
బాకు: ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఫార్ములావన్ సీజన్‌కు కరోనా వైరస్ కారణంగా వాయిదాల బెడద తప్పడం లేదు. తాజాగా ఈ జాబితాలో అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి చేరింది. జూన్ 7న జరగాల్సిన అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రిని వాయిదా వేస్తున్నట్లు... ఎప్పుడు నిర్వహిం చేది తర్వాత చెబుతామని నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పటికే మార్చి 15న జరగాల్సిన సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి... మే 24న జరగాల్సిన సీజన్‌లోని ఏడో రేసు మొనాకో గ్రాండ్‌ప్రి రద్దు అయ్యాయి. బహ్రెయిన్ (మార్చి 22), వియత్నాం (ఏప్రిల్ 5), చైనా (ఏప్రిల్ 19), డచ్ (మే 3), స్పెయిన్ గ్రాండ్‌ప్రి (మే 10) వాయిదా పడ్డాయి. దాంతో ఫార్ములావన్–2020 సీజన్ జూన్ 14న మాంట్రియల్‌లో జరిగే కెనడా గ్రాండ్‌ప్రితో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment