స్పిల్‌బర్గ్ వేదికగా జరిగిన ఆస్ట్రియా జీపీ ఎఫ్-1 రేసులో ఒక ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. రేసును చూడడానికి చాలా మంది అభిమానులు రావడంతో వారిని ఎంటర్‌టైన్ చేసేందుకు నిర్వాహకులు.. స్టంట్‌మన్స్‌తో గాలిలో జెట్‌ప్యాక్స్‌తో కొన్ని స్టంట్స్ చేయించారు. సూపర్‌గా సాగుతూ మంచి ఎంటర్‌టైనింగ్ నడుస్తున్న సమయంలో ఊహించని రీతిలో ఒక స్టంట్‌మన్ జెట్‌ప్యాక్ ల్యాపింగ్ అయింది.
దీంతో ఒక్కసారిగా కంట్రోల్ తప్పిన స్టంట్‌మన్ నేరుగా రేసు నిర్వహించే ల్యాప్‌పై మూడు పల్టీలు కొట్టాడు. అంత పైనుంచి పడినా అదృష్టవశాత్తూ సదరు స్టంట్‌మన్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరికొద్ది నిమిషాల్లో రేసు ప్రారంభమవుతుందనగా ఇది చోటుచేసుకోవడంతో కాస్త ఆందోళన కలిగించినా.. ఆ స్టంట్‌మన్ తనంతట తానుగా లేచి వెళ్లిపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక రేసు విషయానికి వస్తే ఆదివారం ఆస్ట్రియన్ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఈ ట్రాక్‌పై తనకు పోటీనిచ్చిన ఫెరారీ రేసర్ చార్లెస్ లెక్‌లెర్క్‌ను వెనక్కి నెట్టి తన వేగంతో అగ్ర స్థానంలో నిలిచాడు. దీంతో నిరుటి విజేత లెక్‌లెర్క్ రెండో స్థానంతో తృప్తి చెందాడు.పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన వెర్‌స్టాపెన్ 71 ల్యాపుల్ని అందరికంటే ముందుగా ఒక గంటా 25 నిమిషాల 33.607 సెకన్లలో పూర్తి చేశాడు.
ఈ సీజన్‌లో 25 ఏళ్ల ఈ డచ్ డ్రైవర్‌కిది వరుసగా ఐదో విజయం కాగా... ఓవరాల్‌గా ఇప్పటివరకు జరిగిన 9 రేసుల్లో ఏడో విజయాన్ని నమోదు చేశాడు. దీంతో 377 పాయింట్లతో రెడ్‌బుల్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదే జట్టుకు చెందిన సెర్గియో పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు. తదుపరి రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఈ నెల 9న సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌పై జరుగుతుంది.
Oscar Piastri nailing 'The Office' camera look after this jet-pack mishap! 😂
— Formula 1 (@F1) July 2, 2023
Glad to see the jet-pack flier in good spirits after too 😊#AustrianGP #F1 @OscarPiastri @McLarenF1 pic.twitter.com/AUwS04whpd
చదవండి: ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ
Comments
Please login to add a commentAdd a comment