ఔషధ తయారీ కంపెనీలు రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఏమాత్రం నాణ్యత లేని నాసిరకపు మందులను సర్కారీ ఆస్పత్రులకు అంటగడుతున్నాయి. అభాగ్య రోగులతో డొల్ల మందులను మింగిస్తున్నాయి. అవి వారి వ్యాధులను నయం చేయకపోగా కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. జరగాల్సిన అనర్థం జరిగిపోయిన ఆర్నెల్లకో, ఏడాదికో సదరు మందుల నాణ్యత పరీక్షల ఫలితాలు బయటికి వస్తున్నాయి. అవి నాసిరకపువని అప్పుడు నింపాదిగా తేలుతోంది. కొన్నేళ్లుగా ఇదే తంతు జరుగుతున్నా సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదు. కంపెనీల పేరాశ, ప్రభుత్వ అలసత్వం లక్షలాది మంది రోగుల ప్రాణాలను గాల్లో దీపంగా మార్చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వాసుపత్రులకు సుమారు 400 రకాల పైగా మందులు సరఫరా అవుతున్నాయి. వాటికి సకాలంలో నాణ్యతా పరీక్షలు జరిపి, అవి మంచివేనని తేలాకే సరఫరా చేయాలన్న కనీస కర్తవ్యాన్ని పాటించడం లేదు. ఏ మందు మింగితే ఎలాంటి కొత్త రోగం వస్తుందో తెలియక రోగులు సతమతమవుతున్న తీరు బాధాకరం.
Published Sat, Jul 6 2013 10:56 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement