బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశం విడిచిపెట్టాక అక్కడి పరిస్థితులు మెరుగుపడవచ్చని అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధమైన పరిస్థితులు తిరిగి కనిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి మళ్లీ హింస చెలరేగింది.
రాజధాని ఢాకాలోని సచివాలయం దగ్గర గుమిగూడిన విద్యార్థులకు, అన్సార్ సభ్యులు(ఒక వర్గానికి చెందిన బృందం)మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపధ్యంలో చెలరేగిన ఘర్షణల్లో 40 మందికి పైగా జనం గాయపడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. దీనికి ముందు ఢాకా యూనివర్సిటీలోని హాస్టళ్ల నుంచి విద్యార్థులు బయటకు వచ్చి సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇంతలో అక్కడికి అన్సార్ గ్రూప్ సభ్యులు వచ్చారు.
ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం విద్యార్థుల ఉద్యమ సమన్వయకర్త నహిద్ ఇస్లాంను అరెస్టు చేశారని , బంగ్లాదేశ్ అవామీ లీగ్ నేత అబుల్ హస్నత్ అబ్దుల్లాను కూడా గృహ నిర్బంధంలో ఉంచారని తెలియగానే విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో హస్నత్ అబ్దుల్లా ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ షేర్ చేశారు. తన నిర్బంధానికి మాజీ అన్సార్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఏకేఎం అమీనుల్ హక్ బాధ్యత వహించాలని ఆయన దానిలో డిమండ్ చేశారు. ఢాకా యూనివర్శిటీలో విద్యార్థులు దీనిని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో మరోమారు అల్లర్లు చోటుచేసుకున్నాయని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment