stuntman
-
ట్రాక్టర్ స్టంట్స్‌లో యువకుడి మృతి.. పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
చంఢీగర్: ట్రాక్టర్ కింద నలిగి యువకుడు మృతి చెందిన తర్వాత పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాక్టర్‌పై స్టంట్స్ చేయడాన్ని నిషేధించింది. ఇలాంటి విన్యాసాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసింది. "ప్రియమైన పంజాబీలారా, ట్రాక్టర్‌ను పొలాల రాజు అంటారు. దానిని మృత్యుదేవతగా చేయవద్దు. ట్రాక్టర్ సంబంధిత పనిముట్లతో ఎలాంటి స్టంట్ లేదా ప్రమాదకరమైన పనితీరు పంజాబ్‌లో నిషేధించబడింది.” అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ట్విట్టర్(ఎక్స్) లో తెలిపారు. పంజాబ్ గురుదాస్‌పూర్‌లోని గ్రామీణ క్రీడా ఉత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్టంట్ చేస్తూ ఓ యువకుడు(29) ట్రాక్టర్ కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. ఫతేఘర్ చురియన్ నియోజకవర్గంలోని సర్చూర్ గ్రామంలో ట్రాక్టర్ స్టంట్స్ క్రీడా ఉత్సవాలు జరిగాయి. ఈ క్రమంలో సుఖ్‌మన్‌దీప్ సింగ్ అనే యువకుడు స్టంట్స్ చేసే క్రమంలో మరణించాడు. స్టంట్స్ చేసే క్రమంలో సుఖ్‌మన్‌దీప్ ట్రాక్టర్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: విషాదం: క్రీడా ఉత్సవంలో అపశ్రుతి.. ట్రాక్టర్ కింద నలిగి యువకుడు మృతి -
గాల్లో ప్రాణాలు అంటే ఇదేనేమో.. బతికిపోయాడు!
స్పిల్బర్గ్ వేదికగా జరిగిన ఆస్ట్రియా జీపీ ఎఫ్-1 రేసులో ఒక ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. రేసును చూడడానికి చాలా మంది అభిమానులు రావడంతో వారిని ఎంటర్టైన్ చేసేందుకు నిర్వాహకులు.. స్టంట్మన్స్తో గాలిలో జెట్ప్యాక్స్తో కొన్ని స్టంట్స్ చేయించారు. సూపర్‌గా సాగుతూ మంచి ఎంటర్టైనింగ్ నడుస్తున్న సమయంలో ఊహించని రీతిలో ఒక స్టంట్‌మన్ జెట్ప్యాక్ ల్యాపింగ్ అయింది. దీంతో ఒక్కసారిగా కంట్రోల్ తప్పిన స్టంట్‌మన్ నేరుగా రేసు నిర్వహించే ల్యాప్‌పై మూడు పల్టీలు కొట్టాడు. అంత పైనుంచి పడినా అదృష్టవశాత్తూ సదరు స్టంట్మన్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరికొద్ది నిమిషాల్లో రేసు ప్రారంభమవుతుందనగా ఇది చోటుచేసుకోవడంతో కాస్త ఆందోళన కలిగించినా.. ఆ స్టంట్‌మన్ తనంతట తానుగా లేచి వెళ్లిపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రేసు విషయానికి వస్తే ఆదివారం ఆస్ట్రియన్ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఈ ట్రాక్‌పై తనకు పోటీనిచ్చిన ఫెరారీ రేసర్ చార్లెస్ లెక్లెర్క్ను వెనక్కి నెట్టి తన వేగంతో అగ్ర స్థానంలో నిలిచాడు. దీంతో నిరుటి విజేత లెక్లెర్క్ రెండో స్థానంతో తృప్తి చెందాడు.పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన వెర్స్టాపెన్ 71 ల్యాపుల్ని అందరికంటే ముందుగా ఒక గంటా 25 నిమిషాల 33.607 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ సీజన్లో 25 ఏళ్ల ఈ డచ్ డ్రైవర్కిది వరుసగా ఐదో విజయం కాగా... ఓవరాల్‌గా ఇప్పటివరకు జరిగిన 9 రేసుల్లో ఏడో విజయాన్ని నమోదు చేశాడు. దీంతో 377 పాయింట్లతో రెడ్‌బుల్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదే జట్టుకు చెందిన సెర్గియో పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు. తదుపరి రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఈ నెల 9న సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌పై జరుగుతుంది. Oscar Piastri nailing 'The Office' camera look after this jet-pack mishap! 😂 Glad to see the jet-pack flier in good spirits after too 😊#AustrianGP #F1 @OscarPiastri @McLarenF1 pic.twitter.com/AUwS04whpd — Formula 1 (@F1) July 2, 2023 చదవండి: ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ అడవి రాముడు లింబా రామ్.. గురి పెట్టాడో..! -
విషాదం: ప్రపంచ రికార్డ్ కోసం ఫీట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు
వాషింగ్టన్: అమెరికాకు చెందిన అలెక్స్ హార్విల్(28) అనే యువకుడు వరల్డ్ రికార్డ్ కోసం బైక్‌తో స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. వాషింగ్టన్‌లోని మోసెస్ లేక్ విమానాశ్రయంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్టంట్ మాన్ హార్విల్ 351 అడుగులు జంప్ చేసి గిన్నిస్ రికార్డ్ బద్దలు కొట్టాలనుకున్నాడు. దీని కోసం మోటార్ సైకిల్ రాంప్ ఏర్పాటు చేసి, ఓ మట్టి దిబ్బపై జంప్ చేయడానికి ప్రయత్నించాడు . ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన హాలెక్స్ అక్కడే కుప్పకూలి చనిపోయాడు. స్టంట్ మాన్ అలెక్స్ హార్విల్ మరణం డర్ట్ బైక్ జంపింగ్ డేర్ డెవిల్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా, అలెక్స్ హార్విల్ స్టంట్ కోసం ప్రయత్నిస్తూ.. మరణించినట్లు గురువారం గ్రాంట్ కౌంటీ కరోనర్ కార్యాలయం ధృవీకరించింది. అలెక్స్ మృతి పట్ల అతడి కుటుంబానికి, స్నేహితులకు, ప్రియమైనవారికి గ్రాంట్ కౌంటీ కరోనర్ కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. కాగా, కాలిఫోర్నియాలోని కరోనాలో జన్మించిన హార్విల్ ఇప్పటికే ఓ ప్రపంచ రికార్డ్ సాధించాడు. జూలై 2013లో హార్విల్ మోటారుసైకిల్‌పై 297 అడుగుల పొడవైన ‘డర్ట్-టు-డర్ట్ రాంప్ జంప్’ తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. ABD’de 28 yaşında deneyimli motosiklet sürücüsü Alex Harvill, 106.98 metrelik akrobasi atlayışı ile dünya rekoru kırmaya çalışırken hayatını kaybetti. pic.twitter.com/r2ZuxB95Hm — Griffin (@griffincomtr) June 19, 2021 చదవండి: Sanjay Raut: మహావికాస్ ఆఘాడి కూటమి బలంగా ఉంది చదవండి: వైరల్ వీడియో: మెట్రో ఎక్కిన కోతి.. మరి టికెట్ ఏది? -
రజనీకాంత్‌ను కత్తితో పొడవడానికి రాగా..!
