Motor Race
-
Roundup 2022: సిటీలో మొట్టమొదటిసారి కార్ రేసింగ్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం ఈ ఏడాది మొట్టమొదటిసారి మోటారు క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో రెండు దఫాలుగా జరిగిన ఈ రేసింగ్‌లు మోటార్ స్పోర్ట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ► నవంబర్ 19, 20 తేదీల్లో సాంకేతిక కారణాల దృష్ట్యా పోటీలను నిర్వహించలేకపోయినా రెండు రోజుల ట్రయల్స్ హైదరాబాద్ నగరానికి ఒక కొత్త క్రీడను పరిచయం చేశాయి. ► వచ్చే ఏడాది అంటే 2023 ఫిబ్రవరి 11వ తేదీన జరుగనున్న అంతర్జాతీయ ఎలక్ట్రిక్ వాహనాల రేసింగ్ పోటీలు ఫార్ములా–ఈ కి సన్నాహకంగా భావించే ఇండియన్ రేసింగ్ కార్కు నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్ వేదికైంది. ► ఫిబ్రవరిలో జరుగనున్న ఫార్ములా–ఈ పోటీల కోసం సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ ఈ ట్రాక్‌ను నిర్మించింది. ఇదే ట్రాక్‌పై నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇండియన్ రేసింగ్ కారు పోటీలను నిర్వహించారు. హోరెత్తిన పోరు... ► హుస్సేన్‌సాగర్ తీరంలో రయ్‌మంటూ భారీ శబ్దంతో దూసుకెళ్లిన కార్లు నగరవాసులకు కొత్త పరిచయం. నవంబర్‌లో ఒక కారు ప్రమాదానికి గురికావడం, తరచు బ్రేక్‌డౌన్స్ చోటుచేసుకోవడం, రేసర్లు సన్నద్ధంగా లేకపోవడంతో ఈ నెలలో పోటీలను నిర్వహించలేదు. ► హైదరాబాద్‌కు చెందిన బ్లాక్బర్డ్స్తో పాటు చెన్నై, బెంగళూరు, కొచ్చి, ఢిల్లీ, ప్యారిస్, ఇటలీ తదితర నగరాలకు చెందిన 12 బృందాలు, 22 మంది రేసర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ► వాహనాల నిర్వహణ కోసం మెకానిక్‌లు, సాంకేతిక నిపుణులు, వివిధ విభాగాలకు చెందిన బృందాలతో నెక్లెస్ రోడ్డు కోలాహలంగా మారింది. ► డిసెంబర్లో రెండవ దఫా నిర్వహించిన పోటీల్లో కొచ్చి టీమ్ విజేతగా గెలిచింది. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రన్నరప్‌గా నిలిచింది. ► యువతను ముఖ్యంగా మోటార్ స్పోర్ట్స్ అభిమానులను అలరించిన ఈ పోటీలతో హైదరాబాద్ నగరం ఈ రంగలో మొట్టమొదటిసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ► ఈ పోటీల వల్ల నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ రద్దీ నెలకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరానికి వెలుపల పోటీలను నిర్వహించాలని వివిధ వర్గాల నుంచి ఒత్తిడి వచ్చింది. ► ఫిబ్రవరిలో జరుగనున్న ఫార్ములా–ఈ పోటీలతో అంతర్జాతీయంగా హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని ఈ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: TS: సంక్షేమ శాఖల్లో 581 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ -
సవతి సోదరితో 11 ఏళ్ల ప్రేమ, పెళ్లి.. త్వరలోనే..
