govenment
-
బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. 40 మందికి గాయాలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశం విడిచిపెట్టాక అక్కడి పరిస్థితులు మెరుగుపడవచ్చని అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధమైన పరిస్థితులు తిరిగి కనిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి మళ్లీ హింస చెలరేగింది.రాజధాని ఢాకాలోని సచివాలయం దగ్గర గుమిగూడిన విద్యార్థులకు, అన్సార్ సభ్యులు(ఒక వర్గానికి చెందిన బృందం)మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపధ్యంలో చెలరేగిన ఘర్షణల్లో 40 మందికి పైగా జనం గాయపడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. దీనికి ముందు ఢాకా యూనివర్సిటీలోని హాస్టళ్ల నుంచి విద్యార్థులు బయటకు వచ్చి సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇంతలో అక్కడికి అన్సార్ గ్రూప్ సభ్యులు వచ్చారు.ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం విద్యార్థుల ఉద్యమ సమన్వయకర్త నహిద్ ఇస్లాంను అరెస్టు చేశారని , బంగ్లాదేశ్ అవామీ లీగ్ నేత అబుల్ హస్నత్ అబ్దుల్లాను కూడా గృహ నిర్బంధంలో ఉంచారని తెలియగానే విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో హస్నత్ అబ్దుల్లా ఫేస్బుక్లో ఒక పోస్ట్ షేర్ చేశారు. తన నిర్బంధానికి మాజీ అన్సార్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఏకేఎం అమీనుల్ హక్ బాధ్యత వహించాలని ఆయన దానిలో డిమండ్ చేశారు. ఢాకా యూనివర్శిటీలో విద్యార్థులు దీనిని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో మరోమారు అల్లర్లు చోటుచేసుకున్నాయని పోలీసులు భావిస్తున్నారు. -
లేటుగా వస్తే.. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక
ఢిల్లీ: కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి అనుగుణమైన ఆదేశాలు ఇప్పటికే ఉన్నతాధికారులకు అందాయి. కొందరు ఉద్యోగులు బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్)లో హాజరు నమోదు చేయకపోవడం, మరికొందరు ఉద్యోగులు నిత్యం ఆఫీసుకు ఆలస్యంగా రావడం జరుగుతోంది. దీనిపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వ ఈ విధమైన ఆదేశాలు జారీచేసింది.సిబ్బంది మంత్రిత్వ శాఖ తాజాగా మొబైల్ ఫోన్ ఆధారిత ప్రమాణీకరణ వ్యవస్థను ఉపయోగించాలని ఉన్నతాధికారులకు సూచించింది. ఏఈబీఏఎస్ అమలు తీరును సమీక్షించిన ప్రభుత్వానికి దీని అమలులో అలసత్వం కనిపించింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న మంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ విభాగాల సిబ్బంది హాజరు నివేదికలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని నిర్ణయించింది. కొందరు ఉద్యోగులకు కార్యాలయానికి ఆలస్యంగా రావడం, త్వరగా బయలుదేరడం అలవాటుగా మారిందని, దీనిని నియంత్రించాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను కోరింది.ఈ నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అప్పుడే ఏఈబీఏఎస్‌లో రిజిస్టర్డ్, యాక్టివ్ ఉద్యోగుల మధ్య ఎలాంటి తేడాలు ఉండవని ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సంబంధిత సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలను పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, డిఫాల్టర్లను గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయానికి సిబ్బంది ఎవరైనా ఆలస్యంగా వస్తే, దానిని హాఫ్-డే క్యాజువల్ లీవ్‌గా పరిగణించాలని సూచించింది. నెలలో ఒకటి లేదా రెండుసార్లు, న్యాయమైన కారణాలతో ఆలస్యంగా కార్యాలయానికి ఎవరైనా సిబ్బంది వస్తే అధికారులు వారిపై చర్యలు తీసుకోవలసిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. -
మహారాష్ట్రలో గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచుతాం
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రతో పాటు యావత్ భారతదేశంలో వెనుకబాటుతనం కనిపిస్తోందని రైతులు, పేదల ప్రగతి లక్ష్యంగా రైతు ప్రభుత్వం ఏర్పడాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. అబ్ కీ బార్ సర్కార్ నినాదంతో రైతు ప్రభుత్వం ఏర్పాటు మినహా తమకు వేరే కోరికలేవీ లేవన్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్‌లు సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన నేతలకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్రలో 48, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు కలుపుకుని మొత్తం 65 సీట్లలో బీఆర్ఎస్ విజయం సాధిస్తే కేంద్రం మెడలు వంచలేమా అని కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి ఉండదని, ఈ రకంగా దేశానికి నేతృత్వం వహించే అవకాశం మహారాష్ట్రకు దక్కుతుందన్నారు. అంబానీ, ఆదానికి అప్పగించి.. దేశంలో నిల్వ ఉన్న 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలతో 150 ఏళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నా ఆ్రస్టేలియా, ఇండోనేషియా నుంచి కొనుగోలు ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు. అంబానీ, ఆదానీకి అప్పగించి విద్యుత్ బిల్లులు పెంచేందుకు కేంద్రం వింత చేష్టలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను మహారాష్ట్ర నుంచి 20వేల మంది స్వయంగా చూసివెళ్లారని చెప్పారు. దేశంలో నెలకొన్న సమస్యలను తొలగించడానికి కొత్త పార్టీ అవసరముందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే మహారాష్ట్రలో రెండు మూడేళ్లలో వెలుగు జిలుగులు వస్తాయన్నారు. త్వరలో బుల్డానా జిల్లా నుంచి 100 శాతం మంది సర్పంచులు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్రలో లభిస్తున్న ఆదరణను చూస్తుంటే వందకు వంద శాతం మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభు త్వం ఏర్పడుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీష్, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన చైర్మన్ వేణుగోపాలచారి, మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇంచార్జి వంశీధర్ రావు, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, సోలాపూర్ నేత నగేష్ పాల్గొన్నారు. బీఆర్ఎస్కు తోకముడిచి కోతలు ఎత్తేశారు మహారాష్ట్రలో బీఆర్ఎస్ కాలు పెట్టడంతో తోక ముడిచి విద్యుత్ కోతలు ఎత్తేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ మోడల్ అమలు చేయాలని సూచించిన కేంద్రేకర్ అనే ఐఎఎస్ అధికారిని సీఎం, మంత్రులు బెదిరించి రాజీనామా చేయించారని ఆరోపించారు. అక్కడ తెలంగాణ మోడల్ అమలుకు రూ.49వేల కోట్లు మాత్రమే అవసరమవుతాయని, సంపద కలిగిన ఆ రాష్ట్రంలో ఆదాయం ఏమవుతోందని ప్రశ్నించారు. ఇప్పటివరకు మహారాష్ట్రను పాలించిన కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్సీపీ సమస్యలను ఎందుకు దూరం చేయలేకపోయాయని నిలదీశారు. సాగునీరు లేక మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, మహారాష్ట్రలో ఇప్పటికే 70వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, మరో లక్ష మంది అదే బాటలో ఉన్నట్లుగా తనకు తెలిసిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఏపీలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ళు పూర్తి
-
పాకిస్తాన్లో సంచలనం.. ఇమ్రాన్‌కు ఊహించని షాక్!
-
సర్వశ్రేయో నిధితో ఆలయాల అభివృద్ధి
విజయనగరం టౌన్: జీర్ణోద్ధరణకు గురైన ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. సర్వశ్రేయోనిధి (సీజీఎఫ్, కామన్ గ్రాంట్ ఫండ్) కింద జిల్లాకు రూ.20 కోట్లు కేటాయించింది. జిల్లాలోని 44 ఆలయాల అభివృద్ధి పనులను చేపట్టింది. పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయాలు కొత్తశోభను సంతరించుకుంటుండడంతో భక్తులు సంతోషపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై అర్చకులు, ఆయా ఆలయాల అధికారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 461 ఆలయాలు ఉన్నాయి. ఇందులో రూ.25 లక్షలకు పైబడి వార్షిక ఆదాయం వస్తున్న 6 (ఎ) కేటగిరీకి చెందిన ఆలయాలు 6 వరకూ ఉన్నాయి. రూ.2లక్షలు పైబడి వార్షిక ఆదాయం వస్తున్న 6 (బి) కేటగిరీకి చెందిన ఆలయాలు 15 వరకూ ఉన్నాయి. వీటితో పాటు 6(సి) కేటగిరీలో రెండు లక్షల రూపాయలలోపు ఆదాయం ఉన్న ఆలయాలు 30 వరకూ ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా ఆలయాలకు ఎటువంటి ఆదాయం లేదు. వీటిలో అధిక ఆలయాలు జీర్ణోద్ధరణకు గురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సర్వ శ్రేయోనిధి కింద రూ. 20 కోట్లు కేటాయించడంతో జిల్లాలో 44 ఆలయాలు అభివృద్ధికి నోచుకుంటున్నాయి. ఇటీవల కాలంలో రామతీర్థం బోడికొండపైన నూతనంగా నిర్మాణమైన ఆలయమే దీనికి నిదర్శనం. దాంతో పాటు రామతీర్థం ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం విశేషం. విజయనగరం డివిజన్ పరిధిలో ఇప్పిలి వీధి శ్రీరామమందిరానికి రూ. 20 లక్షలు, నాగవంశపు వీధి రామమందిరానికి రూ.50 లక్షలు, మండపం వీధి సంపత్ వినాయకస్వామి ఆలయానికి రూ.75 లక్షలు, కొత్తపేట రామమందిరానికి రూ.50 లక్షలు, గాయత్రీనగర్ వెంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.40 లక్షలు, బోయవీధి రామమందిరానికి రూ.20 లక్షలు, పల్లివీధి కోదండరామాలయానికి రూ.40 లక్షలు, మండపం వీధి జగన్నాథస్వామి పురాణకాలక్షేప మండపానికి రూ. 80లక్షలను ప్రభుత్వం కేటాయించింది. వీటితో పాటు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి రూ.50 లక్షలు కేటాయింపులు జరిగాయి. చీపురుపల్లి డివిజన్ పరిధిలో నిమ్మలవలస గ్రామం శ్రీరామమందిరానికి రూ.30 లక్షలు, గరివిడి మండలం ఆర్తమూరు కోదండరామాలయానికి రూ.40 లక్షలు, మెరకముడిదాం పులిగుమ్మి రామాలయానికి రూ. 30 లక్షలు, చీపురుపల్లి కనకమహాలక్ష్మి ఆలయానికి రూ.15 లక్షలు, గరివిడి నీలాద్రిపురం రామాలయానికి రూ.25 లక్షలు, రామతీర్థం శ్రీరామస్వామి దేవస్థానానికి కోటి రూపాయలు, బోడికొండపై కోదండరామ ఆలయ నిర్మాణానికి రూ. 3 కోట్లు కేటాయించింది. పోలిపల్లి గ్రామం పైడితల్లి ఆలయానికి రూ. 50 లక్షలు, భోగాపురం మండలం నందిగాం రామలింగేశ్వరస్వామి ఆలయానికి రూ.50 లక్షలు, చీపురుపల్లి మండలం పత్తికాయలవలసలో ఉన్న శ్రీరామమందిరానికి రూ.16 లక్షలు, చీపురుపల్లి మండలం పర్లలో ఉన్న శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, మెంటాడలో ఉన్న సీతారామఆలయానికి రూ. 25లక్షలు మంజూరు చేసింది. ఎస్.కోట డివిజన్ పరిధిలో కొత్తవలస గులివిందాడ శ్రీరామలయానికి రూ.40 లక్షలు, ఎల్.కోట జమ్మాదేవిపేట రామాలయానికి రూ. 44 లక్షలు, గంట్యాడ పెదవేమలి శ్రీరామాలయానికి రూ.16 లక్షలు, వేపాడ రామయ్యపేట రాములవారు, బంగారమ్మ తల్లి ఆలయానికి రూ.20 లక్షలు, గంట్యాడ కొర్లాం శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, జామి శ్రీరామాలయానికి రూ.50 లక్షలు ఎల్.కోటకొత్తపాలం మల్లివీడు పంచాయతీ శ్రీరామాలయానికి రూ.30 లక్షలను కేటాయించింది. ఎల్.కోట రాగరాయిపురం భూలోకమాత ఆలయానికి రూ.30 లక్షలు, వేపాడ వల్లంపూడి సీతారామస్వామి ఆలయానికి రూ.50 లక్షలు, కొత్తవలస గనిశెట్టిపాలెం శ్రీరామాలయానికి రూ.19లక్షల 30వేలు, ఎస్.కోట గవరపాలెం శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, ఎస్.కోట పుణ్యగిరి ధారగంగమ్మ, శివాలయానికి రూ.30 లక్షలు కేటాయింపులు జరిపింది. బొబ్బిలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని గరుగుబిల్లి తోటపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.83 లక్షలు, సాలూరు వడ్డివీధి రామాలయానికి రూ. 13 లక్షలు, సీతానగరం కాసాపేట శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, సీతానగరం నిడగల్లు శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి రూ. 50 లక్షలు, కొమరాడ దేవునిగుంప సోమేశ్వరస్వామి ఆలయానికి రూ. 50 లక్షలు, బొబ్బిలి కారడ గ్రామంలో ఉన్న ఉమారామలింగేశ్వరస్వామి ఆలయానికి రూ.40 లక్షలు, పార్వతీపురం పిట్టలవలస నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి రూ. 25 లక్షలు, మక్కువ డి.సిర్లం సంగమేశ్వరస్వామి ఆలయానికి రూ. 49 లక్షలు, గరివిడి నీలాద్రిపురం శ్రీరామాలయానికి రూ. 25 లక్షలు, బాడంగి మండలం ముగడలో ఉన్న శ్రీరామమందిరానికి రూ. 12 లక్షలు, రేజేరులోని శ్రీరామమందిరానికి రూ. 12 లక్షలు కేటాయించింది. కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తికాగా, మరికొన్ని చోట్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయాల పునర్నిర్మాణంతో ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. శరవేగంగా పునరుద్ధరణ పనులు ప్రభుత్వం సర్వశ్రేయోనిధి కింద మంజూరు చేసిన నిధులతో ఆలయాలు పునరుద్ధరణ పనులు చేపట్టాం. ప్రస్తుతం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. రామతీర్థంలోని బోడికొండపై కోదండరామస్వామి ఆలయ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కొండకింద రామస్వామి ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు దేవాలయాల పునరుద్ధరణ, కొత్తదేవాలయాల నిర్మాణ పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను కేటాయించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికోసం జిల్లా నుంచి 54 దరఖాస్తులు అందాయి. – జె.వినోద్‌కుమార్, దేవదాయశాఖ సహాయకమిషనర్, విజయనగరం (చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం) -
తాలిబన్లకు అధికారం అప్పగించేందుకు సిద్ధమైన ప్రభుత్వం
-
నాలుగేళ్లలో ఈ రంగంలో రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్ పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) సామర్థ్యం వచ్చే ఏడాది మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) మరో 11 గిగావాట్లు (జీడబ్ల్యూ) పెరిగే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ సంస్థ ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. మాడ్యూల్ ధరల పెరుగుదల వల్ల సోలార్ బిడ్ టారిఫ్‌లు పెరిగినప్పటికీ, ఈ రంగం పురోగమిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ‘‘2019–20 ఆర్థిక సంవత్సరంలో పునరుత్పాదక ఇంధన రంగం అదనపు సామర్థ్యం 8.7 గిగావాట్లు పెరిగింది. అయితే కోవిడ్ మహమ్మారి ప్రేరిత సవాళ్ల పరిస్థితుల్లో 2020–21 ఆర్థిక సంవత్సరం ఈ వేగం మందగించి పురోగతి 7.4 జీడబ్ల్యూకు పడిపోయింది. కాగా, 2021–22లో తిరిగి ఈ విభాగం 10.5 నుంచి 11 జీడబ్ల్యూ వరకూ అదనపు సామర్థ్యాన్ని సాధించే అవకాశం ఉంది’’ అని ఇక్రా విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. ఈ రంగంలో 38 గిగావాట్ల పటిష్ట ప్రాజెక్ట్ పైప్‌లైన్ అమలు జరుగుతున్న విషయాన్నీ ఇక్రా గుర్తు చేసింది. అలాగే మరో 20 గిగావాట్ల ప్రాజెక్టులు వివిధ నోడెల్ ఏజెన్సీల నుంచి టెండరింగ్ దశలో ఉండడాన్ని ప్రస్తావించింది. ఆయా అంశాలన్నీ ఈ రంగాన్ని సమీప కాలంలో పటిష్టం చేస్తాయని విశ్లేషించింది. ఈ విభాగానికి సంబంధించి ఇక్రా నివేదిక తదితర అంశాలను పరిశీలిస్తే.. ► భారత్ ప్రస్తుత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 136 గిగావాట్లు. 2022 నాటికి దాదాపు 180 గిగావాట్లకు పెంచాలన్నది కేంద్రం లక్ష్యం. 2030 నాటికి ఈ లక్ష్యం 450 గిగావాట్లగా ఉంది. దీన్ని సాధిస్తే మొత్తం విద్యుత్‌లో పునరుత్పాదక ఇంధన విద్యుత్ వాటా 54 శాతానికి చేరుకుంటుంది. ► వచ్చే నాలుగేళ్లలో ఈ రంగంలోకి రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నది అంచనా. ► భారత్ మొత్తం విద్యుత్ వ్యవస్థీకృత సామర్థ్యంలో పోల్చితే 2021 మార్చి నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్య 25 శాతం అయితే 2025 మార్చి నాటికి ఇది 34 శాతానికి చేరుతుందని అంచనా. ► అయితే ఈ రంగంలో సవాళ్లు కూడా ఉన్నాయి. విద్యుత్ కొనుగోలు, అమ్మకం ఒప్పందాలపై (పీపీఏలు పీఎస్ఏలు) సంతకాల్లో ఆలస్యం అయిన సందర్భాలు గతంలో ఉన్నాయి. టారిఫ్‌లు తగ్గుతాయన్న అంచనాలతో బిడ్స్ రద్దయిన నేపథ్యమూ ఉంది. ఈ తరహా అంశాలు ఇకముందూ సవాలుగా కొనసాగే అవకాశం ఉంది. ► నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు భూ సేకరణ, మౌలిక సదుపాయాల పెంపు వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి పవన విద్యుత్ విషయంలో ఈ తరహా ఇబ్బందులు కొనసాగే వీలుంది. ► డిస్కమ్‌ల నుంచి పునరుత్పాదక ఇంధన స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులకు (ఐపీపీ) బకాయిల విలువ 2021 ఏప్రిల్ నాటికి రూ.11,840 కోట్లని పీఆర్ఏఏపీటీఐ పోర్టల్ పేర్కొంటోంది. ► ఈ రంగానికి ఇక్రా ‘సేబుల్’ అవుట్‌లుక్ కొనసాగుతుంది. ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న విధానపరమైన మద్దతు, భారీ వృద్ధి అవకాశాలు, సెంట్రల్ నోడల్ ఏజెన్సీలకు సంబంధించి రుణ సామర్థ్యాలు, చార్జీల విషయంలో పోటీతత్వం వంటి అంశాలు దీనికి కారణం. సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీకి కూడా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని వర్తింపచేయడం ఈ రంగానికి సానుకూల అంశం. ► దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడం, దేశీయ తయారీకి ప్రాధాన్యత ఇవ్వడం ప్రధాన లక్ష్యాలుగా సోలార్ మాడ్యూల్స్, సెల్స్ విషయంలో కేంద్ర నూతన, పునరుత్పదక ఇంధన మంత్రిత్వశాఖ ఇటీవల కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచీ సోలార్ మాడ్యూల్స్ దిగుమతులపై 40 శాతం బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని (బీసీడీ) విధించనున్నట్లు ప్రకటించింది. అలాగే సెల్స్ విషయంలో ఈ సుంకం 20 శాతంగా ఉండనుంది. 2022 మార్చి 31 వరకూ సోలార్ మాడ్యూల్స్ అలాగే సెల్స్‌పై ‘జీరో’ బీసీడీ అమలవుతుంది. విద్యుత్‌కు డిమాండ్ అనూహ్యం దేశంలో విద్యుత్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. బుధవారం గరిష్ట డిమాండ్ (ఒక్క రోజులో అత్యధిక సరఫరా) 200.57 గిగావాట్ల మార్క్‌ను అధిగమించి జీవితకాల గరిష్టానికి చేరి నట్టు కేంద్ర విద్యుత్ శాఖ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. వర్షాలు ఆలస్యం కావడం వల్ల దేశం లోని చాలా రాష్ట్రాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం నెలకొనడంతోపాటు.. కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన ఆంక్షలను సడలిస్తుండడంతో విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన మంగళవారం విద్యుత్ డిమాండ్ 197.07 గిగావాట్లుగా నమోదైంది. గత నెలలో (జూన్ 30న) విద్యుత్‌కు రోజువారీ గరిష్ట డిమాండ్ 191.51 గిగావాట్లుగా నమోదు కావడం గమనార్హం. 2020 జూన్‌లో డిమాండ్ 164.98 గిగావాట్లుగా ఉంటే, 2019 జూన్ నెలలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 182.45 గిగావాట్లుగా నమోదు కావడం గమనార్హం. -
కఠిన చర్యలు తీసుకుంటే థర్డ్ వేవ్ రాకపోవచ్చు: విజయరాఘవన్
సాక్షి, న్యూఢిల్లీ: రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని , థర్డ్ వేవ్‌ను తప్పదంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర ప్రభుత్వ అత్యున్నత శాస్త్రీయ సలహాదారు డాక్టర్ కే విజయరాఘవన్ వెనక్కి తగ్గారు.. అవసరమైన చర్యలు తీసుకుంటే కరోనావైరస్ మూడో దశను ఓడించలగమంటూ తాజాగా చెప్పుకొచ్చారు. వైరస్ థర్డ్ వేవ్ ఎపుడు ఎలా వస్తుందో తెలియదు కానీ రావడం మాత్రం ఖాయమని ప్రకటించిన రెండు రోజుల తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కఠిన చర్యలు తీసుకుంటే, మూడో వేవ్ అన్ని ప్రదేశాలలోనూ రాకపోవచ్చు. అసలు ఎక్కడా రాకపోవచ్చన్నారు. స్థానిక స్థాయిలో ఆయా రాష్ట్రాలలో, జిల్లాల్లో, ప్రతిచోటా ఎంత బాగా ఆంక్షలను, మార్గదర్శకాలను అమలు చేస్తారనేదానిపై వైరస్ తీవ్రత ఆధారపడి ఉంటుందని విజయరాఘవన్ చెప్పుకొచ్చారు. దేశంలో రెండో దశలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. సగం కేసులు లెక్కల్లోకి రావడం లేదని విమర్శలున్నప్పటికీ, రోజుకు 4లక్షల కేసులకు తగ్గడం లేదు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కుప్పకూలిపోతోంది. ఆసుపత్రుల్లో బెడ్స్‌దొరకక, ఆక్సిజన్, మందుల కొరతతో బాధితులకు దిక్కుతోచడం లేదు. చిరవకి చనిపోయిన తమ ఆత్మీయులను గౌరవంగా సాగనంపేందుకు శ్మశానవాటికలు కూడా ఖాళీ లేని పరిస్థితి. కాగా శుక్రవారంనాటి గణాంకాల ప్రకారం 4,14,188 రోజువారీ కేసులతో దేశం మరో రికార్డును నమోదు చేసింది. 3,915 మరణాలతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 2,34,083 కు చేరింది. అధికారిక లెక్కలతో పోలిస్తే ఇది ఐదు నుండి 10 రెట్లు ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీదారుగా చెప్పుకుంటున్న దేశం తగినంత టీకాల ఉత్పత్తి, పంపిణీకి అష్టకష్టాలు పడుతోంది. 15.7 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చామని, ప్రధాని మోదీ చెబుతున్నప్పటికీ టీకాల రేటు ఇటీవలి రోజుల్లో బాగా పడిపోవడం గమనార్హం. చదవండి : కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పారేయాల్సిందే! కరోనా థర్డ్ వేవ్ తప్పదు: సంచలన హెచ్చరికలు -
అవే.. ఆ తండ్రి చివరి మాటలు!
