దుబాయి రూటే సపరేటు!
ప్రపంచంలోనే ఎత్తై భవనం ఎక్కడుంది? ఇంకెక్కడ దుబాయిలో. బాగానే ఉందికానీ... బుర్జ్ ఖలీఫా 99వ అంతస్తులో అగ్నిప్రమాదం జరిగితే? అంతపైకి వెళ్లి మంటలార్పడం అంటే ఆషామాషీ ఏం కాదు. అందుకేనేమో... దుబాయి సివిల్ డిఫెన్స్ సర్వీస్ ఈమధ్యనే ఫొటోలో కనిపిస్తున్నటువంటి జెట్‌ప్యాక్‌ల కొనుగోలుకు ఆర్డరిచ్చింది. న్యూజీలాండ్‌కు చెందిన మార్టిన్ కంపెనీ తయారు చేస్తున్న ఈ జెట్‌ప్యాక్ గంటకు 74 కిలోమీటర్ల వేగంతో దాదాపు 3000 అడుగుల ఎత్తువరకూ వెళ్లగలదు.
అరగంటపాటు గాల్లో ఉండగల ఈ పీ12 జెట్‌ప్యాక్‌తో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ధర ఎంతో తెలుసా? దాదాపు 75 లక్షల రూపాయలు మాత్రమే! అగ్నిమాపక దళం కోసం ఇలాంటివి ఓ ఇరవై పంపాలని దుబాయి ప్రభుత్వం మార్టిన్ కంపెనీని కోరింది.