చంఢీగర్: ట్రాక్టర్ కింద నలిగి యువకుడు మృతి చెందిన తర్వాత పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాక్టర్‌పై స్టంట్స్ చేయడాన్ని నిషేధించింది. ఇలాంటి విన్యాసాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసింది.
"ప్రియమైన పంజాబీలారా, ట్రాక్టర్‌ను పొలాల రాజు అంటారు. దానిని మృత్యుదేవతగా చేయవద్దు. ట్రాక్టర్ సంబంధిత పనిముట్లతో ఎలాంటి స్టంట్ లేదా ప్రమాదకరమైన పనితీరు పంజాబ్‌లో నిషేధించబడింది.” అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ట్విట్టర్(ఎక్స్) లో తెలిపారు.
పంజాబ్ గురుదాస్‌పూర్‌లోని గ్రామీణ క్రీడా ఉత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్టంట్ చేస్తూ ఓ యువకుడు(29) ట్రాక్టర్ కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. ఫతేఘర్ చురియన్ నియోజకవర్గంలోని సర్చూర్ గ్రామంలో ట్రాక్టర్ స్టంట్స్ క్రీడా ఉత్సవాలు జరిగాయి. ఈ క్రమంలో సుఖ్‌మన్‌దీప్ సింగ్ అనే యువకుడు స్టంట్స్ చేసే క్రమంలో మరణించాడు. స్టంట్స్ చేసే క్రమంలో సుఖ్‌మన్‌దీప్ ట్రాక్టర్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: విషాదం: క్రీడా ఉత్సవంలో అపశ్రుతి.. ట్రాక్టర్ కింద నలిగి యువకుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment