స్పిల్‌బర్గ్: ఫార్ములా వన్‌లో చాంపియన్ రేసర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ ఎదురే లేని జోరుతో దూసుకెళుతున్నాడు. ఆదివారం ఆస్ట్రియన్ గ్రాండ్‌ప్రిలో ఈ రెడ్‌బుల్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. ఈ ట్రాక్‌పై తనకు పోటీనిచ్చిన ఫెరారీ రేసర్ చార్లెస్ లెక్‌లెర్క్‌ను వెనక్కి నెట్టి తన వేగంతో అగ్ర స్థానంలో నిలిచాడు. దీంతో నిరుటి విజేత లెక్‌లెర్క్ రెండో స్థానంతో తృప్తి చెందాడు.
The race-winning moment for @Max33Verstappen with this slick move past Charles Leclerc! 👌😮💨#AustrianGP #F1 @redbullracing pic.twitter.com/Agk56wjB84
— Formula 1 (@F1) July 2, 2023
పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన వెర్‌స్టాపెన్ 71 ల్యాపుల్ని అందరికంటే ముందుగా ఒక గంటా 25 నిమిషాల 33.607 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో 25 ఏళ్ల ఈ డచ్ డ్రైవర్‌కిది వరుసగా ఐదో విజయం కాగా... ఓవరాల్‌గా ఇప్పటివరకు జరిగిన 9 రేసుల్లో ఏడో విజయాన్ని నమోదు చేశాడు. దీంతో 377 పాయింట్లతో రెడ్‌బుల్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదే జట్టుకు చెందిన సెర్గియో పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు. తదుపరి రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఈ నెల 9న సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌పై జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment