సవతి సోదరితో 11 ఏళ్ల ప్రేమ, పెళ్లి.. త్వరలోనే.. | MotoGP Rider Miguel Oliveira Married Step Sister Expecting First Child | Sakshi
Sakshi News home page

Miguel Oliveira: సవతి సోదరితో నెల రోజుల కిందట పెళ్లి.. త్వరలోనే..

Published Mon, Aug 23 2021 7:55 PM | Last Updated on Mon, Aug 23 2021 8:40 PM

MotoGP Rider Miguel Oliveira Married Step Sister Expecting First Child - Sakshi

లిస్బేన్‌: మోటోజీపీ స్టార్‌ రేసర్‌ మైగెల్‌ ఒలీవిరా త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. తమ జీవితాల్లోకి మరికొన్ని నెలల్లో చిన్నారి రానుందనే శుభవార్తను పంచుకున్నాడు. భార్య ఆండ్రియా పిమెంటాతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఒలీవిరా అభిమానులకు ఈ గుడ్‌న్యూస్‌ చెప్పాడు. ‘‘ఒక ప్రత్యేక వ్యక్తి మా జీవితాల్లోకి రాబోతున్నారు. మా ప్రయాణంలో అతి మధుర క్షణం. నిన్ను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాను మై లవ్‌’’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

కాగా 2015లో ఇటాలియన్‌ మోటార్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌లో విజేతగా నిలిచిన ఈ పోర్చుగీస్‌ రేసర్‌.. తద్వారా తొలి ప్రపంచషిప్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్‌ రేసర్‌గా గుర్తింపు పొందాడు. ఇక తన తండ్రి రెండో భార్య కూతురు(స్టెప్‌ సిస్టర్‌) ఆండ్రియాతో ప్రేమలో పడ్డ 26 ఏళ్ల ఒలీవిరా.. 11 ఏళ్ల పాటు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాడు. ఈ క్రమంలో ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లవ్‌ సీక్రెట్‌ను రివీల్‌ చేసిన ఒలీవీరా గత నెలలో ప్రేయసిని వివాహమాడాడు. ఇక పెళ్లైన.. సుమారు నెల రోజుల తర్వాత తల్లిదండ్రులం కాబోతున్నామంటూ అభిమానులకు స్వీట్‌ షాకిచ్చాడు. 

చదవండి: IND Vs ENG: ఇంగ్లండ్‌ జట్టుకు భారీ షాక్‌.. గాయంతో స్టార్ బౌల‌ర్ ఔట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement