RBI monetary policy review
-
అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను ఈసారీ యథాతథంగానే ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా పదోసారి రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న 6.5 శాతం రెపోరేటునే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గుతున్నా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ తెలిపారు. మూడు రోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ సమావేశంలోని ముఖ్యాంశాలను దాస్ వెల్లడించారు.రూపాయి విలువలో ఎక్కువ ఒడిదొడుకులు ఉండకుండా ఆర్బీఐ చర్యలు తీసుకుంది.ప్రధాన ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుంది.ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నాం.ఎన్బీఎఫ్సీలు రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా వృద్ధిని కొనసాగిస్తున్నాయి.సెప్టెంబరులో సీపీఐ గణనీయంగా పెరగవచ్చు.ద్రవ్యోల్బణం: > సీపీఐ ద్రవ్యోల్బణం క్యూ2లో 4.1%గా ఉంటుందని అంచనా.> క్యూ3లో 4.8 శాతానికి పెరగొచ్చు.> క్యూ4లో 4.2 శాతంగా ఉండవచ్చు.> క్యూ1 2026 ఆర్థిక సంవత్సరంలో 4.3 శాతంగా ఉండబోతుంది.2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుంది.జీడీపీ 7.2 శాతంగా ఉంటుందని అంచనా.ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ 6.7 శాతం పెరిగింది.కూ1లో జీడీపీలో కరెంట్ ఖాతా లోటు 1.1 శాతంగా ఉంది.యూపీఐ లైట్ వాలెట్ లిమిట్‌ను రూ.2000 నుంచి రూ.5000కు పెంచారు.‘యూపీఐ 123పే’ ఐవీఆర్ ఆధారిత లావాదేవీలను రూ.5000 నుంచి రూ.10000కు పెంచారు.పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, దాంతో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాలు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి కారణాలు అయి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు సరళతర రేటు విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ దేశీయంగా ఆర్బీఐ ఆ తరహా నిర్ణయాలు తీసుకోకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయదనే సంకేతాలు గతంలో గవర్నర్ పలు సమావేశాల్లో స్పష్టంగా అందించారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ యథాతథంగా 6.5 శాతం రెపో రేటును కొనసాగిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే, డిసెంబర్లో జరిగే ఎంపీసీ సమావేశంలో రేటు తగ్గింపు ఉండవచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు.ఇదీ చదవండి: కిక్కెక్కిస్తోన్న ‘క్విక్ కామర్స్’!2024 జులై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) నమోదయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అందుకు అనువుగా ద్రవ్యోల్బణం తగ్గుతున్నా కీలక వడ్డీరేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పేర్కొన్నారు. అయితే సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని సూచిస్తోంది. కానీ దీనివల్ల ఆర్బీఐ పనితీరుపై ప్రజలకు విశ్వాసం కోల్పోతుందని ఇటీవల రఘురామ్‌రాజన్ తెలిపారు. -
తగ్గిద్దామా? వద్దా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ రెపోరేటు(ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు-ప్రస్తుతం 6.5 శాతం)ను తగ్గించాలా? వద్దా అనే నిర్ణయంపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. కమిటీ తీసుకునే నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ ఈ నెల 9వ తేదీన వివరిస్తారు.యథాతథ స్థితికే ఓటు..!కమిటీ కీలక వడ్డీరేట్లను యథాతథ స్థితిలోనే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, దాంతో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాలు ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు సరళతర రేటు విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ దేశీయంగా ఆర్బీఐ ఆ తరహా నిర్ణయాలు తీసుకోకపోవచ్చని నిపుణుల అంచనా. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ యథాతథంగా 6.5 శాతం రెపో రేటును కొనసాగిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే, డిసెంబర్లో జరిగే ఎంపీసీ సమావేశంలో రేటు తగ్గింపు ఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులుభేటీలో ముగ్గురు కొత్త సభ్యులుఆర్బీఐ తాజా ద్రవ్య పరపతి విధాన కమిటీని ప్రభుత్వం ఈ నెలారంభంలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఎక్స్టర్నల్ సభ్యులుగా రామ్ సింగ్, సౌగత భట్టాచార్య, నగేష్ కుమార్‌లను కేంద్రం ఈ నెల ప్రారంభంలో నియమించింది. పదవీ కాలం ముగిసిన అషిమా గోయల్, శశాంక భిడే, జయంత్ ఆర్ వర్మ స్థానంలో వీరి నియామకం జరిగింది. గత ద్వైమాసిక సమావేశాల్లో అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మలు రేటు తగ్గింపునకు ఓటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా నియమితులైన వారితో పాటు కమిటీలో అంతర్గత (ఆర్బీఐ తరఫున) సభ్యులుగా గవర్నర్ శక్తికాంతదాస్, డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్బీఐ పరపతి విధాన విభాగం) రాజీవ్ రంజన్లు ఉన్నారు. -
ఆహార ధరలు ఇంకా తీవ్రమే..
న్యూఢిల్లీ: తక్షణం వడ్డీరేటు సరళతరం అయ్యే అవకాశం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ తెలిపారు. వినియోగ ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2 ప్లస్‌తో ఆరు శాతానికి కట్టడి చేయాలన్న కేంద్రం నిర్దేశం... ప్రస్తుతం 6 శాతం దిగువనే ఉన్న పరిస్థితి (మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతం)ని ఆయన ప్రస్తావిస్తూ, ‘‘ప్రస్తుత ద్రవ్యోల్బణం–4 శాతం లక్ష్యం మధ్య ఉన్న అంతరాన్ని బట్టి వడ్డీ రేటుపై వైఖరిని మార్చడం చాలా ముందస్తు చర్య అవుతుంది’’ అని ఉద్ఘాటించారు. రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 4 శాతమేనని పలు సందర్భాల్లో ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పొంచి ఉన్నాయని కూడా ఆయన పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. జూన్ 2023 నుండి వరుసగా 11వ నెలలో ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గింది. సేవల ద్రవ్యోల్బణం చారిత్రక కనిష్ట స్థాయిలకు దిగివచి్చంది. వస్తు ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు.. → మనం స్థిరమైన ప్రాతిపదికన 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం వైపునకు వెళ్లినప్పుడు వడ్డీరేటు వైఖరిలో మార్పు గురించి ఆలోచించే విశ్వాసం మనకు లభిస్తుంది. → ద్రవ్యోల్బణం ప్రయాణం అంచనాలకు తగ్గట్టుగానే పురోగమిస్తున్నది. అయితే పూర్తి 4 శాతం దిశగా ప్రయాణం అత్యంత కష్టతరమైన అంశం. ఇందుకు పలు అడ్డంకులు ఉన్నాయి. → మార్చి–మే మధ్య తయారీ, ఫ్యూయల్ అండ్ లైట్ ద్రవ్యోల్బణం తగ్గింది. అయితే ఆహార ద్రవ్యోల్బణం విషయలో ఇంకా ఆందోళనలు ఉన్నాయి. కూరగాయలుసహా పలు నిత్యావసరాల వస్తువుల ద్రవ్యోల్బణం స్పీడ్ రెండంకెలపైనే ఉంది. → స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విషయానికి వస్తే పలు అంశాలు వృద్ధికి దోహదపడే విధంగా తమ పాత్రను పోషిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వృద్ధి వేగం చాలా బలంగా ఉంది. ఇది మొదటి త్రైమాసికంలో బలంగా కొనసాగుతుందని భావిస్తున్నాం. జూన్ పాలసీ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ క్రితం 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచడం ఇక్కడ గమనార్హం. ఇదే జరిగితే దేశం వరుసగా నాలుగు సంవత్సరాల్లో 7 శాతం ఎగువన వృద్ధి సాధించినట్లు అవుతుంది. పాలసీ విధానం పునరుద్ఘాటన ఇంటర్వ్యూలో గవర్నర్ పాలసీ విధాన సమీక్ష అంశాలను పునరుద్ఘాటించడం గమనార్హం. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి జూన్ 5 నుంచి 7వ తేదీ మధ్య మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో మెజారిటీ 4 శాతం దిగువకు రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే తన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ వరుసగా ఎనిమిదవసారి కీలక రేటు– రెపోను (6.5 శాతం) యథాతథంగా ఉంచింది. అయితే వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. వీరిలో ఎంపీసీ ఎక్స్టర్నల్ సభ్యులు జయంత్ వర్మతో ఆషిమా గోయల్ కూడా ఉన్నారు. అయితే ఆర్బీఐ ఎంపీసీ మెజారిటీ సభ్యులు –ఎటువంటి అనిశ్చితి లేకుండా ద్రవ్యోల్బణం దిగువబాటనే కొనసాగుతుందన్న భరోసా వచ్చే వరకూ– వేచిచూసే ధోరణి పాటించాలని అభిప్రాయపడ్డారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ దీన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. కాగా, వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆహార ధరలపరంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఎగిసే రిసు్కలను ఎంపీసీ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ సమీక్ష సందర్భంగా చెప్పారు. ధరలు నిలకడగా ఉండే విధంగా స్థిరత్వాన్ని సాధించగలిగితేనే అధిక వృద్ధి సాధనకు పటిష్టమైన పునాదులు వేయడానికి సాధ్యపడగలదని ఆయన పేర్కొ న్నారు. ద్రవ్యోల్బణం భయాలు ఇంకా పొంచే ఉన్నాయని ఎంపీసీలోని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2024–25లో 4.5 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ పాలసీ అంచనా. క్యూ1 (ఏప్రిల్–జూన్) 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3 లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం రిటైల్ ద్రవ్యో ల్బణం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. ఆహార ధరల తీవ్రతవల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు రావడం లేదని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష పేర్కొంది. మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, ఆర్బీఐ గవర్నర్ పేర్కొంటున్న లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. -
కీలక వడ్డీరేట్లు యథాతథం
భారతీయ రిజర్వ్‌బ్యాంక్ వరుసగా ఏడోసారి కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈమేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. బుధవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన (ఆర్బీఐ మానిటరీ పాలసీ) సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ఆర్బీఐ మానిటరీ పాలసీలోని ముఖ్యాంశాలు.. బెంచ్‌మార్క్ వడ్డీరేటు, రెపోరేటు స్థిరంగా 6.5శాతంగా ఉంది. 2024-25 ఏడాదికిగాను జీడీపీ వృద్ధి 7 శాతం నమోదుకానుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతం చేరే అవకాశం ఉంది. తొలి త్రైమాసికంలో 4.9%, రెండో త్రైమాసికంలో 3.8%, మూడో త్రైమాసికంలో 4.6%, నాలుగో త్రైమాసికంలో 4.5 శాతంగా ఉంటుందని అంచనా. 2023-24కుగాను భారత్‌కు వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు 625 బిలియన్డాలర్లుగా ఉన్నాయి. ఇవి 2014-15 తర్వాత వచ్చిన రెండో అత్యధిక పెట్టుబడులుగా ఉన్నాయి. ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగింది. ద్రవ్యోల్బణ పెరుగుదలపై ఆర్బీఐ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గ్రామీణ గిరాకీ పుంజుకుంటోంది. ఇది 2024-25లో ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని అంచనా. ప్రపంచ వృద్ధి నేపథ్యంలో ముడి చమురు ధరల పెరుగుదలను నిశితంగా పరిశీలించాలి. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొంటున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కమొడిటీ ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో సావరిన్ గ్రీన్ బాండ్‌పై ట్రేడింగ్ కోసం ఆర్బీఐ త్వరలో స్కీమ్‌ను నోటిఫై చేయనుంది. కీలక రేట్లు ఇలా.. రెపోరేటు: 6.5 శాతం ఎస్డీఎఫ్ రేటు: 6.25 శాతం ఎంఎస్ఎఫ్ రేటు: 6.75 శాతం బ్యాంక్ రేటు: 6.75 శాతం -
ఆర్బీఐ పాలసీ అప్రమత్తత
ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆర్బీఐ ద్రవ్య కమిటీ సమావేశ నిర్ణయాల వెల్లడి (నేడు)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీన సంకేతాలు సైతం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఇంట్రాడేలో 621 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరికి 34 పాయింట్ల స్వల్ప నష్టంతో 72,152 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 71,938 వద్ద కనిష్టాన్ని, 72,559 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 22,053 – 21,860 రేంజ్ లో కదలాడింది. చివరికి ఒక పాయింటు లాభపడి 21,930 వద్ద నిలిచింది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఫార్మా, రియల్టీ షేర్లకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.31%, 0.38% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,691 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,096 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో హాంగ్‌కాంగ్, ఇండోనేíసియా, చైనా తప్ప మిగిలిన అన్ని దేశాల సూచీలు ఒకశాతం మేర లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 0.50% – 0.10% నష్టపోయాయి. అమెరికా మార్కెట్లు 0.25% లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► అమెరికా దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ క్యూ4 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో పాటు ఇటీవల ర్యాలీ నేపథ్యంలో ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. టెక్ మహీంద్రా 2.31%, ఇన్ఫోసిస్ 2%, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ షేర్లు ఒకశాతం చొప్పున నష్టపోయాయి. ► పేటీఎం రికవరీ ప్రయాణం బుధవారం కొనసాగింది. బీఎస్ఈలో ట్రేడింగ్ ప్రారంభంలో 10% పెరిగి రూ.496 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకి లాకైంది. రెండు రోజుల్లో షేరు 13% బౌన్స్‌బ్యాక్‌తో కంపెనీ మార్కెట్ విలువ రూ.3,720 కోట్లు పెరిగి రూ.31,548 కోట్లకు చేరింది. ► హెచ్డీఎఫ్సీ బ్యాంకు వాటా కొనుగోలుకు ఆర్బీఐ అనుమతినివ్వడంతో యస్‌బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు వరుసగా 17%, 7% చొప్పున లాభపడ్డాయి. -
ఆర్బీఐ అండతో మళ్లీ రికార్డుల మోత
ముంబై: ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరి మెప్పించడంతో స్టాక్ మార్కెట్లో మళ్లీ రికార్డుల మోత మోగింది. రిజర్వ్ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 –24) వృద్ధి రేటు అంచనాలు పెంచడం, వరుసగా అయిదోసారి కీలక వడ్డీ రేట్ల జోలికెళ్లకపోవడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా వడ్డీ రేట్ల ఆధారిత బ్యాంకులు, ఫైనాన్స్ సరీ్వసులు, రియల్టీ షేర్లకు భారీ డిమాండ్ లభించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే, ముగింపులోనూ కొత్త రికార్డులు నమోదు నమోదు చేశాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు లాభపడి 69,826 వద్ద వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 20,969 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం సూచీలు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ సమీక్షా సమావేశ నిర్ణయాలు వెల్లడి(ఉదయం 10 గంటలు) తర్వాత కొనుగోళ్లు మరింత పెరిగాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 372 పాయింట్లు బలపడి 69,894 వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి తొలిసారి 21 వేల స్థాయిపై 21,006 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ► బ్లాక్ డీల్ ద్వారా 75.81 కోట్ల షేర్లు చేతులు మారినట్లు డేటా వెల్లడి కావడంతో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ షేరు 12% లాభపడి రూ.69 వద్ద ముగిసింది. -
రెపో రేటు పెరగనుందా? .. నేటి నుంచి ఆర్బీఐ పాలసీ భేటీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు (3,5,6 తేదీల్లో... మహవీర్ జయంతి సందర్భంగా 4న సెలవు) జరగనున్న ఈ సమవేశాల్లో రెపో రేటును మరో పావుశాతం పెంపునకు నిర్ణయం తీసుకోవడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 6.75 శాతానికి పెరగనుంది. పాలసీ సమీక్ష నిర్ణయాలు 6వ తేదీన వెలువడనున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరి మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపది విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగింది. ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. -
ఫెడ్ రిజర్వ్, ఆర్బీఐ నిర్ణయాలు కీలకం
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ, ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ అత్యవసర సమావేశపు నిర్ణయాలు ఈ వారం మార్కెట్‌ను నడిపిస్తాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు ప్రభావం చూపొచ్చంటున్నారు. హిందూ నూతన సంవత్సరం ‘2079 సంవత్’ తొలివారంలో సెన్సెక్స్ 650 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు స్థిరీకరణ దిశగా సాగొచ్చు. కార్పొరేట్ల రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌పై దృష్టి సారించడం శ్రేయస్కరం. కన్సాలిడేషన్‌లో భాగంగా దిగివచ్చిన నాణ్యమైన షేర్లను గుర్తించి ఎంపిక చేసుకోవాలి. సాంకేతికంగా నిఫ్టీకి 18,100 పాయింట్ల వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దిగువ స్థాయిలో 17,400 స్థాయి వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ఫెడ్ రిజర్వ్ సమావేశం అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం మంగళవారం(నవంబర్ ఒకటిన) ప్రారంభం కానుంది. మరుసటి రోజు(బుధవారం) చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య కమిటి నిర్ణయాలను వెల్లడించనున్నారు. వరుసగా నాలుగోసారి వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ఆర్బీఐ ఎంపీసీ అత్యవసర భేటీ రిజర్వ్ బ్యాంక్ తన తదుపరి పరపతి ద్రవ్య సమీక్ష(ఎంపీసీ) సమావేశాన్ని గురువారం (నవంబర్ 3న) అత్యవసరంగా నిర్వహించనుంది. వరుసగా మూ డు త్రైమాసికాలుగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో విఫలంకావడంతో ఆర్బీఐ మరోదఫా వడ్డీరేట్లను పెంచడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు ఈ వారంలో సుమారు 100కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, యూపీఎల్, హీరో మోటోకార్ప్, హెచ్‌పీసీఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా, గెయిల్ ఇండియా, టైటాన్, పవర్ గ్రిడ్ తదితర దిగ్గజ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. స్థూల ఆర్థిక గణాంకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసిక జీడీపీ డేటాతో పాటు జూలై ద్రవ్యోల్బణ లోటు, మౌలిక రంగ గణాంకాలు బుధవారం(ఆగస్టు 31న) వెల్లడి కానున్నాయి. సెప్టెంబర్ ద్రవ్యలోటు, మౌలిక రంగ గణాంకాలు సోమవారం విడుదల కానున్నాయి. మరసటి రోజు అక్టోబర్ నెల వాహన విక్రయ గణాంకాలతో పాటు అదే నెల తయారీ రంగ డేటా కూడా విడుదల అవుతుంది. సేవారంగ డేటా గురువారం వెల్లడి కానుంది. అలాగే శుక్రవారం ఆర్బీఐ అక్టోబర్ 21 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల 28వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. తగ్గిన ఎఫ్ఐఐల అమ్మకాల ఉధృతి దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఉధృతి తగ్గుముఖం పట్టింది. సెప్టెంబర్‌లో రూ.7,600 కోట్ల ఈక్విటీలను విక్రయించిన ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటి వరకు(29 తేదీ నాటికి) రూ.1,586 కోట్ల షేర్లను మాత్రమే అమ్మారు. ఆగస్ట్‌లో రూ. 51,200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాదిలో నికరంగా 1.70 లక్షల కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, రూపాయి పతనం, ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగడం, బ్రిటన్‌లో రాజకీయ అస్థిరత తదితర అంశాల నేపథ్యంలో భవిష్యత్‌లోనూ ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో ఆటుపోట్లు కనిపించవచ్చు’’ అని మార్నింగ్‌స్టార్ ఇండియా అసిసోయేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
రివర్స్ రెపో పావు శాతం పెరగొచ్చు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) చివరి సమీక్షా సమావేశం వచ్చే వారం (8–10వ తేదీల్లో) జరగనుంది. ఈ సందర్భంగా కీలక రేట్లను పావు శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. ‘‘ఒమిక్రాన్ వేరియంట్ విస్తరణ నేపథ్యంలో వృద్ధిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు ద్రవ్యోల్బణం దాదాపుగా ఆర్బీఐ నియంత్రణల పరిధిలోనే ఉంది. దీంతో వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ సర్దుబాటు విధానాన్నే కొనసాగించొచ్చు. రివర్స్ రెపో రేటును 0.20–0.25 శాతం వరకు పెంచొచ్చు’’ అని బార్క్లేస్ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ రేటు 3.35%గా ఉంది. ప్రభుత్వం ఊహించని విధంగా రుణ సమీకరణ పరిమాణాన్ని బడ్జెట్లో పెంచినందున ఇది పాలసీ సాధారణీకరణ దిశగా ఆర్బీఐకి సంకేతం ఇచ్చినట్టేనని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్లో మూలధన వ్యయాలపై దృష్టి సారించడం ఆర్థిక వ్యవస్థకు ప్రేరణనిస్తుందని.. ద్రవ్యోల్బణం సహా స్థూల ఆర్థిక నేపథ్యాన్ని మార్చదని బార్క్లేస్ పేర్కొంది. చమురు ధరలు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు పెరగకపోవచ్చని అంచనా వేసింది. ఆర్బీఐ అప్రమత్తంగా ఉంటూ, ద్రవ్యోల్బణం అంచనాలను ఎగువవైపు పరిమితి (2–6) వద్ద కొనసాగించొచ్చని పేర్కొంది. -
ఆర్‌బీఐవైపు మార్కెట్ చూపు
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ ద్రవ్యపాలసీ కమిటీ నిర్ణయాలు, కార్పోరేట్ కంపెనీల తాజా త్రైమాసిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు మార్కెట్ పనితీరును ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. అలాగే రూపాయి కదలిక, క్రూడాయిల్ ట్రేడింగ్, మూడో దశ కరోనా కేసుల నమోదు తదితర అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్ధేశించే అంశాలుగా ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వృద్ధి ఆధారిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో గతవారంలో సెన్సెక్స్ 1445 పాయింట్లు, నిఫ్టీ 414 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 17,450 వద్ద మద్దతు స్థాయి, ఎగువ స్థాయిలో 17,800 వద్ద నిరోధాన్ని కలిగి ఉంది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నాగరాజ్ శెట్టి తెలిపారు. రేపటి నుంచి ‘పాలసీ’ సమావేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) చివరి, ఆరవ ద్వైమాసిక ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం మంగళవారం ప్రారంభమై గురువారం ముగిస్తుంది. ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచేందుకు మొగ్గుచూపుతున్న వేళ ఆర్బీఐ ద్రవ్యవిధాన వైఖరిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 90 డాలర్లపైకి చేరడం ఆర్బీఐకి మరో సమస్యగా మారింది. కీలక దశలో కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఫలితాల ప్రకటన అంకం కీలక దశకు చేరుకుంది. భారతీ ఎయిర్టెల్, ఏసీసీ, భాష్, పవర్ గ్రిడ్, హీరో మోటోకార్ప్, హిందాల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీతో సహా బీఎస్ఈలో నమోదైన 1600కు పైగా కంపెలు ఇదే వారంలో తమ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇన్వెస్టర్లు ఈ గణాంకాలపై దృష్టి సారించవచ్చు. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. భయపెడుతున్న బాండ్ ఈల్డ్స్ రాబడులు భారత ప్రభుత్వ పదేళ్ల బాండ్ల రాబడి గతవారం రెండేళ్ల గరిష్టం 6.9 స్థాయికి చేరింది. యూఎస్ పదేళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి 1.9 శాతంపైన ముగిసింది. క్రూడాయిల్ ధరల మంటలు రష్యా– ఉక్రెయిన్ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు, యూఎస్ మంచు తుఫాన్లతో సప్లై అంతరాయాలు నెలకొని ముడిచమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. గడిచిన ఏడు వారాల్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 26 శాతం పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్న వేళ క్రూడ్ ధరలు పెరగడం మంచిది కాదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు ఈ ఫిబ్రవరి తొలి