
బార్సిలోనా (స్పెయిన్): ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో నాలుగోసారి పోల్ పొజిషన్ సంపాదించాడు. శనివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో లెక్‌లెర్క్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 18.750 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును లెక్‌లెర్క్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానం నుంచి, కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఈ సీజన్‌లో ఐదు రేసులు జరగ్గా రెండింటిలో లెక్‌లెర్క్... మూడింటిలో వెర్‌స్టాపెన్ విజేతలుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment