లేటుగా వస్తే.. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక | Centre warns of strict action against its employees | Sakshi
Sakshi News home page

ఆఫీసులకు లేటుగా వస్తే.. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక

Published Mon, Jun 17 2024 11:15 AM | Last Updated on Mon, Jun 17 2024 11:25 AM

Warning to Late Coming Central Employees

ఢిల్లీ: కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి అనుగుణమైన ఆదేశాలు ఇప్పటికే ఉన్నతాధికారులకు అందాయి. కొందరు ఉద్యోగులు బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్)లో హాజరు నమోదు చేయకపోవడం, మరికొందరు ఉద్యోగులు నిత్యం ఆఫీసుకు ఆలస్యంగా రావడం జరుగుతోంది. దీనిపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వ ఈ విధమైన ఆదేశాలు జారీచేసింది.

సిబ్బంది మంత్రిత్వ శాఖ తాజాగా మొబైల్ ఫోన్ ఆధారిత ప్రమాణీకరణ వ్యవస్థను ఉపయోగించాలని ఉన్నతాధికారులకు సూచించింది. ఏఈబీఏఎస్ అమలు తీరును సమీక్షించిన ప్రభుత్వానికి దీని అమలులో అలసత్వం కనిపించింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న మంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ విభాగాల సిబ్బంది హాజరు నివేదికలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని నిర్ణయించింది. కొందరు ఉద్యోగులకు కార్యాలయానికి ఆలస్యంగా రావడం, త్వరగా బయలుదేరడం అలవాటుగా మారిందని, దీనిని నియంత్రించాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను కోరింది.

ఈ నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అప్పుడే ఏఈబీఏఎస్‌లో రిజిస్టర్డ్, యాక్టివ్ ఉద్యోగుల మధ్య ఎలాంటి తేడాలు ఉండవని ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సంబంధిత సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలను పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, డిఫాల్టర్లను గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయానికి సిబ్బంది ఎవరైనా ఆలస్యంగా వస్తే, దానిని హాఫ్-డే క్యాజువల్ లీవ్‌గా పరిగణించాలని సూచించింది. నెలలో ఒకటి లేదా రెండుసార్లు, న్యాయమైన కారణాలతో ఆలస్యంగా కార్యాలయానికి ఎవరైనా సిబ్బంది వస్తే అధికారులు వారిపై చర్యలు తీసుకోవలసిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement