి, వెటెల్ (ఫెరారీ) నాలుగో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. గత ఐదు రేసుల్లో మెర్సిడెస్ డ్రైవర్లకే టైటిల్స్ లభించాయి. ఆస్ట్రేలియా, అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలలో బొటాస్... బహ్రెయిన్, చైనా, స్పెయిన్ గ్రాండ్‌ప్రిలలో హామిల్టన్ విజేతలుగా నిలిచారు. -
వజీర్ ఘోరికి స్వర్ణం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: నిజాం కాలేజి విద్యా సంఘం మాజీ అధ్యక్షుడు సి.దేవేందర్ యాదవ్ స్మారక రాష్ట్ర స్థాయి రోడ్ రేస్ చాంపియన్‌షిప్‌లో 3 కి.మీ రన్లో ఓయూ అథ్లెట్ సయ్యద్ వజీర్ ఘోరి 10ని.08.90 సెకన్లలో గమ్యం చేరి స్వర్ణం గెలుచుకున్నాడు. హైదరాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్, హైదరాబాద్ కోచింగ్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిజాం కాలేజి మైదానంలో శనివారం ఉదయం ఈ పోటీలు జరిగాయి. ఈపోటీల్లో వి.శ్రీనివాస్(షాద్‌నగర్), రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకోగా, ఎస్.క్రాంతి కిరణ్(సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజి) మూడో స్థానం పొంది కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ముగింపు వేడుకలకు రాష్ట్ర మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను ట్రోఫీలను అందజేశారు. వివిధ విభాగాల ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. అండర్-16 బాలుర 2 కి.మీ. : 1.సమన్విత్(ఉస్మానియా యూనివర్సిటీ), 2. కె.రాజు (వర్డ్ అండ్ డీడ్ స్కూల్ ), 3.ఎం.గణేష్(జెడ్పీ హైస్కూల్). అండర్-13 బాలుర 1 కి.మీ.: 1. బి.సాయి కుమార్(వర్డ్ అండ్ డీడ్ స్కూల్), 2.పి.శ్రీకాంత్ (గవర్నమెంట్ హైస్కూల్ మూసారం బాగ్), 3. కె.సాయి కిరణ్ (వర్డ్ అండ్ డీడ్ స్కూల్). అండర్-10 బాలుర 1 కిలోమీటర్లు: 1. చంద్రనాథ్ (వర్డ్ అండ్ డీడ్ స్కూల్), 2. ఇ.రవి గౌడ్(వర్డ్ అండ్ డీడ్ స్కూల్), 3. చిన్నయ్య (జెడ్పీ హైస్కూల్). మాస్టర్ పురుషుల (35+) విభాగం: 1. కె.తాయప్ప (హైదరాబాద్), 2. ఎస్.కె.మౌలాలి (ఏపీ ఫారెస్ట్). 3. లియాఖత్ అలీ (హైదరాబాద్). మహిళల విభాగం 2 కి.మీ.: 1.డి.వైష్ణవి(ఓయూ), 2.కోటేశ్వరి (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, డిండీ). 3.ఎస్.కె.షబ్నం (విల్లా మేరీ కాలేజి). అండర్-16 బాలికల 2 కి.మీ. :1. వి.ప్రియాంక (ఎల్బీ నగర్ జెడ్పీ హైస్కూల్), 2.పి.తులసీ(ఎల్బీ నగర్ జెడ్పీ హైస్కూల్), 3.ఎస్.మానస (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ డిండీ). అండర్-13 బాలికల 1. కి.మీ: 1. జి.అనూష (జెడ్పీ హైస్కూల్), 2. కె.చైతన్య, 3. జీహెచ్ఎస్ మూసారం బాగ్). అండర్-10 బాలికల 1 కి.మీ.: 1. శశి ప్రియ (వర్డ్ అండ్ డీడ్ స్కూల్), 2. మేఘనరెడ్డి (సెయింట్ పాల్స్ హైస్కూల్), 3. స్వప్న (వర్డ్ అండ్ డీడ్ స్కూల్).