లిస్బేన్: మోటోజీపీ స్టార్ రేసర్ మైగెల్ ఒలీవిరా త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. తమ జీవితాల్లోకి మరికొన్ని నెలల్లో చిన్నారి రానుందనే శుభవార్తను పంచుకున్నాడు. భార్య ఆండ్రియా పిమెంటాతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఒలీవిరా అభిమానులకు ఈ గుడ్‌న్యూస్ చెప్పాడు. ‘‘ఒక ప్రత్యేక వ్యక్తి మా జీవితాల్లోకి రాబోతున్నారు. మా ప్రయాణంలో అతి మధుర క్షణం. నిన్ను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాను మై లవ్’’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. కాగా 2015లో ఇటాలియన్ మోటార్ గ్రాండ్ ప్రిక్స్‌లో విజేతగా నిలిచిన ఈ పోర్చుగీస్ రేసర్.. తద్వారా తొలి ప్రపంచషిప్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్ రేసర్‌గా గుర్తింపు పొందాడు. ఇక తన తండ్రి రెండో భార్య కూతురు(స్టెప్ సిస్టర్) ఆండ్రియాతో ప్రేమలో పడ్డ 26 ఏళ్ల ఒలీవిరా.. 11 ఏళ్ల పాటు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాడు. ఈ క్రమంలో ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లవ్ సీక్రెట్‌ను రివీల్ చేసిన ఒలీవీరా గత నెలలో ప్రేయసిని వివాహమాడాడు. ఇక పెళ్లైన.. సుమారు నెల రోజుల తర్వాత తల్లిదండ్రులం కాబోతున్నామంటూ అభిమానులకు స్వీట్ షాకిచ్చాడు. చదవండి: IND Vs ENG: ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్.. గాయంతో స్టార్ బౌలర్ ఔట్ -
వాయువేగంతో ప్రయాణించే కారు
ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే పెట్రోల్, డిజిల్ కార్ల కన్నా, కాలుష్యానికి హాని కలిగించని ఎలక్ట్రిక్ కార్ల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని మోటారు రేసింగ్ ఔత్సాహికుల కోసం కంపెనీలు సరికొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. వాటిలో భాగంగానే గంటకు 305 కిలోమీటర్ల వాయు వేగంతో ప్రయాణించే ఏపీ-1 అనే ఎలక్ట్రిక్ సూపర్ కారును అపెక్స్ మోటార్స్ వారం రోజుల్లో ఆవిష్కరించనుంది. హాంకాంగ్‌కు చెందిన ఇద్దరు సోదరులు ఈ సూపర్ కారును రూపకల్పన చేశారని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏపీ 1 సూపర్ కారు 620కిలోగ్రాముల బరువు, కార్బన్ ఫైబర్‌తో కూడిన అత్యుధునిక డిజైన్లతో రూపిందించినట్లు తెలుస్తోంది. కొండ ప్రాంతాలలో కూడా ఏపీ-1 కారు వేగంతో ప్రయాణిస్తున్నట్లు ఆవిష్కర్తలు చెబుతున్నారు. ఏపీ 1 ఎలక్ట్రిక్ కారు పూర్తి చార్జింగ్‌తో 515 కిలోమీటర్లు ప్రయాణించగలదని, ఫాస్ట్ చార్జర్‌తో 20 నిముషాల్లో 80శాతం చార్జింగ్ అవుతుందని కంపెనీ తెలిపింది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగానే ఎలక్ట్రిక్ కారు రూపకల్పన చేశామని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: ప్రేమికులు మెచ్చే: ‘ట్విజీ’ బుల్లి కారు -
క్రీడా స్ఫూర్తికే అవమానం.. జీవితకాల నిషేధం
రోమ్: ఏ క్రీడలోనైనా క్రీడా స్ఫూర్తి అనేది అనివార్యం. ఒకవేళ గెలుపు కోసం అడ్డదారులు తొక్కితే అందుకు తగిన మూల్యం భారీగానే ఉంటుంది. ఇలానే ఒక రేసర్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యహరించి జీవితకాలం నిషేధానికి గురయ్యాడు. ఇటలీలోని సాన్ మారినోలో నిర్వహించిన ఒక బైక్ రేస్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఇది బైక్ రేసులకే సవాల్‌గా పరిణమించింది. ఈ బైక్ రేసులో ఒక రైడర్ తన ప్రత్యర్థిని ఓడించేందుకు అతని బైక్ హ్యాండ్ బ్రేక్‌ను నొక్కేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆ బైక్ 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. కొద్దిగా పట్టుతప్పినా పెద్ద ప్రమాదమే జరిగివుండేది. ‘ఇటాలియన్ మోటో జిపీ-2’కు చెందిన రొమానే ఫెనటీ... జాన్ మెరీనోరైడ్ సందర్భంలో ప్రత్యర్థి స్టెఫానో మంజీ బైక్ బ్రేక్‌ను ఒత్తి అతనిని పడవేసేందుకు ప్రయత్నించాడు. ఈ వ్యవహారం కారణంగా అతను రేసింగ్ గేమ్ ఆడకుండా జీవితకాలం నిషేధానికి గురయ్యాడు. ఈ ఘటన జరిగిన వెంటనే ఫెనాటీని ఈ రేస్ నుంచి తప్పించారు. అలాగే రేసింగ్ గేమ్ నిర్వాహకులు... ఫెనాటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
తన ప్రత్యర్థిని ఓడించాలనుకున్నాడు...కానీ!