చాలా కాలం క్రితం కర్ణాటకలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్ర షూటింగ్ జరుగుతుండగా అక్కడ అనూహ్యంగా ఓ గొడవ జరిగింది. గొడవకు పాల్పడ్డవాళ్లు రజనీకాంత్‌ను కత్తితో పొడవడానికి రాగా స్టంట్ కళాకారుడు అదిరడి అరసు అడ్డుపడి ఆయన ప్రాణాలు కాపాడి తాను కత్తిపోటుకు గురయ్యాడు. అప్పుడు రజనీ ప్రాణానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడిన అదిరడి అరసు హీరోగా తెరకెక్కుతున్న సినిమా కబడివీరన్. స్టంట్ కళాకారుల జీవితం ప్రమాదాల మయం అని చెప్పనక్కర్లేదు. షూటింగ్స్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదం ఎటువైపు నుంచి పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి. అలా రిస్కీ సన్నివేశాలకు పేరు గాంచిన స్టంట్ కళాకారుడు అదిరడి అరసు. ఈయన తాజాగా కథానాయకుడిగా, దర్శకుడిగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అదిరడి అరసు హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం కబడివీరన్. అమ్మయప్పన్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న స్టంట్‌మాస్టర్, గిల్డ్ అధ్యక్షుడు జాగ్వుర్‌తంగం మాట్లాడుతూ రిస్క్ చేసి నటించడంలో పేరు పొందిన స్టంట్ కళాకారుడు అదిరడిఅరుసు అని అన్నారు. మనం చెప్పడం పూర్తి చేసే లోపే ఆ పని ముగిస్తాడని అన్నారు. తనకేదైనా సమస్య అంటే వచ్చి నిలబడతాడని చెప్పారు. ఆయన వస్తున్నాడంటేనే తన కార్యాలయంలోని వారు భయపడతారన్నారు. అదిరడి అరసు అంత ధైర్యశాలి అని అన్నారు. కాగా అదిరడి అరసు నటించి దర్శకత్వం వహించిన కబడివీరన్ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కే.భాగ్యరాజ్, నటుడు రాధారవి, దర్శకుడు మిష్కిన్, నటి నమిత, భానుచందర్ అతిథులుగా పాల్గొన్నారు. -
నిజమైన కత్తితోపొడిచేసింది!
ఒక్కోసారి సినిమా షూటింగుల్లో జరిగే చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ఇటీవల ‘ఏక్ విలన్’ సినిమా షూటింగులో ఇలాంటి పొరపాటే ఒకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, ప్రధాన తారాగణమైన శ్రద్ధాకపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్ పాల్గొనగా కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు మోహిత్ సూరి. అవసరార్థం కొన్ని నకిలీ ఆయుధాలను కూడా తెప్పించారు. అయితే... ఆ నకిలీ ఆయుధాల మధ్య నిజమైన ఆయుధం కూడా ఒకటి ఉంది. అది తెలీని శ్రద్ధాకపూర్... ఆ నిజమైన ఆయుధాన్నే చేతిలో పట్టుకొని, ఎదురుగా ఉన్న స్టంట్‌మేన్‌తో సరదాగా యుద్ధ విన్యాసం చేయడం మొదలుపెట్టింది. అది నకిలీ ఆయుధమే అనుకొని ఆ స్టంట్‌మెన్‌ని గట్టిగా పొడిచేసింది. ఇంకేముంది... క్షణాల్లో అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. లొకేషన్ మొత్తం గందరగోళం. తీవ్రంగా గాయపడ్డ ఆ స్టంట్‌మేన్‌ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఇక శ్రద్ధాకపూర్ అయితే... కళ్ళ ముందు ఏం జరుగుతోందో తెలియనంత షాక్‌లోకి వెళ్లిపోయింది. అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అనే వార్త చెవిన పడే వరకూ ఆమె మనిషి కాలేదు. ఎట్టకేలకు ఆ స్టంట్ మేన్‌కు ప్రమాదం తప్పడంతో యూనిట్ మొత్తం ఊపిరి పీల్చుకుంది.