నాలుగు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి రూ.6,834 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో ఈక్విటీల నుంచి రూ.3,173 కోట్లను, డెట్ విభాగం నుంచి రూ.3,173 కోట్లను, హైబ్రిడ్ సెగ్మెంట్ నుంచి రూ.34 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. రేపు అదానీ విల్మర్ లిస్టింగ్ ఇటీవల ఐపీఓ పూర్తి చేసుకున్న అదానీ విల్మర్ షేర్లు మంగళవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. ఈ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్లో ఇష్యూ ధర (రూ.230) కంటే అధికంగా రూ.25–30 పలుకుతున్నాయి. ఇక ఫిబ్రవరి 4న ప్రారంభమైన మాన్యవర్ మేకర్ ‘వేదాంత ఫ్యాషన్స్’ ఐపీఓ మంగళవారం ముగియనుంది. పాలసీ సమావేశం వాయిదా ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేసినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘భారత రత్న లతా మంగేష్కర్ మృతికి నివాళిగా మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు దినంగా ప్రకటించింది. దీంతో సోమవారం నుంచి మూడు రోజుల జరగాల్సిన కమిటీ సమావేశం మంగళవారం ప్రారంభమవుతుంది. పాలసీ కమిటీ నిర్ణయాలను గురువారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడిస్తారు’’ అని ఆర్బీఐ ప్రకటన ఒకటి పేర్కొంది. -
ఎనిమిదోసారీ యథాతథమే!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ (ఆర్బీఐ–ఎంపీసీ) అంచనాలకు అనుగుణంగా రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే– రెపో. ప్రస్తుతం 4 శాతంగా ఇది కొనసాగుతోంది. వృద్ధే లక్ష్యంగా వరుసగా ఎనిమిది ద్వైమాసికాల నుంచి ఆర్బీఐ సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అనుసరిస్తోంది. 2019లో రెపో రేటును ఆర్బీఐ 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం). 2020 మార్చి తర్వాత 115 బేసిస్ పా యింట్లు తగ్గించింది. గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ మూడు రోజు ల సమావేశం అనంతరం శుక్రవారం ఎకానమీకి సంబంధించి నిర్ణయాల ప్రకటన వెలువడింది. కట్టడిలోకి ద్రవ్యోల్బణం రిటైల్ ద్రవ్యోల్బణం పూర్తి అదుపులోనికి వస్తుందన్న ఆర్బీఐ అంచనాలతో రెపో యథాతథం కొనసాగింపునకు ఆర్బీఐ పాలసీ కమిటీ ఆమోదముద్ర వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగలు 5.7 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలను తాజాగా 5.3 శాతానికి కుదించింది. దీనివల్ల సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్ పునరుద్ధరణకు దోహదపడుతుంది.ఇక రిటైల్ ద్రవ్యోల్బణం రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1 శాతం, 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది. వృద్ధి రేటుపై ధీమా... ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధికి ఢోకా ఉండబోదన్నది ఆర్బీఐ అంచనావేసింది. తొలి 10.5 శాతం అంచనాలను జూన్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ 9.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. 2021–22 మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి నమోదుకాగా, రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 7.9 శాతం, 6.8 శాతం, 6.1 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ అంచనావేసింది. 2022–23 మొదటి త్రైమాసికంలో ఈ అంచనా 17.2 శాతంగా ఉంది. ఎకానమీ సంపూర్ణ ప్రయోజనాలు కీలకం తాజా పాలసీ సమీక్ష నేపథ్యంలో పొదుపు పథకాలు, బ్యాంకుల డిపాజిట్లపై ఆధారపడి జీవించే వారికి కొత్తగా వచ్చే ఆర్థిక ప్రయోజనం ఏదీ ఉండదు. వారికి యథాతథంగా సాధారణ వడ్డీరేట్లు మాత్రమే అందుతాయి. ద్రవ్యోల్బణం అదుపులో లేకపోతే మాత్రం వారు ప్రతికూల రిటర్న్స్ అందుకునే పరిస్థితి ఉంటుంది. ‘‘కుప్పకూలిపోతున్న లేదా క్షీణిస్తున్న మొత్తం ఆర్థిక వ్యవస్థకు మీరు మద్దతు ఇవ్వలేకపోతే, సీనియర్ సిటిజన్లతో సహా అందరికీ ఇతర ప్రధాన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది’’ అని ఇదే విషయంపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రబి శంకర్ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే పొదుపు పథకాలు ఇంకా నెగటివ్ రిటర్న్స్ ఏమీ ఇవ్వడం లేదని కూడా ఆయన విశ్లేíÙంచారు. ఈ సందర్భంగా ఆయన స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లో ఏడాది డిపాజిట్ పథకాన్ని ప్రస్తావిస్తూ, ఇక్కడ డిపాజిట్ రేటు మార్గదర్శకాల ద్వారా వచి్చన వాస్తవ రేటు కంటే కనీసం 170–180 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉందన్నారు. పెట్రో పన్నులపై ఆందోళన పెట్రో ఉత్పత్తులపై పన్నుల తీవ్రత పట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని పేర్కొన్నారు. బహిరంగంగా రెండవసారి ఈ అంశంపై మాట్లాడిన గవర్నర్, పప్పులు, వంటనూనెల వంటి నిత్యావసరాల సరఫరాల విషయంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రాలకు చేయూత మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావాలకు గురయిన రాష్ట్రాలకు ద్రవ్య లభ్యత విషయంలో ఎటువంటి సమస్యలూ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ‘వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ (డబ్ల్యూఎంఏ), ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం ద్వారా పెంచిన రుణ పరిమితులను అన్ని విధాలా కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. మహమ్మారి ప్రారంభమైనప్పటి ఈ సమస్యతో పాటు అధిక రుణాల ఫలితంగా, రాష్ట్రాలు తమ బాండ్ హోల్డర్లకు అధిక వడ్డీని చెల్లిస్తున్నాయి – ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ రేటు దాదాపు 7 శాతానికి చేరువైంది. ఈ సమయంలో పలు రాష్ట్రాలు డబ్ల్యూఎంఏ విండోను వినియోగించుకున్నాయి. జూలై నాటికి ఈ సౌలభ్యం ద్వారా నిధుల రుణ పరిమాణం 35 శాతం పెరిగి రూ .92,000 కోట్లకు చేరింది. ఉద్దీపనలను వెనక్కు... సంకేతాలు కోవిడ్–19 నేపథ్యంలో ఆర్బీఐ ప్రకటించిన ఉద్దీపనలకు క్రమంగా వెనక్కు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పాలసీ సమీక్ష సూచించింది. ప్రస్తుతం వ్యవస్థలో రూ .9 లక్షల కోట్లకు పైగా ఉన్న అదనపు ద్రవ్యతను ‘క్రమంగా‘ సర్దుబాట్లు చేయడానికి సెంట్రల్ బ్యాంక్ సుముఖంగా ఉందని గవర్నర్ సూచించారు. మార్కెట్ నుంచి ప్రభుత్వ సెక్యూరిటీలను (బాండ్లు) కొనుగోలుకు సంబంధించిన జీఎస్ఏపీ (గవర్నమెంట్ సెక్యూరిటీస్ అక్విజేషన్ ప్రొగ్రామ్)ను నిలుపుచేయడం జరిగిందని ఆయన తెలిపారు. వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యత లేకుండా చూడ్డామే దీని ఉద్దేశ్యమని సూచించారు. గడచిన రెండు త్రైమాసికాల్లో జీఎస్ఏపీ కింద ఆర్బీఐ రూ.2.2 లక్షల కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. కాగా, ఇదే సమయంలో ఎకానమీ రికవరీకి తగిన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) వ్యవస్థలో ఎప్పడూ కొనసాగేలా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. బడా టెక్ ‘ఫైనాన్షియల్స్’పై కన్ను గూగుల్, అమెజాన్ ద్వారా డిపాజిట్ల ఆమోదం నిర్దేశిత చట్టాలు, నిబంధనల ప్రకారం ఉందో లేదో ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఆర్థిక రంగంలో బడా టెక్ సంస్థల కార్యకలాపాలపై ఆందోళనలు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ పే (ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్) , అమెజాన్ రెండూ తమ మొబైల్ ఫోన్ యాప్‌ల ద్వారా దేశంలో డిపాజిట్లను స్వీకరించడానికి రుణదాతలతో భాగస్వామ్యాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. 5 లక్షలకు ఐఎంపీఎస్.. ఐఎంపీఎస్ (ఇమీడియట్ పేమెంట్ సర్వీస్) ద్వారా ప్రస్తుత లావాదేవీ పరిమితి రూ.2 లక్షలు కాగా, దీనిని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం జరిగింది. డిజిటల్ లావాదేవీల పెంపు ఈ నిర్ణయ ప్రధాన లక్ష్యం. ఐఎంపీఎస్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్వహిస్తోంది. పాలసీలో కొన్ని ముఖ్యాంశాలు... ► బ్యాంకులు తమ మిగులు నిల్వలను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసినప్పుడు లభించే రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగనుంది. ► మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, బ్యాంక్ రేట్ కూడా 4.25 శాతం వద్ద స్థిరంగా ఉండనుంది. ► ద్రవ్య లభ్యత, సర్దుబాటు లక్ష్యాలుగా అక్టోబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 3 మధ్య పక్షం రోజుల ప్రాతిపదికన ఐదు 14 రోజుల వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (వీఆర్ఆర్ఆర్) వేలాలను చేపట్టాలని ప్రతిపాదించింది. ► ఏటీఎంల్లో డబ్బు అందుబాటులో లేని సంద ర్భంల్లో ఆయా బ్యాంకులపై జరిమానా విధింపునకు ఉద్దేశించిన పథకాన్ని ఆర్బీఐ సమీక్షిస్తోంది. బ్యాంకర్ల నుంచి అందిన సలహాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో ఈ జరిమానా విధానాన్ని ప్రకటిస్తే, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ► ఫైనాన్షియల్ మోసాల నివారణే లక్ష్యంగా కొత్త విధాన రూపకల్పన జరగనుంది. ► బ్యాంకుల తరహాలోనే బడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎప్సీ) కస్టమర్ల సమస్యల పరిష్కారానికి అంతర్గత అంబుడ్స్‌మన్ యంత్రాంగం ఏర్పాటు కానుంది. ► దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో గ్లోబల్‌బాండ్ ఇండిసీస్‌లో చేరే విషయంలో భారత్ ముందడులు వేస్తోంది. ఆర్బీఐ, కేంద్రం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఇండెక్స్ ప్రొవైడర్లతో