బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అంశంపై మళ్లీ అల్లర్లు చెలరేగడంతో ప్రభుత్వం సోషల్ మీడియా యాప్‌లైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్, యూట్యూబ్‌లను తాత్కాలికంగా నిషేధించింది. అయితే దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా, గ్లోబల్ ఐస్‌లు తమ నివేదికలలో బంగ్లాదేశ్‌లో సోషల్ మీడియా నిషేధానికి సంబంధించిన సమాచారాన్ని అందించాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, వాట్సాప్ తదితర ప్రముఖ సోషల్ మీడియా యాప్‌ల వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధించింది. అదేవిధంగా గ్లోబల్ ఐస్ న్యూస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.
శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా సోషల్ మీడియా సైట్లపై తాత్కాలిక నిషేధం విధించినట్లు గ్లోబల్ ఐస్ ఒక నివేదికలో పేర్కొంది. ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటల తర్వాత మెటా ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన నెట్‌వర్క్‌ను పరిమితం చేసింది. ఇంటర్నెట్ స్పీడ్‌ను కూడా తగ్గించింది. ప్రధాని షేక్ హసీనాతో పాటు ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి నిరసనలు మొదలయ్యాయి. గత నెలలో ఇటువంటి ఆందోళనలు జరగగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. రిజర్వేషన్ కోటాపై బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత కాస్త సద్దుమణిగిన నిరసనలు మళ్లీ ఇప్పుడు మొదలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment