ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: నిజాం కాలేజి విద్యా సంఘం మాజీ అధ్యక్షుడు సి.దేవేందర్ యాదవ్ స్మారక రాష్ట్ర స్థాయి రోడ్ రేస్ చాంపియన్‌షిప్‌లో 3 కి.మీ రన్‌లో ఓయూ అథ్లెట్ సయ్యద్ వజీర్ ఘోరి 10ని.08.90 సెకన్లలో గమ్యం చేరి స్వర్ణం గెలుచుకున్నాడు. హైదరాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్, హైదరాబాద్ కోచింగ్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిజాం కాలేజి మైదానంలో శనివారం ఉదయం ఈ పోటీలు జరిగాయి.
ఈపోటీల్లో వి.శ్రీనివాస్(షాద్‌నగర్), రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకోగా, ఎస్.క్రాంతి కిరణ్(సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజి) మూడో స్థానం పొంది కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ముగింపు వేడుకలకు రాష్ట్ర మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను ట్రోఫీలను అందజేశారు. వివిధ విభాగాల ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.
అండర్-16 బాలుర 2 కి.మీ. : 1.సమన్విత్(ఉస్మానియా యూనివర్సిటీ), 2. కె.రాజు (వర్డ్ అండ్ డీడ్
స్కూల్ ), 3.ఎం.గణేష్(జెడ్పీ హైస్కూల్).
అండర్-13 బాలుర 1 కి.మీ.: 1. బి.సాయి కుమార్(వర్డ్ అండ్ డీడ్ స్కూల్), 2.పి.శ్రీకాంత్ (గవర్నమెంట్ హైస్కూల్ మూసారం బాగ్), 3. కె.సాయి కిరణ్ (వర్డ్ అండ్ డీడ్ స్కూల్). అండర్-10 బాలుర 1 కిలోమీటర్లు: 1. చంద్రనాథ్ (వర్డ్ అండ్ డీడ్ స్కూల్), 2. ఇ.రవి గౌడ్(వర్డ్ అండ్ డీడ్ స్కూల్), 3. చిన్నయ్య (జెడ్పీ హైస్కూల్). మాస్టర్ పురుషుల (35+) విభాగం: 1. కె.తాయప్ప (హైదరాబాద్), 2. ఎస్.కె.మౌలాలి (ఏపీ ఫారెస్ట్). 3. లియాఖత్ అలీ (హైదరాబాద్).
మహిళల విభాగం 2 కి.మీ.: 1.డి.వైష్ణవి(ఓయూ), 2.కోటేశ్వరి (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, డిండీ). 3.ఎస్.కె.షబ్నం (విల్లా మేరీ కాలేజి).
అండర్-16 బాలికల 2 కి.మీ. :1. వి.ప్రియాంక (ఎల్బీ నగర్ జెడ్పీ హైస్కూల్), 2.పి.తులసీ(ఎల్బీ నగర్ జెడ్పీ హైస్కూల్), 3.ఎస్.మానస (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ డిండీ). అండర్-13 బాలికల 1. కి.మీ: 1. జి.అనూష (జెడ్పీ హైస్కూల్), 2. కె.చైతన్య, 3. జీహెచ్‌ఎస్ మూసారం బాగ్). అండర్-10 బాలికల 1 కి.మీ.: 1. శశి ప్రియ (వర్డ్ అండ్ డీడ్ స్కూల్), 2. మేఘనరెడ్డి (సెయింట్ పాల్స్ హైస్కూల్), 3. స్వప్న (వర్డ్ అండ్ డీడ్ స్కూల్).
వజీర్ ఘోరికి స్వర్ణం
Published Sun, Nov 3 2013 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
Advertisement