Bans
-
బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు.. సోషల్ మీడియా యాప్స్‌పై నిషేధం
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అంశంపై మళ్లీ అల్లర్లు చెలరేగడంతో ప్రభుత్వం సోషల్ మీడియా యాప్‌లైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్‌టాక్, యూట్యూబ్‌లను తాత్కాలికంగా నిషేధించింది. అయితే దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా, గ్లోబల్ ఐస్‌లు తమ నివేదికలలో బంగ్లాదేశ్‌లో సోషల్ మీడియా నిషేధానికి సంబంధించిన సమాచారాన్ని అందించాయి.టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, వాట్సాప్ తదితర ప్రముఖ సోషల్ మీడియా యాప్‌ల వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధించింది. అదేవిధంగా గ్లోబల్ ఐస్ న్యూస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా సోషల్ మీడియా సైట్లపై తాత్కాలిక నిషేధం విధించినట్లు గ్లోబల్ ఐస్ ఒక నివేదికలో పేర్కొంది. ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటల తర్వాత మెటా ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన నెట్‌వర్క్‌ను పరిమితం చేసింది. ఇంటర్నెట్ స్పీడ్‌ను కూడా తగ్గించింది. ప్రధాని షేక్ హసీనాతో పాటు ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి నిరసనలు మొదలయ్యాయి. గత నెలలో ఇటువంటి ఆందోళనలు జరగగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. రిజర్వేషన్ కోటాపై బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత కాస్త సద్దుమణిగిన నిరసనలు మళ్లీ ఇప్పుడు మొదలయ్యాయి. -
రష్యా యాంటీవైరస్పై అమెరికా సంచలన నిర్ణయం
రష్యాకు చెందిన ప్రముఖ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌పై అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై తన పాపులర్ యాంటీవైరస్ ఉత్పత్తులను తమ దేశంలో అందించకుండా అమెరికా వాణిజ్య శాఖ నిషేధం విధించింది."కాస్పర్ స్కై సాధారణంగా ఇతర కార్యకలాపాలతో పాటు, యునైటెడ్ స్టేట్స్ లోపల తన సాఫ్ట్ వేర్ ను విక్రయించడానికి లేదా ఇప్పటికే ఉపయోగంలో ఉన్న సాఫ్ట్ వేర్ కు నవీకరణలను అందించడానికి వీలుండదు" అని అమెరికా వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.సున్నితమైన అమెరికా సమాచారాన్ని సేకరించి ఆయుధాలుగా మార్చడానికి కాస్పర్ స్కై ల్యాబ్ వంటి రష్యన్ కంపెనీలను ఉపయోగించుకునే సామర్థ్యం, ఉద్దేశం తమకు ఉన్నాయని రష్యా పదేపదే నిరూపించిందని అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో ఒక ప్రకటనలో తెలిపారు. వారి సాంకేతిక పరిజ్ఞానం అమెరికాకు, తమ పౌరులకు ముప్పుగా పరిణమించినప్పుడు చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని వాణిజ్య శాఖ చర్యలు అమెరికా ప్రత్యర్థులకు తెలియజేస్తున్నాయన్నారు.కాస్పర్‌స్కై యాంటీవైరస్ సాఫ్ట్ వేర్ అమ్మకాలను నిషేధించడంతో పాటు, ఈ సంస్థతో సంబంధం ఉన్న మూడు సంస్థలను జాతీయ భద్రతా ఆందోళనగా భావించే కంపెనీల జాబితాలో అమెరికా వాణిజ్య శాఖ చేర్చింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 29 వరకు అమెరికాలో యాంటీవైరస్ అప్డేట్లను అందించడం సహా కొన్ని కార్యకలాపాలను కొనసాగించడానికి మాత్రం కాస్పర్స్కైని అనుమతించారు.మాస్కోలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న కాస్పర్‌స్కై సంస్థ ప్రపంచవ్యాప్తంగా 31 దేశాలలో కార్యాలయాలను కలిగి ఉంది. 200కి పైగా దేశాలలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులు, 270,000 కార్పొరేట్ క్లయింట్లకు సేవలు అందిస్తోందని వాణిజ్య శాఖ తెలిపింది. -
ట్రాక్టర్ స్టంట్స్‌లో యువకుడి మృతి.. పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
చంఢీగర్: ట్రాక్టర్ కింద నలిగి యువకుడు మృతి చెందిన తర్వాత పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాక్టర్‌పై స్టంట్స్ చేయడాన్ని నిషేధించింది. ఇలాంటి విన్యాసాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసింది. "ప్రియమైన పంజాబీలారా, ట్రాక్టర్‌ను పొలాల రాజు అంటారు. దానిని మృత్యుదేవతగా చేయవద్దు. ట్రాక్టర్ సంబంధిత పనిముట్లతో ఎలాంటి స్టంట్ లేదా ప్రమాదకరమైన పనితీరు పంజాబ్‌లో నిషేధించబడింది.” అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ట్విట్టర్(ఎక్స్) లో తెలిపారు. పంజాబ్ గురుదాస్‌పూర్‌లోని గ్రామీణ క్రీడా ఉత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్టంట్ చేస్తూ ఓ యువకుడు(29) ట్రాక్టర్ కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. ఫతేఘర్ చురియన్ నియోజకవర్గంలోని సర్చూర్ గ్రామంలో ట్రాక్టర్ స్టంట్స్ క్రీడా ఉత్సవాలు జరిగాయి. ఈ క్రమంలో సుఖ్‌మన్‌దీప్ సింగ్ అనే యువకుడు స్టంట్స్ చేసే క్రమంలో మరణించాడు. స్టంట్స్ చేసే క్రమంలో సుఖ్‌మన్‌దీప్ ట్రాక్టర్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: విషాదం: క్రీడా ఉత్సవంలో అపశ్రుతి.. ట్రాక్టర్ కింద నలిగి యువకుడు మృతి -
స్టాక్‌మార్కెట్ పేరుతో అక్రమ సంపాదన.. సెబీ కొరడా!
సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని స్టాక్మార్కెట్లో పెట్టుబడుల పేరుతో అక్రమంగా రూ.కోట్లు వెనకేసిన ఓ వ్యక్తిని మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) మార్కెట్ నుంచి నిషేధించింది. అంతేకాదు సంపాదించిన సొమ్మునంతటినీ ఎస్క్రో ఖాతా (తాత్కాలిక థర్డ్‌పార్టీ అకౌంట్)లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మహ్మద్ నసీరుద్దీన్ అన్సారీ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో 'బాప్ ఆఫ్ చార్ట్' (Baap of Chart) పేరుతో ప్రొఫైల్‌ను నడుపుతున్నాడు. అందులో స్టాక్ మార్కెట్లో కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన సిఫార్సులను అందించేవాడు. అంతేకాకుండా మార్కెట్‌పై అవగాహన కోర్సులు నిర్వహించేవాడు. ఇలా చట్టవిరుద్ధంగా రూ. కోట్లు సంపాదించాడు. బాప్ ఆఫ్ చార్ట్ లేదా మరేదైనా పేరుతో పెట్టుబడి సలహాదారులుగా వ్యవహరించరాదని సెబీ తన ఆదేశాల్లో మహ్మద్ నసీరుద్దీన్ అన్సారీని హెచ్చరించింది. అలాగే చట్టవిరుద్ధంగా సంపాదించిన సుమారు రూ.17.20 కోట్లను ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో ఎస్క్రో ఖాతాను తెరిచి 15 రోజులలోపు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఖాతాపై సెబీకి తాత్కాలిక హక్కు ఉంటుందని, సెబీ అనుమతి లేకుండా అందులోని సొమ్మును విడుదల చేయరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్‌గా.. మహ్మద్ నసీరుద్దీన్ అన్సారీ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తనను తాను స్టాక్ మార్కెట్ నిపుణుడిగా ప్రమోట్ చేసుకున్నాడని, మార్కెట్‌పై తాను అందించే కోర్సులలో చేరాలని పెట్టుబడిదారులను ఆకర్షించాడని సెబీ పేర్కొంది. తన సలహాలను పాటిస్తే ఖచ్చితమైన లాభాలు వస్తాయని నమ్మించి సెక్యూరిటీస్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేలా వారిని ప్రేరేపించాడని వివరించింది. ఇటువంటి మోసపూరిత, నమోదుకాని పెట్టుబడి సలహా కార్యకలాపాల ద్వారా మహ్మద్ నసీరుద్దీన్ అన్సారీ రూ. 17.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సెబీ తెలిపింది. -
అక్కడి యూనివర్సిటీల్లో హోలీ వేడుకలు నిషేధం..
విశ్వవిద్యాలయాల్లో హోలీ వేడుకల్ని నిషేధిస్తూ పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ దేశ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేడుకల కారణంగా సామాజిక సంస్కృతిక విలువలు దెబ్బతింటున్నాయని పేర్కొంది. దేశానికి ఉన్న ఇస్లామిక్ గుర్తింపునకు భంగం వాటిల్లుతుందని స్పష్టం చేసింది. క్వాయిడ్-ఐ-అజామ్ విశ్వవిద్యాలయంలో జూన్ 12న హోలీ వేడుకలు జరిగిన వీడియోలు నెట్టింట వైరల్ కాగా విద్యా మండలి ఈ నిర్ణయం తీసుకుంది. 'వివిధ రకాల మత విశ్వాసాలు, ఆచారాలతో కూడిన వైవిధ్యత ఇతర మతాలను గౌరవించే సమాజాన్ని సృష్టిస్తుంది. ఈ రకమైన సమాజాన్ని అందరూ కోరుకుంటారు. ఈ వాస్తవాన్ని మేము గౌరవిస్తున్నాం. కానీ ఈ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం' అని విద్యామండలి ఉత్తర్వుల్లో పేర్కొంటూ హోలీ వేడుకలను నిషేధించింది. Holi celebrations in Quaid-I-Azam University Islamabad Pakistan 🍁 Biggest holi celebration in Pakistan 💓 pic.twitter.com/xdBXwYEglt — QAU News (@NewsQau) June 13, 2023 క్వాయిడ్-ఐ-అజామ్ విశ్వవిద్యాలయంలో హోలీ వేడుకలు ఈసారి ఘనంగా జరిగాయి. వీటిని యూనివర్సిటీకి చెందిన సంస్కృతిక సంస్థ నిర్వహించింది. ఇవి కాస్త వైరల్ కాగా విద్యా మండలి ఈ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ యూనివర్సిటీ ప్రాంగణంలో మార్చి నెలలో హోలీ వేడుకలు జరుపుతున్న హందూ విద్యార్థులపై ఇస్లామిక్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ దాడులు జరిపింది. ఇందులో 15 మంది హిందూ విద్యార్థులు గాయపడ్డారు. Holi celebrations Quaid-i-Azam University Islamabad 🖤 🥀#QAU_ISLAMABAD #holi #holi2023 pic.twitter.com/CHVkY5NL1m — QAU News (@NewsQau) June 19, 2023 ఇదీ చదవండి: ముంబై దాడుల ప్రధాన సూత్రధారికి అండగా నిలిచిన చైనా -
ఈ మందులు వాడొద్దు.. 14 ఔషధాలను బ్యాన్ చేసిన ప్రభుత్వం
భారత ప్రభుత్వం 14 ఔషధాలను బ్యాన్ చేసింది. నిషేధిత ఔషధాలలో సాధారణ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జ్వరం చికిత్సకు ఉపయోగించే మందులు ఉన్నాయి. నిపుణుల కమిటీ సిఫార్సులను అనుసరించి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. నిమెసులైడ్, పారాసెటమాల్ డిస్పర్సిబుల్ మాత్రలు, క్లోఫెనిరమైన్ మేలేట్, కోడైన్ సిరప్‌లతో సహా 14 ఫిక్స్డ్-డోస్ కాంబినేషన్ డ్రగ్స్‌ను ప్రభుత్వం నిషేధించింది. ఈ మందులకు చికిత్సాపరమైన సమర్థన లేదని, వాటిని ఉపయోగించడం వల్ల ప్రమాదం కలిగే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నిషేధించిన మందులు ఇవే.. నిషేధిత ఔషధాలలో సాధారణ అంటువ్యాధులు, దగ్గు, జ్వరం చికిత్సకు ఉపయోగించే మందులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా.. నిమెసులైడ్ + పారాసెటమాల్ డిస్పర్సిబుల్ మాత్రలు, క్లోర్ఫెనిరమైన్ మలేట్ + కోడైన్ సిరప్, ఫోల్కోడిన్ + ప్రోమెథాజైన్, అమోక్సిసిలిన్ + బ్రోమ్హెక్సిన్ బ్రోమ్హెక్సిన్ + డెక్స్ట్రోమెథోర్ఫాన్ + అమ్మోనియం క్లోరైడ్ +మెంథాల్ పారాసెటమాల్ + బ్రోమ్హెక్సిన్ + ఫినైల్ఫ్రైన్ + క్లోర్ఫెనిరమైన్ + గుయిఫెనెసిన్ సాల్బుటమాల్ + బ్రోమ్హెక్సిన్ ఎఫ్డీసీ మందులు అంటే.. ఫిక్స్డ్-డోస్ కాంబినేషన్ డ్రగ్స్ (ఎఫ్డీసీ) అనేవి స్థిర నిష్పత్తిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాశీల ఫార్మాస్యూటికల్ పదార్థాల కలయికను కలిగి ఉంటాయి. 344 కాంబినేషన్ల ఔషధాల తయారీ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు 2016లోనే ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై ఆయా మందుల తయారీదారులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. శాస్త్రీయ సమాచారం లేకుండా ఆ మందులను రోగులకు విక్రయిస్తున్నట్లు ఆ కమిటీ కోర్టుకు నివేదించింది. ప్రస్తుతం నిషేధించిన 14 ఎఫ్డీసీ మందులు కూడా ఆ 344 ఔషధాల జాబితాలో ఉన్నవే. -
కార్వీ ప్రమోటర్లపై 7 ఏళ్ల సెబీ నిషేధం
-
దాదాపు 27 లక్షల ఖాతాలపై వేటువేసిన వాట్సాప్
సాక్షి,ముంబై: మెటాకు చెందిన ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ ఈ నెలలో కూడా పెద్ద ఎత్తున ఖాతాలపై వేటు వేసింది. సెప్టెంబర్ 30 వరకు ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలను నిషేధించింది.సెప్టెంబర్ నివేదిలో సంబంధిత వివరాలను సంస్థ వెల్లడించింది. ఇందులో 8 లక్షలకుపైగా వాట్సాప్ అకౌంట్లనుఎలాంటి ఫిర్యాదలు రాకముందే తొలగించినట్లు వాట్సాప్ పేర్కొంది. ఫేక్ వార్తలు, తప్పుడు సమాచారాన్ని నిరోధించే క్రమంలో తప్పుడు, నకిలీ ఖాతాలను బ్యాన్ చేసింది. అలాగే భారత ఐటీ రూల్స్ 2021కి (IT Rules 2021) అనుగుణంగా లక్షలాదిగా వాట్సాప్ అకౌంట్లను నిలిపి వేస్తుంది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు 2022 సెప్టెంబర్ యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌ను భారత ఐటీ మంత్రిత్వ శాఖకు అందించింది. అలాగే సెప్టెంబర్‌లో 666 ఫిర్యాదులు అందగా, 23 మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది. గ్రీవెన్స్ ఛానెల్ ద్వారా వినియోగదారుల ఫిర్యాదులకు ప్రతిస్పందించడం, వాటిపై చర్యలు తీసుకోవడంతో పాటు, ప్లాట్‌ఫారమ్‌లో హానికరమైన కంటెంట్‌ను నివారిస్తున్నామని, ఎందుకంటే హాని జరిగిన తరువాత గుర్తించడం కంటే ముందునేగా నివారించడానికే తమ ప్రాధాన్యత వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. -
తాలిబన్లకు భారీ షాకిచ్చిన ఫేస్బుక్..!
లండన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తాలిబన్లపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యాప్‌లను వినియోగించకుండా తాలిబన్లపై ఫేస్బుక్ నిషేధం విధించింది. తాలిబన్లకు మద్దతుగా ఉన్న కంటెంట్‌పై కూడా ఫేస్బుక్ నిషేధం విధించనుంది. తాలిబన్లకు అనుకూలంగా ఉన్న కంటెంట్, వీడియోలను, పోస్ట్‌లను తొలగించేందుకు ప్రత్యేకమైన అఫ్గాన్ నిపుణుల బృందాన్ని ఫేస్బుక్ ఏర్పాటుచేసింది.(చదవండి: Afghanistan: తాలిబన్ల కీలక ప్రకటన.. అఫ్గాన్లకు..) తాలిబన్లను యూఎస్ టెర్రరిస్టు సంస్థగా గుర్తించిన్నట్లు ఫేస్బుక్ పేర్కొంది. గత కొన్నేళ్లుగా తాలిబన్ తన సందేశాలను వ్యాప్తి చేయడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలను వాడుకుంటుంది. తాలిబన్ల సందేశాలను నిర్మూలించడం కోసం ఫేస్బుక్ ప్రత్యేకంగా స్థానిక దరి పెర్షియన్, పష్తో భాషలను మాట్లాడే అఫ్గాన్ నిపుణులను నియమించినట్లు ఫేసుబుక్ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. తాలిబన్లు కమ్యూనికేట్ చేసుకోవడం కోసం వాట్సాప్ యాప్ వాడుతున్నట్లు తమ వద్ద నివేదికలు ఉన్నాయని ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు. వాట్సాప్‌లో సర్క్యూలేట్ అయ్యే మెసేజ్‌లను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని ఫేస్బుక్ పేర్కొంది. (చదవండి: తాలిబన్ల దురాగతాలు.. ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్ అలర్ట్! ఆ వీడియోలకు నోట్ తప్పనిసరి) -
కరోనా ఉధృతి: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: కోవిడ్-19 కేసులు కొత్తగా పెరుగుతున్న దృష్ట్యా, అటు థర్డ్‌వేవ్ ప్రమాదంపై నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు భారీ ఊరేగింపులు నిర్వహించకూడదంటూ ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, మతపరమైన సమావేశాల్లో భారీగా గుమిగూడటం, ఊరేగింపులను కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఆగస్టు- అక్టోబర్ వరకు పండుగ సీజన్ ప్రారంభంకాన్ను నేపథ్యంలో వరమహాలక్ష్మి వ్రతం, ముహర్రం, కృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, దుర్గా పూజ తదితర పండుగ రోజుల్లో స్థానికంగా ఆంక్షలను అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆగష్టు 12 నుండి ఆగస్టు 20 వరకు అన్ని రకాల ఊరేగింపులపై నిషేధం విధిస్తూ కొత్త మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. మొహర్రం, గణేశ్, దసరా ఉత్సవాల వేడుకలపై విస్తృతమైన ఆంక్షలను ప్రకటించింది. రెండు పండుగలకు సంబంధించిన అన్ని రకాల ఊరేగింపులను నిషేధించింది. ఆలం, పంజా, తాజియాత్‌లను దూరం నుండి వీక్షించాలి. ప్రార్థన మందిరాలలో మాస్క్ ధరించడం తప్పనిసరి. కోవిడ్ సంబంధిత నిబంధనలు పాటిస్తూ మసీదుల వద్ద ప్రార్థనలు జరపాలని పేర్కొంది. అలాగే కమ్యూనిటీ హాళ్లు, ఓపెన్ గ్రౌండ్, షాదీ మహల్ మొదలైన వాటిలో సామూహిక ప్రార్థనలకు అనుమతిలేదు. గణేష్ చతుర్థికి కూడా ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. గణేష్ పందిళ్ల ఏర్పాటు చేయడాన్ని నిషేధించింది. వినాచయక చవితిని సాధారణ పద్ధతిలో జరుపుకోవాలి. వినాయక విగ్రహాన్ని తీసుకువచ్చేటప్పుడు, నిమజ్జన సంయంలో మాత్రమే ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించాలి. గణేశ్, దేవీ విగ్రహాలను నిర్దేశించిన ప్రదేశాలలోనే నిమజ్జనం చేయాలి. దేవాలయాలను ప్రతిరోజూ విధిగా శానిటైజ్ చేయాలి. శానిటైజర్ ఉపయోగించిన తర్వాత మాత్రమే భక్తులను అనుమతించాలి. థర్మల్ చెకింగ్ సదుపాయాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. బెంగళూరులో బ్లాక్ ఫంగస్ మాదిరిగా ఎనిమిది మందిలో రెడ్ ఫంగస్ బయటపడింది. ఇప్పటివరకు కరోనా సోకినవారిలో, కోలుకున్నవారిలో కొందరు బ్లాక్‌ఫంగస్, వైట్, యెల్లో ఫంగస్లకు గురికావడం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రెడ్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. ఐటీ నగరంలో గత ఐదురోజుల్లో 192 మంది కరోనా రోగుల నుంచి నమూనాలను తీసుకుని పరీక్షలు చేయగా వారిలో 148 మందిలో డెల్టా వైరస్ బయటపడింది. మరో 8 మందిలో రెడ్ ఫంగస్ కనిపించినట్లు బెంగళూరు కార్పొరేషన్ ఆరోగ్య విభాగం ప్రత్యేక కమిషనర్ రణదీప్ తెలిపారు. అయితే రెడ్ ఫంగస్‌తో అంత ప్రమాదం లేదన్నారు. డెల్టా రకం వేగంగా సోకుతుండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బెంగళూరులో జూలైలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 12 శాతం పిల్లల కేసులు కాగా ఆగస్టు మొదటివారంలో ఇది 13 శాతానికి చేరింది. 12-18 ఏళ్లు మధ్య వయస్సు పిల్లలు ఎక్కువగా బయట తిరుగుతుండటం వల్ల కరోనా సోకుతోందని రణదీప్ తెలిపారు. -
