Austrian Grand Prix race
-
గాల్లో ప్రాణాలు అంటే ఇదేనేమో.. బతికిపోయాడు!
స్పిల్బర్గ్ వేదికగా జరిగిన ఆస్ట్రియా జీపీ ఎఫ్-1 రేసులో ఒక ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. రేసును చూడడానికి చాలా మంది అభిమానులు రావడంతో వారిని ఎంటర్టైన్ చేసేందుకు నిర్వాహకులు.. స్టంట్మన్స్తో గాలిలో జెట్ప్యాక్స్తో కొన్ని స్టంట్స్ చేయించారు. సూపర్‌గా సాగుతూ మంచి ఎంటర్టైనింగ్ నడుస్తున్న సమయంలో ఊహించని రీతిలో ఒక స్టంట్‌మన్ జెట్ప్యాక్ ల్యాపింగ్ అయింది. దీంతో ఒక్కసారిగా కంట్రోల్ తప్పిన స్టంట్‌మన్ నేరుగా రేసు నిర్వహించే ల్యాప్‌పై మూడు పల్టీలు కొట్టాడు. అంత పైనుంచి పడినా అదృష్టవశాత్తూ సదరు స్టంట్మన్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరికొద్ది నిమిషాల్లో రేసు ప్రారంభమవుతుందనగా ఇది చోటుచేసుకోవడంతో కాస్త ఆందోళన కలిగించినా.. ఆ స్టంట్‌మన్ తనంతట తానుగా లేచి వెళ్లిపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రేసు విషయానికి వస్తే ఆదివారం ఆస్ట్రియన్ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఈ ట్రాక్‌పై తనకు పోటీనిచ్చిన ఫెరారీ రేసర్ చార్లెస్ లెక్లెర్క్ను వెనక్కి నెట్టి తన వేగంతో అగ్ర స్థానంలో నిలిచాడు. దీంతో నిరుటి విజేత లెక్లెర్క్ రెండో స్థానంతో తృప్తి చెందాడు.పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన వెర్స్టాపెన్ 71 ల్యాపుల్ని అందరికంటే ముందుగా ఒక గంటా 25 నిమిషాల 33.607 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ సీజన్లో 25 ఏళ్ల ఈ డచ్ డ్రైవర్కిది వరుసగా ఐదో విజయం కాగా... ఓవరాల్‌గా ఇప్పటివరకు జరిగిన 9 రేసుల్లో ఏడో విజయాన్ని నమోదు చేశాడు. దీంతో 377 పాయింట్లతో రెడ్‌బుల్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదే జట్టుకు చెందిన సెర్గియో పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు. తదుపరి రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఈ నెల 9న సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌పై జరుగుతుంది. Oscar Piastri nailing 'The Office' camera look after this jet-pack mishap! 😂 Glad to see the jet-pack flier in good spirits after too 😊#AustrianGP #F1 @OscarPiastri @McLarenF1 pic.twitter.com/AUwS04whpd — Formula 1 (@F1) July 2, 2023 చదవండి: ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ అడవి రాముడు లింబా రామ్.. గురి పెట్టాడో..! -
ఆస్ట్రియన్ గ్రాండ్‌ప్రి విజేత వెర్స్టాపెన్.. సీజన్లో వరుసగా ఐదో టైటిల్
స్పిల్బర్గ్: ఫార్ములా వన్‌లో చాంపియన్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఎదురే లేని జోరుతో దూసుకెళుతున్నాడు. ఆదివారం ఆస్ట్రియన్ గ్రాండ్‌ప్రిలో ఈ రెడ్‌బుల్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. ఈ ట్రాక్‌పై తనకు పోటీనిచ్చిన ఫెరారీ రేసర్ చార్లెస్ లెక్లెర్క్ను వెనక్కి నెట్టి తన వేగంతో అగ్ర స్థానంలో నిలిచాడు. దీంతో నిరుటి విజేత లెక్లెర్క్ రెండో స్థానంతో తృప్తి చెందాడు. The race-winning moment for @Max33Verstappen with this slick move past Charles Leclerc! 👌😮💨#AustrianGP #F1 @redbullracing pic.twitter.com/Agk56wjB84 — Formula 1 (@F1) July 2, 2023 పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన వెర్స్టాపెన్ 71 ల్యాపుల్ని అందరికంటే ముందుగా ఒక గంటా 25 నిమిషాల 33.607 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ సీజన్లో 25 ఏళ్ల ఈ డచ్ డ్రైవర్కిది వరుసగా ఐదో విజయం కాగా... ఓవరాల్‌గా ఇప్పటివరకు జరిగిన 9 రేసుల్లో ఏడో విజయాన్ని నమోదు చేశాడు. దీంతో 377 పాయింట్లతో రెడ్‌బుల్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదే జట్టుకు చెందిన సెర్గియో పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు. తదుపరి రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఈ నెల 9న సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌పై జరుగుతుంది. -
Austrian Grand Prix: లెక్లెర్క్ ఖాతాలో మూడో విజయం
ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో మూడో విజయం నమోదు చేశాడు. స్పీల్బర్గ్లో ఆదివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో లెక్లెర్క్ చాంపియన్‌గా నిలిచాడు. నిర్ణీత 71 ల్యాప్‌లను లెక్లెర్క్ అందరికంటే వేగంగా గంటా 24 నిమిషాల 24.312 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. -
ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి విజేత వెర్స్టాపెన్
స్పీల్బెర్గ్ (ఆస్ట్రియా): ఈ ఏడాది ఫార్ము లావన్ సీజన్లో ఎట్టకేలకు తొమ్మిదో రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ కాకుండా మరో జట్టు డ్రైవర్‌కు టైటిల్ లభించింది. ఆదివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును వెర్స్టాపెన్ గంటా 22 నిమిషాల 01.822 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన లెక్లెర్క్ (ఫెరారీ)ను 69వ ల్యాప్‌లో వెర్స్టాపెన్ ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. లెక్లెర్క్కు రెండో స్థానం దక్కగా... బొటాస్ (మెర్సిడెస్) మూడో స్థానాన్ని పొందాడు. వెటెల్ (ఫెరారీ), హామిల్టన్ (మెర్సిడెస్) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఈ సీజన్‌లోని తొలి ఎనిమిది రేసుల్లో ఆరింటిలో హామిల్టన్ (మెర్సిడెస్), రెండింటిలో బొటాస్ (మెర్సిడెస్) టైటిల్ సాధించారు. తదుపరి రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఈనెల 14న జరుగుతుంది. -
దుమ్మురేపిన రోస్‌బర్గ్
స్పీల్బెర్గ్: అందివచ్చిన ఏకైక అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్లో మూడో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి రేసులో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 30 నిమిషాల 16.930 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్ తొలి మలుపు వద్ద లూయిస్ హామిల్టన్‌ను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత రోస్‌బర్గ్ వెనుదిరిగి చూడలేదు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ తొలి ల్యాప్‌లోనే వెనుకబడిపోవడంతో మళ్లీ తేరుకోలేకపోయాడు. పిట్ స్టాప్‌లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో హామిల్టన్‌పై ఐదు సెకన్ల పెనాల్టీ కూడా విధించారు. విలియమ్స్ జట్టు డ్రైవర్ ఫెలిప్ మసా మూడో స్థానాన్ని దక్కించుకోగా... సెబాస్టియన్ వెటెల్ నాలుగో స్థానాన్ని పొందాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానాన్ని సాధించగా... పెరెజ్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. తొలి ల్యాప్‌లో రైకోనెన్ (ఫెరారీ), అలోన్సో (మెక్లారన్) కార్లు పరస్పరం ఢీకొట్టుకొని రేసు నుంచి వైదొలగగా... ఆ తర్వాత మరో నలుగురు డ్రైవర్లు సాంకేతిక కారణాలతో తప్పుకున్నారు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు బ్రిటన్ గ్రాండ్‌ప్రి జులై 5న జరుగుతుంది. వర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5) స్థానం డ్రైవర్ జట్టు పాయింట్లు 1 హామిల్టన్ మెర్సిడెస్ 169 2 రోస్‌బర్గ్ మెర్సిడెస్ 159 3 వెటెల్ ఫెరారీ 120 4 రైకోనెన్ ఫెరారీ 72 5 బొటాస్ విలియమ్స్ 67 కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5) స్థానం జట్టు పాయింట్లు 1 మెర్సిడెస్ 328 2 ఫెరారీ 192 3 విలియమ్స్ 129 4 రెడ్‌బుల్ 55 5 ఫోర్స్ ఇండియా 31