
బంగ్లాదేశ్‌లో నూతనప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా హింస కొనసాగుతోంది. ఆందోళనకారులు మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్‌లో ఉంటున్న పలు హిందూ కుటుంబాలకు చెందినవారు తమ ఇళ్లను వదిలి భారతదేశానికి తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజాగా బంగ్లాదేశ్‌లో ఉంటున్న వెయ్యిమంది హిందూ కుటుంబాలకు చెందినవారు బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లోని రిజర్వాయర్‌లో నిలబడి తమను భారతదేశంలోకి అనుమతించాలని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్)ను అభ్యర్థిస్తున్నారు. వారిలోని కొందరు 'జై శ్రీరామ్', 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. సరిహద్దులోని జీరో పాయింట్‌కు 150 గజాల దూరంలో ఉన్న కంచెను దాటకుండా బీఎస్‌ఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.
బారత్ - బంగ్లదేశ్ సరిహద్దుపై నిఘా సారించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సరిహద్దు భద్రతా దళం తూర్పు కమాండ్ ఏడీజీని ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించారు. దీనికిముందు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళం నిఘాను మరింతగా పెంచింది. బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment