7న విధాన నిర్ణయాల వెల్లడి
ముంబై: ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ బుధవారం ప్రారంభమైంది. కొత్త ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ వడ్డీ రేట్లు, పరపతి విధానంపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్‌బీఐ కీలకంగా చూసేది ద్రవ్యోల్బణాన్నే. వినియోగ ధరల ఆధారిత సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం) డిసెంబర్ త్రైమాసికానికి 4.5 శాతానికి తగ్గుముఖం పడుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 4.8 శాతంగా ఉంటుందన్నది ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా. జనవరి నెల ద్రవ్యోల్బణం 4.5 సమీపంలో ఉండొచ్చని పేర్కొంది.
‘‘ద్రవ్యపరమైన ఉద్దీపనలు, వాణిజ్య యుద్ధాల పరంగా అనిశి్చతుల మధ్య ఆర్‌బీఐ రిస్‌్కలను సమతుల్యం చేయాల్సిన సున్నితమైన టాస్క్‌ను ఎదుర్కొంటున్నది. కనీసం స్వల్పకాలానికి రేట్ల తగ్గింపు పరంగా ఆర్‌బీఐకి వెసులుబాటు ఉంది’’అని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షల్లో పావు శాతం చొప్పున రేట్ల కోతలకు వెళ్లొచ్చని.. విరామం అనంతరం తిరిగి అక్టోబర్‌లో మళ్లీ రేట్ల కోత ఆరంభించొచ్చని తెలిపింది. మొత్తం మీద 0.75 శాతం మేర రేట్ల తగ్గింపు అవకాశాలను అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment