- రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ
ఆశ కార్యకర్తలకు ప్రభుత్వం అండ
Published Thu, Jul 28 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
జ్యోతినగర్ :తెలంగాణ ప్రభుత్వం ఆశ కార్యకర్తలకు అండగా ఉంటుందని రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ సాయి సేవాసమితి ఆవరణలోని సామాజిక భవనంలో ఆశ సమ్మేళనం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేయర్ హాజరై మాట్లాడారు. ప్రతీ పనికి ఆశ కార్యకర్తల సేవలు అవసరమన్నారు. మదర్ థెరిసాలా సేవలు చేస్తున్న ఆశ∙కార్యకర్తలను ప్రభుత్వం విస్మరించదని పేర్కొన్నారు. అనంతరం ఆశ కార్యకర్తలకు రోల్‌ప్లే, ఉపన్యాసం, గ్రూప్ డిస్కర్షన్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, కార్పొరేటర్లు కొలిపాక సుజాత, నడిపెల్లి అభిశేక్‌రావు, క్లస్టర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ భిక్షపతి, డాక్టర్లు రాణి, తిరుపతి, సిస్టర్ భారతి, ఆశ∙కార్యకర్తలు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
హెల్త్ టాక్ పోటీలో అర్బన్‌లో ప్రథమ స్థానంలో యం.రాజేశ్వరి(విఠల్‌నగర్), ద్వితీయ స్థానంలో టి.రాజేశ్వరి(పరశురాంనగర్), తృతీయ స్థానంలో శ్రీమతి(భరత్‌నగర్), రూరల్‌లో ప్రథమ స్థానంలో ఆర్.మణెమ్మ(తక్కళ్లపల్లె), ద్వితీయ స్థానంలో మంజుల (లింగాపూర్), తృతీయ స్థానంలో వి.లక్ష్మి(పొట్యాల), రోల్‌ప్లే పోటీలో అర్బన్ ప్రథమ స్థానంలో కె.లక్ష్మి టీం, ద్వితీయ స్థానంలో నాగేశ్వరి బృందం, తృతీయ బహుమతి పుష్పలత గ్రూప్ గెలుచుకున్నాయి. రూరల్‌లో ప్రథమ స్థానంలో మంజుల, ద్వితీయ స్థానంలో ఆర్.మణెమ్మ, తృతీయ స్థానంలో వాణిశ్రీ జట్లు విజయం సాధించాయని నిర్వాహకులు వివరించారు.
Advertisement
Advertisement