Jet Pack
-
గాల్లో ప్రాణాలు అంటే ఇదేనేమో.. బతికిపోయాడు!
స్పిల్బర్గ్ వేదికగా జరిగిన ఆస్ట్రియా జీపీ ఎఫ్-1 రేసులో ఒక ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. రేసును చూడడానికి చాలా మంది అభిమానులు రావడంతో వారిని ఎంటర్టైన్ చేసేందుకు నిర్వాహకులు.. స్టంట్మన్స్తో గాలిలో జెట్ప్యాక్స్తో కొన్ని స్టంట్స్ చేయించారు. సూపర్‌గా సాగుతూ మంచి ఎంటర్టైనింగ్ నడుస్తున్న సమయంలో ఊహించని రీతిలో ఒక స్టంట్‌మన్ జెట్ప్యాక్ ల్యాపింగ్ అయింది. దీంతో ఒక్కసారిగా కంట్రోల్ తప్పిన స్టంట్‌మన్ నేరుగా రేసు నిర్వహించే ల్యాప్‌పై మూడు పల్టీలు కొట్టాడు. అంత పైనుంచి పడినా అదృష్టవశాత్తూ సదరు స్టంట్మన్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరికొద్ది నిమిషాల్లో రేసు ప్రారంభమవుతుందనగా ఇది చోటుచేసుకోవడంతో కాస్త ఆందోళన కలిగించినా.. ఆ స్టంట్‌మన్ తనంతట తానుగా లేచి వెళ్లిపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రేసు విషయానికి వస్తే ఆదివారం ఆస్ట్రియన్ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఈ ట్రాక్‌పై తనకు పోటీనిచ్చిన ఫెరారీ రేసర్ చార్లెస్ లెక్లెర్క్ను వెనక్కి నెట్టి తన వేగంతో అగ్ర స్థానంలో నిలిచాడు. దీంతో నిరుటి విజేత లెక్లెర్క్ రెండో స్థానంతో తృప్తి చెందాడు.పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన వెర్స్టాపెన్ 71 ల్యాపుల్ని అందరికంటే ముందుగా ఒక గంటా 25 నిమిషాల 33.607 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ సీజన్లో 25 ఏళ్ల ఈ డచ్ డ్రైవర్కిది వరుసగా ఐదో విజయం కాగా... ఓవరాల్‌గా ఇప్పటివరకు జరిగిన 9 రేసుల్లో ఏడో విజయాన్ని నమోదు చేశాడు. దీంతో 377 పాయింట్లతో రెడ్‌బుల్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదే జట్టుకు చెందిన సెర్గియో పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు. తదుపరి రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఈ నెల 9న సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌పై జరుగుతుంది. Oscar Piastri nailing 'The Office' camera look after this jet-pack mishap! 😂 Glad to see the jet-pack flier in good spirits after too 😊#AustrianGP #F1 @OscarPiastri @McLarenF1 pic.twitter.com/AUwS04whpd — Formula 1 (@F1) July 2, 2023 చదవండి: ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ అడవి రాముడు లింబా రామ్.. గురి పెట్టాడో..! -
ఐదు వేల అడుగుల ఎత్తులో ఎగిరిన మనిషి.. హై అలర్ట్!
టెక్నాలజీ ఎంత వృద్ధి చెందుతున్నా.. దానికంటూ ఓ పరిధి ఉంటుంది. కానీ, అది పరిధి దాటి ప్రవర్తిస్తే.. ఆ టెక్నాలజీ మీదే అనుమానాలు ఏర్పడుతుంటాయి. అలాంటిదే ఈ ఘటన. ఆకాశంలో మనిషి స్వేచ్ఛా విహారం కోసం తయారు చేసిన రెక్కల సాంకేతికత ‘జెట్ప్యాక్’లు అమెరికాను బెంబేలెత్తిస్తున్నాయి. జెట్ప్యాక్ ధరించిన ఓ మనిషి.. అదీ వేల అడుగుల ఎత్తులో సంచరించడం చర్చనీయాంశంగా మారింది. ఏడాది కాలంలో ఇది నాలుగో ఘటన కాగా.. లాస్ ఏంజెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(LAX) దగ్గర్లో కనిపించడంతో భద్రతాపరమైన అనుమానాలు మొదలయ్యాయి. సాక్రమెంటో: బోయింగ్ 747 ఫ్లైట్ ఒకటి బుధవారం సాయంత్రం లాస్ ఏంజెల్స్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. ఆ వెంటనే పైలెట్ అదరా బాదరాగా అధికారులకు ఒక రిపోర్ట్ చేశాడు. జెట్ప్యాక్ ధరించిన ఓ వ్యక్తి గాల్లో తేలుతుండడం చూశానని, ఎయిర్‌పోర్ట్‌కి 15 మైళ్ల దూరంలో ఐదు వేల అడుగుల ఎత్తున అతను కనిపించాడని రిపోర్ట్ చేశాడు ఓ పైలెట్. దీంతో మిగతా పైలెట్లు అప్రమత్తంగా ఉండాలని ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వార్త బయటకు లీక్ కావడంతో మీడియా ఛానెల్స్ అత్యుత్సాహం ప్రదర్శించాయి. సీబీఎస్ లాస్ ఏంజెల్స్ ఏకంగా యూఎఫ్‌వో, ఐరెన్‌మ్యాన్ అంటూ కథనాలు రాయడం కొసమెరుపు. ఎఫ్‌బీఐ అలర్ట్ జెట్ప్యాక్ మ్యాన్ కథల్ని మొదట్లో కాలిఫోర్నియా ప్రజలు ‘ఉత్త ప్రచారం’గా భావించారు. అయితే ఆగష్టు 2020లో అమెరికన్ ఎయిర్‌లైన్స్ పైలెట్ ఒకతను మూడు వేల అడుగుల ఎత్తులో జెట్ప్యాక్ వేసుకున్న ఓ వ్యక్తిని చూశానని చెప్పాడు. ఆ తర్వాత అక్టోబర్‌లో చైనా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ పైలెట్.. ఆరు వేల అడుగుల ఎత్తులో జెట్ప్యాక్మ్యాన్ను చూశానని వెల్లడించారు. ఇక అమెరికన్ ఎయిర్‌లైన్స్ పైలెట్ ఒకతను 300 యార్డ్ల దూరంలో తనకు అతిదగ్గరగా జెట్ప్యాక్మ్యాన్ను చూశానని చెప్పడం కలకలం సృష్టించింది. అంతేకాదు డిసెంబర్లో ఒక ఫుటేజీని రిలీజ్ చేయడం, అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కూడా అది జెట్ప్యాక్ మ్యాన్ అని నిర్ధారించడం జరిగిపోయాయి. ఇక ఇప్పుడు తాజా ఘటన తర్వాత ఎఫ్‌బీఐ అప్రమత్తం అయ్యింది. హై అలర్ట్ ప్రకటించి.. డ్రోన్ల ద్వారా నిఘా కొనసాగిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు అధికారులు. అంత ఎత్తు సాధ్యమేనా? ప్రపంచవ్యాప్తంగా జెట్ప్యాక్ తయారీ కంపెనీలు చాలానే ఉన్నాయి. కానీ, వాటిలో లైసెన్స్‌లతో అమ్మేవి కొన్నే అతితక్కువ మాత్రమే. అయితే జెట్‌ప్యాక్‌లో ఇంధనం ఎంత ఎత్తుమేర ఎగరడంలో సపోర్ట్ చేస్తాయనేదానిపై కంపెనీలపై ఒక క్లారిటీ లేకుండా పోయింది. కాలిఫోర్నియాకు చెందిన జెట్ప్యాక్ ఏవియేషన్ కంపెనీ.. జెట్‌ప్యాక్‌ల సాయంతో గరిష్టంగా పదిహేను వేల అడుగుల ఎత్తుకు ఎగరొచ్చని ఆ మధ్య ప్రకటించుకుంది. కానీ, ఆ కంపెనీ సీఈవో డేవిడ్ మయన్ మాత్రం అది అసాధ్యం అని ఇప్పుడు అంటున్నాడు. జెట్‌ప్యాక్‌లతో మనిషి పదిహేను వందల అడుగుల ఎత్తు వరకు వెళ్లడం సాధ్యమవుతుంది. అంతకు మించి వెళ్తే ఇంధన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక చైనా ఎయిర్‌లైన్స్ పైలెట్ చెప్పిన ఆరువేల అడుగుల ఎత్తులో జెట్ప్యాక్ మ్యాన్ నిజం అయ్యి ఉండకపోవచ్చు అని చెప్తున్నాడు మయన్. ఇదిలా ఉంటే ప్రముఖ ఏవియేషన్ కంపెనీ ‘జెట్మన్ దుబాయ్’.. కిందటి ఏడాది ఫిబ్రవరిలో పైలెట్ విన్స్ రెఫెట్ ద్వారా ఆరు వేల అడుగుల ఎత్తులో జెట్ప్యాక్ ప్రయోగం చేయించింది. అయితే ఒక రెక్కలో సాంకేతిక ఇబ్బంది తలెత్తడంతో ఆ ప్రయోగం విఫలమైంది. అయినప్పటికీ.. పారాషూట్సాయంతో సేఫ్‌గా ల్యాండ్ అయ్యాడు రెఫెట్. అయితే దురదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగిన తొమ్మిది నెలల తర్వాత ఓ ట్రైనింగ్ యాక్సిడెంట్లో రెఫెట్ మరణించాడు. -
గ'ఘన' విహారం
గాల్లో... అదీ మేఘాల్లో రివ్వు రివ్వున దూసుకెళుతూంటే ఎలా ఉంటుందంటారూ? ఊహూ... విమానంలో కూర్చొని కాదండీ. భుజానికి ఓ జెట్ప్యాక్ తగిలించుకుని వెళితే? ఏమో మాకేం తెలుస్తుంది అంటారా? అరుుతే ఓకే. కానీ ఆ థ్రిల్ ఎలా ఉంటుంది పక్క ఫొటోలో ఉన్న వారికి మాత్రం బాగా తెలుసండోయ్! జెట్మన్లు దుబాయికి చెందిన ముగ్గురు ఈ మధ్యనే ఫ్రాన్‌సలో ఓ అబ్బురపరిచే విన్యాసం చేశారు. ఫ్రాన్స్ వాయుసేన విమానాలు ఒక నిర్ణీత పద్ధతి (ఫార్మేషన్) ప్రకారం వెళుతూంటే... ఈ ముగ్గురు కూడా ఆ విమానాలను ఫాలో అయ్యారు. ఇలా చేయడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అట. నాలుగు వేల అడుగుల ఎత్తులో గంటకు 260 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రయాణం సాగింది. వాయు సేన విమానాలు గాల్లోకి ఎగసిన వెంటనే జెట్మ్యాన్ టీమ్ సభ్యులు హెలికాప్టర్ల అంచుల మీద నిలబడి గాల్లోకి ఎగిరారు. కొంచెం ఎత్తుకు వెళ్లిన తరువాత విమానాలు ఫార్మేషన్లో ప్రయాణించడం మొదలైంది. ఆ వెంటనే హెలికాప్టర్ల నుంచి కిందకు దూకేసిన జెట్మ్యాన్ టీమ్ సభ్యులు విమానాల వెంబడే ప్రయాణించడం మొదలుపెట్టారు. ఒక్కో సభ్యుడు జెట్ కార్ పీ400 ఇంజిన్లతో కూడిన జెట్‌ప్యాక్‌ను తగిలించుకుని తొమ్మిది నిమిషాలపాటు ప్రయాణించడం విశేషం. హెలికాప్టర్ల అంచున నిలబడి సాహస ప్రయాణానికి సిద్ధమవుతూ... గత ఏడాది ఇదే బృందం ఎమిరేట్స్ విమానం వెంబడి జెట్‌ప్యాక్‌లతో ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఇందులో గొప్పేముంది అని తీసిపారేయొద్దు. అటు జెట్ పెలైట్లు... ఇటు జెట్మ్యాన్ సభ్యులు - ఇద్దరూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయమిది. ఏ మాత్రం లెక్క తప్పినా... ఇద్దరికీ ప్రమాదమే. జెట్మ్యాన్ సభ్యులు కేవలం తమ శరీర కదలికల ద్వారా మాత్రమే తమ స్థానాన్ని అటూ ఇటూ చేయగలగడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. హెలికాప్టర్ల నుంచి గగనంలో దూకేసిన జెట్మ్యాన్ సభ్యులు -
దుబాయి రూటే సపరేటు!
ప్రపంచంలోనే ఎత్తై భవనం ఎక్కడుంది? ఇంకెక్కడ దుబాయిలో. బాగానే ఉందికానీ... బుర్జ్ ఖలీఫా 99వ అంతస్తులో అగ్నిప్రమాదం జరిగితే? అంతపైకి వెళ్లి మంటలార్పడం అంటే ఆషామాషీ ఏం కాదు. అందుకేనేమో... దుబాయి సివిల్ డిఫెన్స్ సర్వీస్ ఈమధ్యనే ఫొటోలో కనిపిస్తున్నటువంటి జెట్‌ప్యాక్‌ల కొనుగోలుకు ఆర్డరిచ్చింది. న్యూజీలాండ్‌కు చెందిన మార్టిన్ కంపెనీ తయారు చేస్తున్న ఈ జెట్ప్యాక్ గంటకు 74 కిలోమీటర్ల వేగంతో దాదాపు 3000 అడుగుల ఎత్తువరకూ వెళ్లగలదు. అరగంటపాటు గాల్లో ఉండగల ఈ పీ12 జెట్ప్యాక్తో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ధర ఎంతో తెలుసా? దాదాపు 75 లక్షల రూపాయలు మాత్రమే! అగ్నిమాపక దళం కోసం ఇలాంటివి ఓ ఇరవై పంపాలని దుబాయి ప్రభుత్వం మార్టిన్ కంపెనీని కోరింది.