సాక్షి, న్యూఢిల్లీ: జీపీఎఫ్ (ఉద్యోగుల భవిష్యనిధి)పై ఇచ్చే వడ్డీని యథాతధంగా కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జిపిఎఫ్) ఇతర సంబంధిత పథకాలకు 7.8 శాతం వడ్డీ రేటును చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ వడ్డీరేటు అక్టోబర్ 1నుంచి డి సెంబర్ 21, 2017 వరకు వర్తిస్తుందని పక్రటించింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే, రక్షణ బలగాల భవిష్య నిధిపై ఈ వడ్డీరేటు వర్తిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
గత నెలలో,ఇతర భవిష్యనిధి పథకాలైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) చిన్న పొదుపు పథకాల వడ్డీరేటులో ఎలాంటి మార్పు చేయకుండా అక్టోబర్-డిసెంబరులో 7.8 శాతంగా ఉంచింది.
Comments
Please login to add a commentAdd a comment