సాక్షి, గద్వాల: ‘20 నిమిషాల్లో వస్తా.. నువ్వు, తమ్ముడు, అమ్మ రెడీగా ఉండండి.. బయటకు వెళ్దాం’ అని ఆ తండ్రి తన కొడుకుతో ఫోన్లో మాట్లాడిన ఆ మూడు మాటలే.. కడసారి మాటలయ్యాయి. విధుల్లో భాగంగా వెళ్లిన ఆ ప్రభుత్వ ఉద్యోగి.. సాయంత్రం తిరిగి ఇంటికి బైక్‌పై వస్తున్న సమయంలో లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. ఇంటికి వస్తున్నా అని మాటిచ్చిన అతడు.. ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటనతో అప్పటి వరకు సంతోషాలతో నిండిన ఆ కుటుంబం ఒక్కసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఈ ఘటన గద్వాల మండలం అనంతపురం శివారులో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం మేరకు.. గద్వాల పట్టణానికి చెందిన విజయ్‌బాబు (39) విద్యుత్ లైన్మెన్గా ఇటిక్యాల మండలం కొండేరులో విధులు నిర్వహిస్తున్నాడు. రోజువారి విధుల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై ఉదయం విధులకు వెళ్లాడు. అయితే సాయంత్రం తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై గద్వాలకు బయల్దేరాడు. ఈక్రమంలో గద్వాల నుంచి ఎర్రవల్లి వైపు వెళ్తున్న లారీని డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను కొట్టాడు. ఈ ప్రమాదంలో విజయ్‌బాబు అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. దుఃఖసాగరంలో కుటుంబసభ్యులు 20నిమిషాల్లో ఇంటికి వస్తున్నానని చెప్పిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలియడంతో విజయ్‌బాబు భార్య పద్మ నిశ్చేష్టురాలైంది. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. విజయ్‌బాబు స్వగ్రామం ఇటిక్యాల మండలం పెద్దదిన్నె కాగా.. గత కొన్నేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి రెండవ రైల్వేగేటు బృందవన్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తొటి ఉద్యోగి మరణ వార్త తెలుసుకొని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానూభూతి తెలిపారు. సంఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాష్ట్రాల మీదికి ఎక్కుపెట్టిన త్రిశూలం
ఈనెల 3న కేంద్ర ప్రభుత్వం ఒకేరోజు మూడు ఆర్డినెన్సుల్ని ఆమోదించింది. రైతులకు మేలు చేసే, వ్యవసాయ రంగ రూపు మార్చే చారిత్రక ఆర్డినెన్సులుగా వీటిని పేర్కొన్నారు. మూడింట్లో ఒకటైన నిత్యావసర సరుకుల చట్టం సవరణ ఆర్డినెన్స్ అన్ని వ్యవసాయ సంబంధ ఉత్పత్తులను నిత్యావసర సరుకుల జాబితా నుంచి తొలగిస్తుంది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ఏ వ్యవసాయ ఉత్పత్తినైనా అత్యవసరమైనదిగా పేర్కొనే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం కలిగివుంటుంది. అయితే, వ్యవసాయరంగంలో పెట్టుబడిదారులను నిరుత్సాహపరచకుండా, ఎగుమతిదారుల నిల్వల పరిమితిని దీన్నుంచి మినహాయించినట్టు తెలిపింది. ఉత్పత్తి, నిల్వల, రవాణా, పంపిణీలపై స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగంలోకి ప్రైవేటు రంగాన్నీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులనూ పెద్దస్థాయిలో ఆకర్షించవచ్చనీ; భావిస్తోంది ప్రభుత్వం. ఈ ఎస్మా ఆర్డినెన్స్ వల్ల ధరలు స్థిరీకరించబడి, వ్యాపారులు, వినియోగదారులకు మేలు కలుగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఇది ప్రాథమికంగా వ్యాపారులకు మేలు చేసేదే. ఇక రెండవదైన, వ్యవసాయ రంగ ఉత్పత్తుల అమ్మకం, వాణిజ్యం ఆర్డినెన్స్ రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ చట్టాలు సూచించిన భౌతిక ఆవరణల బయట రాష్ట్ర అంతర్గత, అంతర్రాష్ట్ర వాణిజ్యంలో ఉన్న ఆటంకాలను తొలగించడానికి ఉద్దేశించినది. దేశంలో విస్తారంగా క్రమబద్ధీకరించిన వ్యవసాయ మార్కెట్లను తెరిచే దిశగా ఇదొక చారిత్రక అడుగుగా ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఇది ప్రాథమికంగా ‘మార్కెట్ ఆవరణల’ బయట వాణిజ్య అవకాశాలను సృష్టించడానికి ఉద్దేశించినది. ఇక మూడోది, ‘ద ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ ఆర్డినెన్స్, 2020’. ఇది రైతులతో ఒప్పందాలు చేసుకునే ఏ థర్డ్ పార్టీకైనా ఒక జాతీయ ఫ్రేమ్‌వర్క్ సమకూర్చడం కోసం ఉద్దేశించింది. అంటే, కాంట్రాక్టు వ్యవసాయానికి చట్టబద్ధతను కల్పించడం. ఈ మూడు ఆర్డినెన్సులూ రైతులకు లబ్ధి చేకూర్చేవిగా ప్రభుత్వం చిత్రిస్తున్నప్పటికీ, ఇందులో ఏ ఒక్కటి కూడా రైతులకు మేలు చేయదు. ఇవి వ్యాపారులకు, ప్రత్యేకించి పెద్ద కంపెనీలకు లబ్ధి కలిగిస్తాయి. ఉమ్మడిగా ఈ మూడు అత్యవసరాదేశాలు రాష్ట్ర చట్టాల్నీ, మార్కెట్ కమిటీల్నీ కాదని రాష్ట్రాల అధికారాల్ని బలవంతంగా లాక్కునే లక్ష్యంతో తెచ్చినవి. ప్రణాళిక, నిధుల కేటాయింపు, అమలు తదితరాల్లో కేంద్ర ప్రభుత్వం భాగమైనప్పటికీ వ్యవసాయం ముఖ్యంగా రాష్ట్రాల పరిధిలోని అంశం. దీర్ఘకాలంగా వ్యవసాయ ఉత్పాదక కంపెనీలు, ముఖ్యంగా విత్తనాలు, రసాయన ఎరువుల కంపెనీలు వ్యవసాయ సంబంధ నిర్ణయాల్లో కేంద్రీకరణ ఉండటం తమకు లాభిస్తుందనే యోచనతో ఉన్నాయి. గత కొన్ని యేళ్లుగా మోడల్ చట్టాల ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ వాణిజ్యంలో సంస్కరణల కోసం పట్టుబడుతోంది. ఈ శాసనాలతో పాటు ఇంకా ఇతరత్రా అన్ని కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీలను, ప్రాంత గుత్తాధిపత్యాలను నీరుగార్చడానికి ఉద్దేశించినవి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత విధానం ‘మార్చి’, ఈ ‘నమూనా’ విధానంలోకి మారడానికి మొగ్గుచూపవు. ఎందుకంటే వాటికి ఆదాయం సమకూర్చే ఆధారంలో కోతపడుతుంది. ఈ త్రిశక్తి ఆర్డినెన్సులు– వ్యవసాయ ఉత్పత్తులు, వాటి మార్కెట్ల మీద రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణనూ సంపూర్ణంగా తొలగించాలని ఆశిస్తున్నాయి. అత్యవసర ఉత్పత్తి అనే ట్యాగ్ తొలగించినప్పటకీ, రాష్ట్రాల మార్కెటింగ్ కమిటీ చట్టాల వల్ల వ్యాపారులు ఇప్పటికీ ఆటంకాలు ఎదుర్కోవచ్చు. అందుకోసమని రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండబోదని వ్యాపారులు, వ్యవసాయ కంపెనీలకు కేంద్రం విశ్వాసం కలిగించవచ్చు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయం నష్టపోతాయి. వ్యవసాయ ఉత్పత్తుల మీద వాటి ఆధిపత్యం తగ్గిపోతుంది. ఒక్కమాటలో, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడానికి ఏ మాత్రమూ వీలు లేకుండా చేయడంలో ఈ మూడు అత్యవసర ఆదేశాలు విజయం సాధిస్తాయి. కానీ, వినియోగదారులు(ఈ దేశానికి సంబంధించిన అందరు పౌరులు) ధరలు పెరగడాన్ని చూడాల్సిరావొచ్చు. ‘స్వేచ్ఛా వాతావరణం’లో వ్యవసాయ దిగుమతులు పెరగవచ్చు. ఈ దిగుమతులతో ఉత్పన్నమయ్యే పోటీలో, రైతులు నష్టపోవచ్చు.రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అధికారంలో ఉన్న సందర్భంలో ఇది ఇక అధికార క్రీడ అవనుంది. బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. కానీ ఒకటి, ఈ అధికార పోరులో రైతులకు స్థానం లేదు. రైతులు ఎప్పుడూ పరిగణనలో లేరు, ఉండరు. కేంద్రం ఇప్పటికైతే ఈ త్రిశూల్ ద్వారా వ్యాపారులు, పెట్టుబడిదారులు, కంపెనీలు, అమ్మకందారులు అందరికీ సహకరించాలని నిర్ణయించుకుంది. ఇండియాను పారిశ్రామిక వ్యవసాయంలోకి నడిపించాలనుకునే ఈ శక్తిమంతమైన లాబీకి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తలొగ్గుతాయా? బహుశా అవునా కాదా అన్నదానికంటే ఎప్పుడు, ఎలా అనేదే విషయం కావొచ్చు. నరసింహారెడ్డి దొంతి – వ్యాసకర్త ఆర్థిక రంగ విశ్లేషకులు ఫోన్ : 0091–40–24077804 -
ఏజీఆర్ : మొత్తం బకాయిలు చెల్లించమని ఆదేశించాం
సాక్షి, న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిల చెల్లింపు విషయంలో మరోసారి కేంద్రం టెల్కోలకు ఆల్టిమేటం జారీ చేసింది. ఏజీఆర్ బకాయిలకు సంబంధించిన ఇప్పటివరకు టెలికాం ఆపరేటర్ల నుండి సుమారు రూ .25,900 కోట్లను ప్రభుత్వం అందుకుందనీ, త్వరలోనే పూర్తి చెల్లింపులు చేయమని టెల్కోలను మళ్లీ ఆదేశించామని పార్లమెంటుకు అందించిన సమాచారంలో కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే వెల్లడించారు. అక్టోబర్ 24, 2019 నాటి బుధవారం లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో అక్టోబర్ 24, 2019 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కొన్ని చెల్లింపులు చేశాయని తెలిపారు. మార్చి 4, 2020 రాసిన లేఖలో పూర్తి చెల్లింపులు చేయాలని ఆపరేటర్లను ఆదేశించామన్నారు. అలాగే టెలికాం రంగంలో గుత్తాధిపత్యం లేదా కార్టలైజేషన్‌ను నివారించడానికి కొత్త యాంట్రీ ట్రస్ట్ లాను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని మరో ప్రశ్నకుసమాధానంగా వెల్లడించారు. భారతి ఎయిర్టెల్ ఇప్పటివరకు రూ .18,004 కోట్లు, వోడాఫోన్ ఐడియా రూ .3500 కోట్లు చెల్లించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. టాటా టెలిసర్వీసెస్ సుమారు రూ.4,197 కోట్లు చెల్లించగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.3.9 కోట్లు , రిలయన్స్ జియో సుమారు రూ .195 కోట్లు చెల్లించిందన్నారు. టెలికాం రంగంలో ఆర్థిక ఇబ్బందులపై జోక్యం చేసుకోవాలన్న సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఓఏఐ) అభ్యర్థన మేరకు టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మారటోరియం విధించామన్నారు. 2020–21, 2021–22 సంవత్సరాల్లో జరపాల్సిన చెల్లింపులకు ఇది వర్తిస్తుందన్నారు. ఏజీఆర్ వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెల్కోలు..దాదాపు 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న సంగతి తెలిసిందే. -
ట్రిపుల్ తలాక్‌పై రాద్ధాంతం వద్దు: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ట్రిపుల్ తలాక్ పేరుతో ముస్లిం మహిళలను తప్పుదారి పట్టించొద్దని, దేశంలోని ముస్లిం మహిళలు తమ భర్తలు, పిల్లలతో సంతోషంగా ఉన్నారన్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ డివిజన్లోని ఏజీ కాలనీలో శనివారం రాత్రి ఆలిండియా పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో జల్సా సమావేశాన్ని నిర్వహించారు. అసదుద్దీన్ మాట్లాడుతూ ముస్లింలపై ప్రభుత్వాలు, న్యాయస్థానాలు కక్షసాధింపు చర్యలు తీసుకుంటున్నాయని ఆరోపించారు. వివాహ చట్టంలో ముస్లింలకు, హిందువులకు వేర్వేరుగా శిక్షలున్నాయన్నారు. ముస్లింల సమస్యలు, హక్కుల కోసం జల్సా సభలను నిర్వహిస్తున్నామని, ఈ నెల 11న దారుస్సలాంలో చివరి జల్సా సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ రాష్ట్ర కార్యదర్శి రహీముద్దీన్ అన్సారీ, సభ్యులు మునీరుద్దీన్, అక్తర్ జాఫర్‌పాషా, హుస్సేనీ, హఫీజ్, మౌలానా అక్సర్ తదితరులు పాల్గొన్నారు. -
జీపీఎఫ్ వడ్డీరేటు యథాతథం
సాక్షి, న్యూఢిల్లీ: జీపీఎఫ్ (ఉద్యోగుల భవిష్యనిధి)పై ఇచ్చే వడ్డీని యథాతధంగా కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జిపిఎఫ్) ఇతర సంబంధిత పథకాలకు 7.8 శాతం వడ్డీ రేటును చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ వడ్డీరేటు అక్టోబర్ 1నుంచి డి సెంబర్ 21, 2017 వరకు వర్తిస్తుందని పక్రటించింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే, రక్షణ బలగాల భవిష్య నిధిపై ఈ వడ్డీరేటు వర్తిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో,ఇతర భవిష్యనిధి పథకాలైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) చిన్న పొదుపు పథకాల వడ్డీరేటులో ఎలాంటి మార్పు చేయకుండా అక్టోబర్-డిసెంబరులో 7.8 శాతంగా ఉంచింది. -
ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
ఆదెమ్మదిబ్బ స్థలంపై బీజేపీ డిమాండ్ స్థల వారసులెవ్వరూ లేరు 50 ఏళ్లుగా పేదలు ఇక్కడే ఉంటున్నారు వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలి స్థలాన్ని పరిశీలించి పేదలతో మాట్లాడిన బీజేపీ బృందం తమకు న్యాయం చేయాలని బాధితుల విన్నపం ప్రభుత్వం తమకు ఇళ్లు కట్టించాలని వేడుకోలు ‘సాక్షి’ వరుస కథనాలతో కదలిక సాక్షి, రాజమహేంద్రవరం : గత 50 ఏళ్లుగా పేదలు నివశిస్తున్న ఆదెమ్మ దిబ్బ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని భార తీయ జనతా పార్టీ (బీజేపీ) డిమాండ్ చేసింది. సత్యవోలు పాపారావుకు చెందిన ఈ స్థలానికి ప్రస్తుతం వారసులెవ్వరూ లేరని, ఈ భూమి అక్రమణకు గురికాకుండా చూడాలని పేర్కొంది. నగర నడి బొడ్డున ఉన్న ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలని డిమాండ్ చేసింది. గురువారం బీజేపీ అర్బ¯ŒS జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు నేతృత్వంలోని బీజేపీ బృందం ఆదెమ్మదిబ్బ స్థలాన్ని పరిశీలించింది. అనంతరం అక్కడ ఉన్న పేదలతో మాట్లాడి వివరాలు సేకరించింది. తాము ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నామని, ఇప్పడు ఎవరో వచ్చి తాము ఈ స్థలం కొనుగోలు చేశామని చెబుతూ ఖాళీ చేయిస్తున్నారని బీజేపీ బృందం వద్ద వాపోయారు. తమలో కొంత మందికి రూ.50 వేల నుంచి రూ.70 వేలు ఇచ్చారని పేర్కొన్నారు. తమలో వాంబే గృహాలు ఉన్నవారు ముందుగా ఖాళీ చేయడంతో ఇతరులు కూడా ఖాళీ చేయాల్సి వచ్చిందన్నారు. తమ ఇళ్లకు డబ్బులు ఇచ్చిన వారే తొలగిస్తున్నారని పేర్కొన్నారు. అద్దెలు కట్టుకోలేక చాలా మంది ఇక్కడే చెట్ల కింద ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ స్థలానికి సంబంధించిన వారసులెవ్వరూ లేనప్పుడు మీరు ఎందుకు ఖాళీ చేయాల్సి వచ్చిందని’ బీజేపీ నేతలు బాధితులు ప్రశ్నించారు. నిజంగా ఇళ్లులేని వారు ఇక్కడే తిరిగి గుడిసెలు వేసుకోవాలని, మీకు తాము అండగా ఉంటామని బీజేపీ అర్బ¯ŒS జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు భరోసా ఇచ్చారు. మీతోపాటు నగర శివారులో ఉన్న పేదలతో ఇక్కడ గుడిసెలు వేయిస్తానని పేర్కొన్నారు. త్వరలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో మాట్లాడి అర్బ¯ŒS హౌసింగ్ పథకం కింద అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. అధికార పార్టీల చుట్టూ తిరుగుతున్నా... రెండు నెలల నుంచి ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఒక్కరూ పట్టించుకోలేదని పేదలు వాపోయారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ, ఎంపీ మురళీమోహ¯ŒSల చుట్టూ తిరిగి తమ గోడు వెళ్లబోసుకుంటే వారందరూ ’ ఆ స్థలం ఎవరో కొన్నారట కదా. ఖాళీ చేయక తప్పదు’ అని మాకు హితబోధ చేయడం ఆవేదన కలిగిస్తోందని వాపోయారు. స్థల వారసులెవరూ లేరు... స్థలాన్ని పరిశీలించిన అనంతరం బొమ్ముల దత్తు విలేకర్లతో మాట్లాడుతూ తమ పార్టీ కార్యాలయం కోసం ఈ భూమిని కొనుగోలు చేద్దామని కొన్నేళ్ల కిత్రం సత్యవోలు పాపారావు వద్దకు వెళితే అక్కడ పేదలు ఉంటున్నారంటూ చెప్పారని అన్నారు. ఈ స్థలంలో కుందుల కుటుంబానికి వాటా ఉందన్నారు. గతంలో వాంబే గృహాల కోసం జరిపిన స్థల సేకరణలో వివాదం నెలకొందని గుర్తు చేశారు. వాంబే గృహాలు కట్టగా మిగిలిన స్థలంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను నిర్మించాలన్న ప్రతిపాదన కూడా ఉందని తెలిపారు. 