నోమి (జపాన్): ఆసియా 20 కిలోమీటర్ల రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ అక్ష్‌దీప్ సింగ్ 1 గంట 20 నిమిషాల 57 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఓపెన్ కేటగిరీలో పోటీపడిన భారత అథ్లెట్లు వికాష్ సింగ్, పరమ్‌జీత్ ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు, పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందారు.
ప్రపంచ చాంపియన్‌షిప్, పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయం 1 గంట 20 నిమిషాల 10 సెకన్లను వికాష్ (1గం:20ని :05 సెకన్లు), పరమ్‌జీత్ (1గం: 20:08 సెకన్లు) అందుకున్నారు. నిబంధనల ప్రకారం ఓపెన్ కేటగిరీలో పోటీపడిన వారి సమయాన్ని పతకాల కోసం పరిగణనలోకి తీసుకోరు.
Comments
Please login to add a commentAdd a comment