కుదేలవుతున్న ఏవియేషన్, విమానాల రాకపోకలపై నిషేధం
నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఏవియేషన్ రంగానికి మరో ఎదురు దెబ్బతగిలింది. కరోనా కారణంగా అంతర్జాతీయ రాకపోకలపై కేంద్రం నిషేధం విధించింది. మనదేశంలో ఏవియేషన్ రంగాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించడంతో ఇండియన్ ఎయిర్ లైన్స్ కుదేలవుతోంది. భారతదేశంలోని విమానయాన సంస్థలు 2022 ఆర్థిక సంవత్సరంలో 4.1 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసినట్లు ఏవియేషన్ కన్సల్టెన్సీ సిఏపీఏ అంచనా వేసింది. అందులో 1.1 బిలియన్ డాలర్లు ఐపివోలు, క్యూఐపిలు ఇతర పరికరాల రూపంలో అవసరం ఉన్నాయని తెలిపింది. అయితే ఈ నష్టాలు ఇప్పట్లో ఆగిపోయేలా లేవని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో..డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జులై 31వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. తాజాగా,ఆ నిషేధాన్ని ఆగస్ట్ 31 వరకు 31వ తేదీ వరకు పొడిగించింది. వందే భారత్ మిషన్ కింద నడుస్తున్న విమానాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కోవిడ్-19 కేసుల పెరుగుదలతో విధించిన ట్రావెల్ బ్యాన్‌ను ఎత్తేస్తే అంతర్జాతీయ విమాన సర్వీసులతో ఇండియన్ ఏవియేషన్ కు ఉపశమనం కలుగుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ కేంద్రం ఆంక్షల్ని కొనసాగించడంతో నష్టాలు పెరిగే అవకాశం ఉంది. కాగా, ఇండియన్ వారెన్ బఫెట్ రాకేష్ జున్‌జున్‌వాలా విమానయాన రంగంలో పెట్టుబడులను పెట్టనున్న విషయం తెలిసిందే. వచ్చే నాలుగు సంవత్సరాల్లో సుమారు 70 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కొత్త ఎయిర్‌లైన్‌ను మొదలుపెట్టాడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు రాకేష్ జున్‌జున్‌వాలా ప్రకటించారు. మరి ఆయన పెట్టుబడులతో ఏవియేషన్ రంగం ఎలాంటి వృద్ది సాధిస్తోంది చూడాల్సి ఉంది. -
ఒలింపిక్స్‌లో నిరసన ప్రదర్శనలపై నిషేధం
టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు పోడియంపై పతకాలు తీసుకొని వెనక్కి వచ్చేయాలి తప్ప... అవకాశం దొరికింది కదా అని రాజకీయ ప్రసంగాలు, నిరసన ప్రదర్శలనలను చేపడితే ఇక వారి కథ కంచికి చేరినట్లే. ఈ మేరకు ఒలింపిక్స్‌లో క్రీడాకారుల నిరసన ప్రదర్శనలపై ఉన్న నిషేధాన్ని కొనసాగించేందుకే తాము నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) స్పష్టం చేసింది. ఒకవేళ క్రీడాకారులు నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని ఐఓసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టీ కొవెన్ట్రీ హెచ్చరించారు. -
భారత్‌లో చైనా యాప్స్‌పై నిషేధం
-
పీఏసీఎల్ : ప్రముఖ గాయకుడికి సెబీ షాక్
సాక్షి, ముంబై: ప్రముఖగాయకుడు సోనూ నిగమ్‌కు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ భారీ షాక్ ఇచ్చింది. వివాదాస్ప సంస్థ పెరల్స్ ఆగ్రోటెక్ కార్పొరేషన లిమిటెడ్ (పీఏసీఎల్) నుంచి కొనుగోలు చేసిన ముంబైకి 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్జాత్‌లో నిగమ్ ఫామ్‌హౌస్ విక్రయంపై నిషేధం విధించింది. అలాగే గత 18 సంవత్సరాలుగా సమిష్టి పెట్టుబడి పథకాల ద్వారా పెట్టుబడిదారుల నుండి అక్రమంగా రూ .60,000 కోట్లకు పైగా వసూలు చేసిన పీఏసీఎల్‌పై సెబీ అనేక ఆంక్షలు విధించింది. ఆస్తుల విక్రయం, బదిలీలకు అనుమతిని నిరాకరించింది. మహారాష్ట్రలోని కర్జాత్ ప్రాంతంలోని వ్యవసాయ భూముల విక్రయాన్ని లేదా బదిలీ చేయడాన్ని అడ్డుకుంటూ సెబీ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే సోనూ నిగంతోపాటు వైటల్ సీ మార్కెటింగ్‌కు చెందిన స్థిర, చర ఆస్తుల పూర్తి వివరాలను రెండు వారాల్లో అందించాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మార్చి 9 తేదీన ఆదేశించింది. పీఏసీఎల్ ఆస్తులను విక్రయించడానికి మరియు అమ్మకపు ఆదాయాన్ని పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించడానికి అప్పగించిన పీఏసీఎల్ కమిటీకి, జనవరి 15, 2018న ఫాం హౌస్‌ను సోనూ నిగమ్ కొనుగోలు చేసిన వివరాలపై కమిటీకి తెలియజేస్తూ జాన్ కల్యాణ్ ట్రస్ట్ ఏప్రిల్ 2018 లో ఒక లేఖ రాసింది. పీఏసీఎల్ అనుబంధ సంస్ధ వైటల్ సీ మార్కెటింగ్ నుంచి కొనుగోలు చేసినట్టు తెలిపింది. అయితే 99 శాతానికి పైగా మూలధనం వాటా నేరుగా దాని 21 అసోసియేట్ కంపెనీలు నియంత్రిస్తాయని పీఏసీఎల్ 2018 మేలో ప్రత్ర్యేక కమిటీకి అందించిన సమాచారంలో తెలిపింది. దీని ప్రకారం, తమ అసోసియేట్ సంస్థ వైటల్ సీ మార్కెటింగ్ ఆస్తులను ఎటాచ్ చేయాలని సెబీని కోరింది. కాగా వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల పేరిట ప్రజల నుంచి పీఏసీఎల్ అక్రమంగా రూ. 60వేల కోట్లు సమీకరించిందని తేలిన నేపథ్యంలో ఆగస్టు 22, 2014 నాటి ఉత్తర్వులలో డబ్బును తిరిగి చెల్లించాలని పీఏసీఎల్, దాని ప్రమోటర్లు డైరెక్టర్లను సెబీ ఆదేశించింది. అయితే డబ్బు తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు పీఏసీఎల్, దాని తొమ్మిదిమంది ప్రమోటర్లు, డైరెక్టర్ల అన్ని ఆస్తులను అటాచ్ చేయాలని 2015 డిసెంబర్లో ఆదేశించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కూడా సంస్థ ఆస్తులను విక్రయించి ఆ నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాలంటూ ఆదేశించింది. ఇందుకోసం రిటైర్డ్ జస్టిస్ ఆర్ఎం లోధా సారథ్యంలో సెబీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సంగతి తెలిసిందే. చదవండి: డెక్కన్ క్రానికల్ చైర్మన్‌పై సెబీ నిషేధం -
రీసర్జర్ మైన్స్ చైర్మన్, డైరెక్టర్లపై సెబీ నిషేధం
న్యూఢిల్లీ: జీడీఆర్ ఇష్యూ విషయంలో అక్రమాలకు పాల్పడిన రీసర్జర్ మైన్స్ అండ్ మినరల్స్ ఇండియా సంస్థ చైర్మన్, ఎండీ సుభాష్ శర్మ, హోల్‌టైమ్ డైరెక్టర్ అమిత్ శర్మ, నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెంటెండ్ డైరెక్టర్ నితిత్‌సేథిలను సెక్యూరిటీస్ మార్కెట్లలోకి ప్రవేశించకుండా సెబీ మూడేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ కంపెనీ 2010లో 5.21 మిలియన్ డాలర్ల జీడీఆర్‌లను జారీ చేయడం ద్వారా 53.75 మిలియన్ డాలర్లను సమీకరించింది. ఈ జీడీఆర్‌లు అన్నింటినీ వింటేజ్ ఎఫ్జెడ్ఈ అనే ఒకే సంస్థ యూరోపియన్ అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్‌బ్యాంకు ఏజీ నుంచి రుణం పొందడం ద్వారా సబ్స్క్రయిబ్ చేసుకున్నట్టు సెబీ గుర్తించింది. వింటేజ్ సంస్థ తీసుకున్న రుణాలకు రీసర్జర్ గ్యారంటీ ఇచ్చినట్టు తేలింది. ఈ విధమైన అవగాహన ద్వారా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి జీడీఆర్‌కు మంచి స్పందన వచ్చిందంటూ దేశీయ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడమేనని సెబీ పేర్కొంది. -
పానీపూరీ ప్రియులకు చేదు వార్త!
-
ఇప్కా లాబ్స్‌కు యూఎస్ఎఫ్డీఏ షాక్
ముంబై: దేశీయ ఫార్మా సంస్థ ఇప్కా లేబ్స్ తయరు చేసిన మందును అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ షాక్ తగిలింది. రత్లాం, సిల్వస్సా, పీతంబూర్ మూడు యూనిట్లలో తయారయ్యే అన్ని రకాల ఔషధాల దిగుమతులపై యూఎస్ఎఫ్డీఏ బ్యాన్ విధించడంతో ఇప్కా లేబ్స్ షేర్ భారీ పతనాన్ని నమోదు చేసింది. బీఎస్ఈలో ఈ షేరు 15 శాతం కుప్పకూలింది. మధ్యప్రదేశ్‌లోని పీతంపూర్, రత్లాం, సిల్వస్సా (దాద్రా నగర్ హవేలి) లో తయరుచేసిన అన్ని ఔషధాలపై నిషేధం కొనసాగుతుందని ఇప్కా లాబొరేటరీస్ ఒక ప్రకటనలో తెలిపింది . ఈ తయారీ కేంద్రాల నుండి తయారైన ఔషధ ఉత్పత్తులు , అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన మందులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని ప్రకటించేదాకా బ్యాన్ కొనసాగుతుందని పేర్కొంది. కాగా రత్లాం యూనిట్లో క్లోరోక్విన్ ఏపీఐ తయారీకి మాత్రం యూఎస్ఎఫ్డీఏ వెసులుబాటు కల్పించినట్లు కంపెనీ పేర్కొంది. అమెరికా మార్కెట్లో ఈ ఏపీఐకు కరవు ఏర్పడినా లేదా అవసరం ఏర్పడినా వీటి విక్రయాలను అనుమతించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేశీయ మార్కెట్లో పార్మా బలహీనత కొనసాగుతోంది. దీంతో ఫార్మాసెక్టార్కు దూరంగా ఉండాలని కూడా ఎనలిస్టులు సూచిస్తున్నారు. -
టర్కీ సంచలన నిర్ణయం
అంకారా : పెళ్లి వేడుకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో టర్కీ సంచలన నిర్ణయం తీసుకుంది. హంగు ఆర్భాటాలతో బయట జరిగే వేడుకలపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించింది. భద్రతా కారణాల కోసం బహిరంగ వివాహాలను రద్దు చేస్తున్నట్టు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన భద్రతా చర్యలు.. టర్కీ వ్యాప్తంగా బహిరంగంగా వివాహాలు, ఎంగేజ్మెంట్ కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది. ఇండోర్ వివాహాలు నిర్వహించే వారుకూడా ముందస్తుగా అధికారులకు తెలుపాలని, భద్రతా దళాలు తాము ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టర్కీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను పాటించని వారిపై దుష్ప్రవర్తన చట్టం కింద జరిమానా విధించనున్నట్టు అధికారులు తెలిపారు. గత నెలలో గేసియెంట్ప్ నగరంలో జరిగే స్ట్రీట్ వెడ్డింగ్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడి నేపథ్యంలో భద్రతా చర్యలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది. ఆ దాడిలో 34 చిన్నారులతో పాటు 56 మంది మృతిచెందగా., 100 మంది గాయాలు పాలయ్యారు. ఈ ఆత్మాహుతి దాడి వెనుక ఇస్తామిక్ స్టేట్(ఐఎస్) హస్తమున్నట్టు అధికారులు పేర్కొన్నారు. -
'ఆ దుస్తులతోనే రండి.. లేదంటే పోండి'
ఫ్రాన్స్: బీచ్‌ల్లోకి నిండైన ఈత వస్త్రాలతో(బుర్కినీలతో) స్విమ్మింగ్‌కు రాకుండా కేన్స్ మేయర్ నిషేధం విధించారు. దీంతోపాటు ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాల్లో బీచ్‌లో పూర్తి దుస్తులతో బీచ్‌లకు రావొద్దని గట్టిగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఈ నిబంధనను అతిక్రమిస్తే భారీ మొత్తంలో ఫైన్ చెల్లించాలని హెచ్చరించారు. సాధారణంగా స్మిమ్మింగ్‌కు వెళ్లే సమయంలో కొన్ని మతాలకు చెందిన మహిళలు నిండైన వస్త్రాలతో బీచ్‌లకు వెళుతుంటారు. అయితే గత నెలలో ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఓ ఇస్లామిక్ స్టేట్ ప్రేరేపిత ఉగ్రవాది ట్రక్కుతో ఫ్రాన్స్‌లో నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. అంతకు ముందు కూడా ఉగ్రవాదులు ముసుగులు ధరించి దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హై అలర్ట్ అమలవుతున్న ఫ్రాన్స్‌లోని పలు బీచ్‌లలో ఫుల్ స్మిమ్మింగ్ సూట్ లతో వస్తే రావొద్దని వస్తే బికినీ వస్త్రాల్లో రావాలని లేదంటే బీచ్ రావొద్దని హెచ్చరిస్తున్నారు. ర్యాడికల్ ఇస్లామిస్టులు ఇలాగే ముసుగులతో వచ్చి దాడులకు పాల్పడుతుంటారని అధికారులు భావిస్తుండటం వల్లే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
టీవీ ఛానల్ ను నిషేధించిన ప్రభుత్వం
-
టీవీ ఛానల్ ను నిషేధించిన ప్రభుత్వం
ఢాకా: ఇస్లాం మత భోధకుడు జాకీర్ నాయక్ కు చెందిన పీస్ టీవీ ఛానల్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది. జులై 1 న ఢాకాలోని రెస్టారెంట్ లో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు జాకీర్ నాయక్ బోధనలతో ప్రభావితమయ్యారని నిర్ధారించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బంగ్లా లా అండ్ ఆర్డర్ మినిస్టర్ అమిర్ హుస్సేన్ అము వెల్లడించారు. జాకీర్ నగదు లావాదేవీలపై దృష్టి కేంద్రీకరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయన్ను విచారించనున్నాయని బంగ్లా మంత్రి తెలిపారు. ఇటీవల ఢాకాలోని ఓ రెస్టారెంట్ పై జరిగిన దాడిలో దాదాపు 20 మంది విదేశీయులను అతికిరాతకం చంపిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన వారిలో ఐదుగురు దుండగులను పోలీసులు కాల్చిచంపగా, మరొకడిని సజీవంగా పట్టుకున్నారు. -
బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులు కాల్చొద్దు..
కొచ్చిః కేరళ హైకోర్టు స్థానిక ప్రజలకు ప్రత్యేక తీర్పునిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్, రబ్బర్ వంటి వస్తువులను తగులబెట్టడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా, పౌర సంబంధిత సంస్థలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కోర్టు తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందంటూ హెచ్చరించింది. బ్రీత్ ఈజీ కార్యక్రమంలో భాగంగా కేరళ హైకోర్టు ప్రత్యేక నిర్ణయం తీసుకొంది. రబ్బర్, ప్లాస్టిక్ వంటి వస్తువులను తగులబెట్టడం వల్ల వచ్చే పొగతో వాతావరణ కాలుష్యం ఏర్పడటమే కాక, అనేక శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉండటంతో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. అటువంటి పనులను నిషేధిస్తూ నిబంధనలను విధించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి, అటువంటి పనులకు పాల్పడేవారిపై పోలీసులు సైతం సుమోటో కేసులను ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవాలంటూ ఛీఫ్ జస్టిస్ తొట్టత్తిల్ బి. రాధాకృష్ణన్, అను శివరామన్ లతో కూడిన ధర్మాసనం సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులపెట్టడాన్ని నిషేధిస్తూ కోర్టు ఈ కొత్త ఆదేశాలను జారీ చేసింది. -
ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడకండి..
ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వాధికారులు ప్రైవేట్ ఈ-మెయిల్ అకౌంట్లు వాడకంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. మహారాష్ట్ర సచివాలయం 'మంత్రాలయ'లో కంప్యూటర్లకు ఇటీవల ఏర్పడిన లాకీ వైరస్ దెబ్బతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అధికార పనులకు ప్రైవేట్ ఈ-మెయిల్ లను వాడొద్దని ఆదేశాలు జారీచేసింది. అధికార ఈ-మెయిల్ అకౌంట్లనే ఉద్యోగులు వాడాలని పేర్కొంది. మంత్రాలయాల్లో 150 కంప్యూటర్లు ఈ వైరస్ బారిన పడ్డాయి. వాటిలో ఎక్కువగా రెవెన్యూ, పబ్లిక్ వర్క్ డిపార్ట్ మెంట్ వే ఉన్నాయి. ఈ కంప్యూటర్లను ఫొరెన్సిక్ టెస్టు కోసం ల్యాబ్ కు పంపించారు. ఈ సంఘటన తర్వాత ఇన్ ఫర్ మేషన్ అండ్ టెక్నాలజీ అధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమయ్యారు. ప్రభుత్వ డేటాలో ఎలా భద్రత పెంచాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించారు. మంత్రాలయ ఉద్యోగులందరూ కచ్చితంగా ప్రభుత్వ ఈ-మెయిల్ ఐడీలనే ప్రభుత్వ పనులకు వాడితే, ఈ వైరస్ బారినుంచి తప్పించుకోవచ్చని ఐటీ ప్రిన్సిపాల్ కార్యదర్శి వీకే గౌతమ్ సూచించారు. ఈ సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 90శాతం ఉద్యోగులు జీమెయిల్, యాహు అకౌంట్లనే అధికార పనులకు వాడుతున్నారని అధికారులు చెప్పారు. అన్నీ ముఖ్యమైన అధికార పత్రాలను ఎనిమిది నుంచి తొమ్మిదో రోజుల్లో అధికార మెయిళ్లకు పంపించుకోవాలని గౌతమ్ ఉద్యోగులను ఆదేశించారు. -
344 ఔషధాలపై ఆరోగ్యశాఖ నిషేధం!
దేశవ్యాప్తంగా చలామణి అవుతున్న 344 కాంబినేషన్ ఔషధాలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. వీటిలో ముఖ్యంగా కోరెక్స్, ఫెన్సిడిల్ వంటి దగ్గు మందుల వాడకంతో అనేక నష్టాలు కలుగుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుత నిషేధాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాంబినేషన్ ఔషధాలు మెదడుకు హాని చేస్తుండటమే నిషేధానికి ప్రముఖ కారణంగా తెలుస్తోంది. ఆరోగ్యశాఖ నిషేధం విధించిన 344 డ్రగ్స్ పై గతంలోనే ప్రతిపాదనలు తెచ్చింది. అయితే అప్పట్నుంచీ పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలను అధికారులు తాజాగా ఆమోదించారు. ప్రముఖ సైంటిస్టుల పరిశోధనల్లో ఆయా ఔషధాలు హాని కలిగించేవిగా నిర్థారించారని.. దీంతో వెంటనే వాటిపై నిషేధాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. నిషేధించిన ఔషధాలను తయారుచేస్తున్న 344 పైగా కంపెనీలకు షోకాజ్ నోటీసులను కూడ జారీ చేసింది. నిపుణుల సలహాల మేరకు తదితర సమాచారాన్ని అందిచనున్నట్లు ఆరోగ్య శాఖ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిషేధం అనేక పరీక్షల అనంతరం అమల్లోకి తెచ్చామని తెలిపారు. కాంబినేషన్ డ్రగ్స్ ను రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో ఉత్పత్తిచేసి మార్కెట్లో ప్రవేశ పెడుతున్న కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం 2014 లో దృష్టి సారించింది. సుమారు ఆరువేల సమ్మేళనాలను సమీక్షించేందుకు అప్పట్లో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నిర్థారణ మేరకు ఆయా ఔషధాలపై ప్రస్తుతం నిషేధాన్ని అమల్లోకి తెచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. నిపుణుల కమిటి సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం... ఆయా ఔషధాల ఉత్పత్తి, అమ్మకాలతోపాటు పంపిణీపైనా నిషేధం విధించింది. కాంబినేషన్ డ్రగ్స్ తో దేశ ప్రజలకు కలుగుతున్న నష్టాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నట్లు తాజా నోటిఫికేషన్లో వెల్లడించింది. ముఖ్యంగా మార్కెట్లో అత్యధికంగా కొనుగోలు చేస్తున్న క్లోఫెనిరామిన్ మలీట్, కొడైన్ లు కలిగిన కోరెక్స్ దగ్గుమందు బ్రాండ్ ను వెంటనే బ్యాన్ చేయాలని సూచించారు. ప్రభుత్వ సూచనలకు స్పందించిన ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ ఫిజర్.. తమ ఉత్పత్తుల్లోని కోరెక్స్ పంపిణీతో పాటు ఉత్పత్తిని నిలిపివేసినట్లు బాంబే స్టాక్ ఎక్సేంజ్ కు తెలిపింది. -
లంకలో కిడ్నీ మార్పిడి పై నిషేధం
కొలంబో: శ్రీలంకలో విదేశీయులకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల పై నిషేధం విధించారు. భారతీయ దర్యాప్తు బృందాలు ఇక్కడి నుంచి కిడ్నీలు కొనుగోలు చేసి ఆపరేషన్లు చేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు లంక ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం 4 ఆస్పత్రుల్లో ఆరుగురు డాక్టర్లు ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. భారత్ హెచ్చరికలతో హుటాహుటిన కదిలిన లంక ఆరోగ్యశాఖ వెంటనే దర్యాప్తుకు ఆదేశించింది.