45వ డివిజ¯ŒS పరిధిలో ఆకుల సూర్యారావుకు చెందిన 2.5 ఎకరాల స్థలంలో పేదలు ఇళ్లు నిర్మించుకున్నారని, అలాగే 47వ డివిజ¯ŒS పరిధిలో ఎకరా స్థలంలో దొడ్డి శేషగిరి స్థలంలో కూడా పలువురు ఇళ్లు కట్టుకున్నారని పేర్కొన్నారు. అక్కడ నగరపాలక సంస్థ నీటి కుళాయిలు, సిమెంట్ రోడ్లు వేసిందని, ఇంటి పన్నులు కూడా కట్టించుకుంటోందని తెలిపారు. ఆదెమ్మ దిబ్బ స్థలంలో పేదలకు ప్రభుత్వమే పక్కా ఇల్లు కట్టించి, అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ బృందంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గరిమెళ్ల చిట్టిబాబు, 47వ డివిజ¯ŒS కార్పొరేట్ రేలంగి శ్రీదేవీ, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ యొనుముల రంగబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శులు అడబాల రామకృష్ణ, బూరా రామచంద్రరావు, 36, 37 డివిజన్ల అధ్యక్షులు తంగెళ్ల శ్రీనివాసరావు, గుత్తుల సుదర్శనరావు, మీడియా సెల్ ఇ¯ŒSచార్జ్ దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశ కార్యకర్తలకు ప్రభుత్వం అండ
రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ జ్యోతినగర్ :తెలంగాణ ప్రభుత్వం ఆశ కార్యకర్తలకు అండగా ఉంటుందని రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ సాయి సేవాసమితి ఆవరణలోని సామాజిక భవనంలో ఆశ సమ్మేళనం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేయర్ హాజరై మాట్లాడారు. ప్రతీ పనికి ఆశ కార్యకర్తల సేవలు అవసరమన్నారు. మదర్ థెరిసాలా సేవలు చేస్తున్న ఆశ∙కార్యకర్తలను ప్రభుత్వం విస్మరించదని పేర్కొన్నారు. అనంతరం ఆశ కార్యకర్తలకు రోల్‌ప్లే, ఉపన్యాసం, గ్రూప్ డిస్కర్షన్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, కార్పొరేటర్లు కొలిపాక సుజాత, నడిపెల్లి అభిశేక్రావు, క్లస్టర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ భిక్షపతి, డాక్టర్లు రాణి, తిరుపతి, సిస్టర్ భారతి, ఆశ∙కార్యకర్తలు పాల్గొన్నారు. విజేతలు వీరే.. హెల్త్ టాక్ పోటీలో అర్బన్‌లో ప్రథమ స్థానంలో యం.రాజేశ్వరి(విఠల్‌నగర్), ద్వితీయ స్థానంలో టి.రాజేశ్వరి(పరశురాంనగర్), తృతీయ స్థానంలో శ్రీమతి(భరత్‌నగర్), రూరల్‌లో ప్రథమ స్థానంలో ఆర్.మణెమ్మ(తక్కళ్లపల్లె), ద్వితీయ స్థానంలో మంజుల (లింగాపూర్), తృతీయ స్థానంలో వి.లక్ష్మి(పొట్యాల), రోల్‌ప్లే పోటీలో అర్బన్ ప్రథమ స్థానంలో కె.లక్ష్మి టీం, ద్వితీయ స్థానంలో నాగేశ్వరి బృందం, తృతీయ బహుమతి పుష్పలత గ్రూప్ గెలుచుకున్నాయి. రూరల్‌లో ప్రథమ స్థానంలో మంజుల, ద్వితీయ స్థానంలో ఆర్.మణెమ్మ, తృతీయ స్థానంలో వాణిశ్రీ జట్లు విజయం సాధించాయని నిర్వాహకులు వివరించారు. -
‘సమాచార’మేదీ?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వ విధి విధానాలను, ప్రణాళికల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి బహుముఖ మాధ్యమాల ద్వారా కృషి చేయాల్సిన జిల్లా సమాచార శాఖ సుప్తచేతనావస్థలో ఉంది. ప్రజల స్పందనను, అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకుంది. జిల్లా అధికారులకు, సమాచార శాఖ అధికారుల మధ్య సమన్వయం కొరవడటం ప్రజలకు శాపంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటే జిల్లా సమాచార శాఖ అధికారి పోస్టును అప్‌గ్రేడ్ చేశారు. ఏడీ స్థాయి అధికారికి బాధ్యత అప్పగించినా ప్రయోజనం లేకుండా పోయింది. జర్నలిస్టుల అక్రిడిటేషన్లు మ్యానిటరింగ్ చేయటం, ముఖ్యమంత్రి, మంత్రుల కార్యక్రమాలకు బస్సులు పెట్టేందుకు మాత్రమే సమాచార శాఖ పనిచేస్తోందనే ప్రచారం ఉంది. ప్రభుత్వం ఇటీవల అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వాటికి సంబంధించిన సమాచారం ఏదీ ఆ శాఖ వద్ద లేకపోవడం గమనార్హం. వివిధ శాఖలకు చెందిన అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారం, వాటిపై జరుగుతున్న సర్వేలు, క్షేత్రస్థాయిరివ్యూల వివరాలు కూడా ఆ శాఖ వద్ద లేవు. అయితేఉన్నతాధికారులు కూడా ఉద్దేశపూర్వకంగానే సమాచారశాఖను నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.దీనికి తోడు సమాచార శాఖ అధికారులు కూడా విషయాలన్నీ తెపిోవాలనే ఆసక్తి కనబరచకపోవడంఅధికారుల పనితీరును తెలియజేస్తోంది. జిల్లాకుచెందిన మంత్రి హరీష్‌రావు, ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి తరచూ జిల్లాలో పర్యటిస్తున్నారు. సమీక్షసమావేశాల్లో పాల్గొంటున్నారు.వీరి పర్యటన వివరాలు ఎలా లేదన్నా కనీసం 48గంటల ముందు ఖరారవుతుంది. కానీ ఆ విషయంమాత్రం సమాచార శాఖకు తెలియదు. తీరా సమావేశంజరుగుతున్నప్పుడో... మంత్రి బయలుదేరుతున్నప్పుడో తెలిసి హడావుడిగా మీడియాకు సమాచారంచేరవేస్తున్నారు.దీంతో మీడియా ప్రతినిధులు వార్తలను కవర్‌చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇదేవిషయాన్ని కొంతమంది మీడియా ప్రతినిధులుగతంలో ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ దృష్టికి తీసుకెళ్లగా... ప్రసార మాధ్యమాలకు సకాలంలో సమాచారం ఇవ్వకపోవడం కేవలం ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యమేనని అన్నారు. దానికి పూర్తి బాధ్యత వారిదేనన్నారు. ఇపికైనా ఆ శాఖ అధికారుల్లో చలనంవస్తుందని ఆశిద్దాం. -
సర్కారీ మందుబిళ్ల... నాణ్యత వట్టి డొల్ల!