Mercedes team driver
-
Lewis Hamilton: వరుసగా ఐదో విజయం!
బార్సిలోనా (స్పెయిన్): ఆరంభంలో ఆధిక్యం కోల్పోయినా... ఎక్కడా తడబడకుండా డ్రైవ్ చేస్తూ... చివరి దశలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మళ్లీ ఆధిక్యంలోకి వచ్చి... ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసును సొంతం చేసుకున్నాడు. 66 ల్యాప్లపాటు జరిగిన ఈ రేసులో ‘పోల్ పొజిషన్’తో మొదలుపెట్టిన హామిల్టన్‌ను తొలి మలుపు వద్ద రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వెర్స్టాపెన్ దూకుడు కొనసాగించగా... మళ్లీ ఆధిక్యంలోకి వచ్చేందుకు హామిల్టన్ పట్టువదలకుండా ప్రయత్నించాడు. రేసు మరో ఆరు ల్యాప్‌ల్లో తర్వాత ముగుస్తుందనగా హామిల్టన్ వేగాన్ని పెంచి వెర్స్టాపెన్ను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత మిగతా ఆరు ల్యాప్‌ల్లో వెర్‌స్టాపెన్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా హామిల్టన్ ట్రాక్‌పై రయ్‌రయ్‌మంటూ దూసుకుపోయి లక్ష్యాన్ని గంటా 33 నిమిషాల 07.680 సెకన్లలో అందుకొని విజేతగా నిలిచాడు. స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌కిది వరుసగా ఐదో విజయంకాగా ఓవరాల్‌గా ఆరోది. హామిల్టన్కంటే ముందు దివంగత దిగ్గజ డ్రైవర్ అయిర్టన్ సెనా (బ్రెజిల్) మాత్రమే ఒకే గ్రాండ్‌ప్రిలో (మొనాకో గ్రాండ్‌ప్రి 1989 నుంచి 1993 వరకు) వరుసగా ఐదేళ్లు విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 98వ విజయం. తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 23న జరుగుతుంది. స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 3. బొటాస్ (మెర్సిడెస్), 4. లెక్లెర్క్ (ఫెరారీ), 5. పెరెజ్ (రెడ్‌బుల్), 6. రికియార్డో (మెక్లారెన్), 7. సెయింజ్ (ఫెరారీ), 8. నోరిస్ (మెక్లారెన్), 9. ఒకాన్ (అల్పైన్), 10. గాస్లీ (అల్ఫా టౌరి). -
విజేత హామిల్టన్
ఇమోలా: మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తాజా ఎఫ్1 సీజన్లో మరో రేసు విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన 63 ల్యాప్‌ల ఎమిలియా రొమానో గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెండో స్థానం నుంచి ఆరంభించిన హామిల్టన్... గంటా 28 నిమిషాల 32.430 సెకన్లలో అందరికంటే ముందుగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. సీజన్లో హామిల్టన్‌కిది తొమ్మిదో విజయం కాగా... ఓవరాల్‌గా 93వది. రేసును ఆరంభించడంలో విఫలమైన హామిల్టన్ తొలి ల్యాప్‌లో ఒక స్థానం దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. అయితే 21వ ల్యాప్‌లో సహచర మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ టైర్లు మార్చుకోవడానికి పిట్స్లోకి రావడంతో లీడ్‌లోకి వచ్చిన హామిల్టన్... తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లాడు. అదే సమయంలో హామిల్టన్‌కు ‘వర్చువల్ సేఫ్టీ కారు’ రూపంలో అదృష్టం కూడా తోడవ్వడంతో ఇక వెనుదిరిగి చూడలేదు. 33వ ల్యాపులో ఒకాన్ (రెనౌ) కారులో సమస్య తలెత్తడంతో... అతడు తన కారును ట్రాక్ పక్కన నిలిపేశాడు. దాంతో ఆ కారును తొలగించే వరకు ఎటువంటి ప్రమాదం జరగకుండా... ఎఫ్1 స్టీవర్డ్స్ ‘వర్చువల్ సేఫ్టీ కారు’ను డెప్లాయ్ చేశారు. అదే సమయంలో తన కారు టైర్లను మార్చుకున్న హామిల్టన్ తొలి స్థానాన్ని తిరిగి దక్కించుకున్నాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకున్న అతడు విజేతగా నిలిచాడు. బొటాస్ రెండో స్థానంలో... రికియార్డో (రెనౌ) మూడో స్థానంలో నిలిచారు. 51వ ల్యాప్‌లో టైరు పంక్చర్ కావడంతో మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రేసు నుంచి వైదొలిగాడు. సీజన్లో 13 రేసులు ముగిశాక హామిల్టన్ 282 పాయింట్లతో డ్రైవర్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉండగా... బొటాస్ 197 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తాజా విజయంతో వరుసగా ఏడో ఏడాది (2014, 15, 16, 17, 18, 19, 20) కన్స్ట్రక్టర్ (జట్టు) చాంపియన్‌షిప్ టైటిల్‌ను నెగ్గి ఈ రికార్డును సాధించిన తొలి ఎఫ్1 టీమ్‌గా నిలిచింది. -
హామిల్టన్ హవా
మొనాకో: క్వాలిఫయింగ్‌లో దుమ్మురేపిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ప్రధాన రేసులోనూ అదరగొట్టాడు. ఫలితంగా ఆదివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 78 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన హామిల్టన్ గంటా 43 నిమిషాల 28.437 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానంలో, వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది నాలుగో టైటిల్ కాగా... మెర్సిడెస్ జట్టుకు ఆరో విజయం కావడం విశేషం. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఆరు రేసుల్లోనూ మెర్సిడెస్ డ్రైవర్లే విజేతగా నిలిచారు. మెర్సిడెస్‌కే చెందిన మరో డ్రైవర్ బొటాస్ రెండు రేసుల్లో గెలిచాడు. మొనాకో విజయాన్ని ఫార్ములావన్ దిగ్గజం నికీ లాడా (ఆస్ట్రియా)కు హామిల్టన్ అంకితం ఇచ్చాడు. మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నికీ లాడా గత సోమవారం మృతి చెందారు. ఈ సీజన్లో ఆరు రేసులు ముగిశాక హామిల్టన్ 137 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 9న జరుగుతుంది. -
హామిల్టన్‌కు ‘పోల్’
మొనాకో: ఈ సీజన్లో వరుసగా ఆరో రేసులోనూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు హామిల్టన్, బొటాస్ తొలి రెండు స్థానాల నుంచి ప్రారంభించనున్నారు. శనివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 10.166 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. హామిల్టన్ సహచరుడు వాల్తెరి బొటాస్ ఒక నిమిషం 10.252 సెకన్లలో ల్యాప్‌ను ముగించి రెండో స్థానంలో నిలిచాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానం నుంచి, వెటెల్ (ఫెరారీ) నాలుగో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. గత ఐదు రేసుల్లో మెర్సిడెస్ డ్రైవర్లకే టైటిల్స్ లభించాయి. ఆస్ట్రేలియా, అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలలో బొటాస్... బహ్రెయిన్, చైనా, స్పెయిన్ గ్రాండ్‌ప్రిలలో హామిల్టన్ విజేతలుగా నిలిచారు. -
‘చైనా’ చాంప్ హామిల్టన్
షాంఘై: క్వాలిఫయింగ్‌లో వెనుకబడినా... ప్రధాన రేసులో అదరగొట్టిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో రెండో విజయాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన చైనా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ చాంపియన్‌గా నిలిచాడు. 56 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 32 నిమిషాల 06.350 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని అలంకరించాడు. పోల్ పొజిషన్‌తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రధాన రేసు మొదలైన వెంటనే తొలి మలుపులోనే బొటాస్‌ను ఓవర్టేక్ చేసిన హామిల్టన్. చివరి ల్యాప్ వరకు ఈ ఆధిక్యాన్ని కొనసాగించి ఫార్ములావన్‌లో 1000వ రేసుగా జరిగిన చైనా గ్రాండ్‌ప్రిలో ఆరోసారి చాంపియన్ అయ్యాడు.ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు మూడో స్థానం దక్కింది. మొత్తం 20 మంది డ్రైవర్లు బరిలోకి దిగగా... ముగ్గురు డ్రైవర్లు లాండో నోరిస్ (మెక్లారెన్), డానిల్ క్వియాట్ (ఎస్టీఆర్), హుల్కెన్‌బర్గ్ (రెనౌ) రేసు ముగించకుండానే మధ్యలో వైదొలిగారు. ఈ సీజన్లో మూడు రేసుల తర్వాత హామిల్టన్ (68 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా... బొటాస్ (62 పాయింట్లు) రెండో స్థానంలో, వెర్స్టాపెన్ (రెడ్‌బుల్–39 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 28న జరుగుతుంది. -
భళా.. బొటాస్
మెల్బోర్న్: ఫార్ములావన్ 2019 సీజన్ తొలి రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో బొటాస్ 58 ల్యాప్‌లను గంటా 25 నిమిషాల 27.325 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన ప్రపంచ చాంపియన్ , మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అతను గంటా 25 నిమిషాల 48.211 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. గతేడాది పలు రేసుల్లో బొటాస్ ఆధిక్యంలోకి దూసుకెళ్లినా హామిల్టన్ వరల్డ్ టైటిల్ అవకాశాలకు దెబ్బ పడకూడదనే ఉద్దేశంతో రేసు జరుగుతున్న సమయంలోనే మెర్సిడెస్ యాజమాన్యం వేగం తగ్గించాలని, హామిల్టన్‌కు సహకరించాలని బొటాస్‌కు సూచనలు ఇచ్చింది. ఈ అంశంపై బొటాస్ బహిరంగంగానే తన అసంతృప్తిని కూడా వ్యక్తం చేశాడు. అయితే ఈ సీజన్ లోని తొలి రేసులో మాత్రం అలా జరగలేదు. పోల్ పొజిషన్‌తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్‌ను తొలి ల్యాప్ మలుపులోనే రెండో స్థానంలో ఉన్న బొటాస్ ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత బొటాస్ వెనుదిరిగి చూడలేదు. 2017లో అబుదాబిలో టైటిల్ గెలిచిన తర్వాత బొటాస్‌కు మళ్లీ టైటిల్ దక్కడం ఇదే తొలిసారి. గత సంవత్సరం బొటాస్‌కు ఏదీ కలిసి రాలేదు. క్వాలిఫయింగ్‌లో రాణించినా, ప్రధాన రేసులో విఫలమవ్వడం... కారులో సాంకేతిక సమస్యలు తలెత్తడం... ఇతరత్రా కారణాలతో అతను ఒక్క రేసులో కూడా గెలవలేకపోయాడు. కానీ ఈ సీజన్లో తొలి రేసులోనే అతను విజేతగా నిలిచి మరిన్ని టైటిల్స్‌పై దృష్టి పెట్టాడు. ఓవరాల్‌గా 119 రేసుల్లో పాల్గొన్న బొటాస్ కిది నాలుగో టైటిల్. సీజన్‌లోని తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 31న జరుగుతుంది. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. బొటాస్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. వెటెల్ (ఫెరారీ), 5. లెక్లెర్క్ (ఫెరారీ), 6. మాగ్నుసెన్ (హాస్), 7. హుల్కెన్ బర్గ్ (రెనౌ), 8. రైకోనెన్ (అల్ఫా రోమియో రేసింగ్), 9. స్ట్రాల్ (రేసింగ్ పాయింట్), 10. క్వియాట్ (ఎస్టీఆర్). -
హామిల్టన్ హవా
సోచి: సహచరుడు బొటాస్ సహకారం ఇవ్వడంతో ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఎనిమిదో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత 53 ల్యాప్‌లను హామిల్టన్ గంటా 27 నిమిషాల 32.054 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన బొటాస్ రెండో స్థానాన్ని పొందాడు. 25వ ల్యాప్ వరకు వెటెల్ (ఫెరారీ) తొలి స్థానంలో, బొటాస్ రెండో స్థానంలో, హామిల్టన్ మూడో స్థానంలో ఉన్నారు. ఈ దశలో హామిల్టన్‌కు ఓవర్టేక్ చేసే అవకాశం ఇవ్వాలని మెర్సిడెస్ జట్టు టీమ్ రేడియాలో బొటాస్‌ను ఆదేశించింది. జట్టు ఆదేశాలను పాటించిన బొటాస్ వేగం తగ్గించి హామిల్టన్‌కు ఓవర్టేక్ చేసే అవకాశం ఇచ్చాడు. దాంతో రెండో స్థానానికి చేరిన హామిల్టన్ అదే జోరులో ఆధిక్యంలో ఉన్న వెటెల్‌ను కూడా వెనక్కి నెట్టి ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి ల్యాప్ వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని కెరీర్లో 70వ విజయాన్ని దక్కించుకున్నాడు. వెటెల్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు. 21 రేసుల ఈ సీజన్లో 16 రేసులు పూర్తయ్యాక హామిల్టన్ 306 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 256 పాయింట్లతో వెటెల్ రెండో స్థానంలో... 189 పాయింట్లతో బొటాస్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 7న జరుగుతుంది. -
వారెవ్వా... హామిల్టన్
హాకెన్‌హీమ్ (జర్మనీ): క్వాలిఫయింగ్ సెషన్లో నిరాశపరిచినప్పటికీ ప్రధాన రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అద్భుతం చేశాడు. 14వ స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ఈ బ్రిటన్ డ్రైవర్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఏకంగా విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ 67 ల్యాప్‌లను గంటా 32 నిమిషాల 29.845 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది నాలుగో విజయం. మెర్సిడెస్ జట్టుకే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని పొందగా... ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్‌కు మూడో స్థానం లభించింది. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ జట్టు మరో డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ 51వ ల్యాప్‌లో వైదొలిగాడు. కారుపై నియంత్రణ కోల్పోయిన వెటెల్ ట్రాక్ గోడను ఢీకొట్టి రేసు నుంచి తప్పుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్ ఏడో స్థానంలో, ఒకాన్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. రేసు ముగిశాక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 53వ ల్యాప్‌లో నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్‌పై దూసుకొచ్చినందుకు విచారణకు హాజరు కావాలని హామిల్టన్‌కు స్టీవార్డ్స్ నోటీసులు జారీ చేశారు. అయితే హామిల్టన్ ఉద్దేశపూర్వకంగా తాను అలా చేయలేదని ఇచ్చిన వివరణపట్ల సంతృప్తి చెందిన స్టీవార్డ్స్ అతడిని హెచ్చరికతో వదిలిపెట్టారు. ఒకవేళ వివరణ సంతృప్తికరంగా లేకపోయుంటే హామిల్టన్ టైటిల్ కోల్పోయేవాడు. -
మరో టైటిల్‌పై హామిల్టన్ గురి
నేడు ఇటలీ గ్రాండ్‌ప్రి రేసు మోంజా (ఇటలీ): మూడు రేసుల తర్వాత మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూరుుస్ హామిల్టన్ మరోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసు క్వాలిఫరుుంగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ పూర్తి ఆధిపత్యం చలారుుంచాడు. అందరికంటే వేగంగా ఒక నిమిషం 21.135 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది ఏడో ‘పోల్ పొజిషన్’ కావడం విశేషం. తాజా పోల్‌తో హామిల్టన్ ఇటలీ గ్రాండ్‌ప్రిలో అత్యధికంగా ఐదుసార్లు పోల్ పొజిషన్ పొందిన దిగ్గజాలు అయర్టన్ సెనా (బ్రెజిల్), యువాన్ మాన్యుయెల్ ఫాంగియో (అర్జెంటీనా) సరసన నిలిచాడు. ఈ సీజన్లో జరిగిన 13 రేసుల్లో ఆరింటిలో విజయం సాధించిన హామిల్టన్ మరో టైటిల్‌పై గురి పెట్టాడు. మెర్సిడెస్‌కే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, నికో హుల్కెన్‌బర్గ్ వరుసగా ఎనిమిది, తొమ్మిది స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. గ్రిడ్ పొజిషన్‌స: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 3. వెటెల్ (ఫెరారీ), 4. రైకోనెన్ (ఫెరారీ), 5. బొటాస్ (విలియమ్స్), 6. రికియార్డో (రెడ్‌బుల్), 7. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 8. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 9. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 10. గుటిరెజ్ (హాస్), 11. మసా (విలియమ్స్), 12. గ్రోస్యెన్ (హాస్), 13. అలోన్సో (మెక్లారెన్), 14. వెర్లీన్ (మనోర్), 15. బటన్ (మెక్లారెన్), 16. సెరుుంజ్ (ఎస్టీఆర్), 17. క్వియాట్ (ఎస్టీఆర్), 18. నాసర్ (సాబెర్), 19. ఎరిక్సన్ (సాబెర్), 20. పాల్మెర్ (రెనౌ), 21. మాగ్నుసెన్ (రెనౌ), 22. ఒకాన్ (మనోర్). నేటి ప్రధాన రేసు సా.గం. 5.25 నుంచి స్టార్ స్పోర్ట్స సెలెక్ట్ హెచ్డీ-2లో ప్రత్యక్ష ప్రసారం