చర్చిస్తున్నాయి. ► తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరగనుంది. ఆఫ్‌లైన్‌లో రిటైల్ డిజిటల్ చెల్లింపులు దేశ వ్యాప్తంగా ఆఫ్‌లైన్ విధానంలో రిటైల్ డిజిటల్ చెల్లింపుల కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఆర్బీఐ ప్రవేశపెట్టనుంది. ఇంటర్నెట్ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం రిటైల్ డిజిటల్ పేమెంట్లు జరిగేలా చర్యలు తీసుకోవడం ఈ ఫ్రేమ్‌వర్క్ ప్రధాన లక్ష్యం. చెల్లింపులకు సంబంధించి దేశ వ్యాప్తంగా అంగీకృత మౌలిక వ్యవస్థ బలోపేతానికి జియో ట్యాగింగ్ ఫ్రేమ్‌వర్క్ విడుదల కానుంది. వృద్ధి సంకేతాలు పటిష్టమవుతున్నాయ్ వృద్ధి కిరణాలు విస్తరిస్తుండడం, ఇందుకు సంకేతాలు పటిష్టమవుతుండడాన్ని ఆర్బీఐ గమనిస్తోంది. రైల్వే రవాణా, పోర్ట్ కార్యకలాపాలు, సిమెంట్ ఉత్పత్తి, విద్యుత్ డిమాండ్, ఈ– వే బిల్లుల మెరుగుదల, జీఎస్టీ, టోల్ భారీ వసూళ్ల వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. దీర్ఘకాలం వృద్ధి పటిష్ట ధోరణి కొనసాగడానికి సరళతర ఆర్థిక విధానాన్నే కొనసాగించాలని ఆర్బీఐ పాలసీ కమిటీ నిర్ణయించింది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ -
పాలసీ ముందు లాభాలు
ముంబై: ఆర్బీఐ ద్రవ్య పాలసీ ప్రకటనకు ముందురోజు స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక వడ్డీరేట్లపై నిర్ణయాలను, ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్‌పై అభిప్రాయాన్ని నేడు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. క్రూడాయిల్ ధరలు ఎనిమిదేళ్ల గరిష్టం నుంచి దిగివచ్చాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మూడురోజుల వరుస నష్టాలకు ముగింపు పలికింది. మూడీస్‌తో సహా పలు అంతర్జాతీయ రేటింగ్‌లు భారత ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్‌ను పెంచాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు తగ్గుముఖం పట్టాయి. ఈ అంశాలన్నీ దేశీయ మార్కెట్లో సానుకూల వాతావారణాన్ని నెలకొల్పాయి. ఫలితంగా సెన్సెక్స్ 488 పాయింట్లు పెరిగి 59,678 వద్ద, నిఫ్టీ 144 పాయింట్ల లాభంతో 17,790 వద్ద ముగిశాయి. దీంతో క్రితం రోజు నష్టాలన్నీ రికవరీ అయినట్లైంది. ఇంధన గ్యాస్ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది. సెమి కండక్టర్ల కొరత ఉన్నప్పటికీ.., పండుగ సీజన్లో అమ్మకాలు ఊపందుకోవచ్చనే ఆశలతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. రియల్ ఎస్టేట్ కంపెనీల క్యూ2 విక్రయాలు అంచనాలకు మించి నమోదుకావడంతో ఈ రంగ షేర్ల లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలోని నిఫ్టీ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ ఏకంగా 12 ఏళ్ల గరిష్టాన్ని అందుకుంది. ఆర్బీఐ ద్రవ్య పాలసీ విధాన వెల్లడి(నేడు)కి ముందు బ్యాంకింగ్, కన్జూమర్ కౌంటర్లలో సందడి నెలకొంది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ నేడు క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడించనున్న నేపథ్యంలో ఐటీ రంగాల షేర్లు రాణించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ రెండు శాతం చొప్పున ఎగిశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1764 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.2529 కోట్ల షేర్లను అమ్మారు. క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో పాటు అగ్రరాజ్యం అమెరికాలో డెట్–సీలింగ్(రుణాలకు చట్టబద్ధమైన ఆమోదం) చర్చలు ఓ కొలిక్కిరావడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట వీడాయి. ఆసియాలో ఒక్క ఇండోనేషియా మార్కెట్ తప్ప మిగితా అన్ని దేశాల స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి. సెలవుల కారణంగా చైనా ఎక్సే్ఛంజీలు పనిచేయడం లేదు. యూరప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. అమెరికా ఫ్యూచర్లు సైతం అరశాతం నుంచి ఒకటిన్నర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టైటాన్ విలువ @ రూ.2 లక్షల కోట్లు: వజ్రాభరణాల తయారీ, విక్రయ సంస్థ టైటాన్ షేర్లు ట్రేడింగ్‌లో మెరిశాయి. రెండో క్వార్టర్లో బలమైన డిమాండ్ నెలకొనడంతో వ్యాపారంలో వేగవంతమైన రికవరీని సాధించిమని కంపెనీ ప్రకటించింది. ఇంట్రాడేలో ఈ షేర్లు 11 శాతం లాభపడి రూ.2,383 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకున్నాయి. చివరికి రూ. 2,376 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ రూ.2.10 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. టీసీఎస్ తర్వాత టాటా గ్రూప్ నుంచి రూ.2 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను అందుకున్న రెండో కంపెనీ టైటాన్ నిలిచింది. -
రికార్డుల ర్యాలీ కొనసాగవచ్చు
ముంబై: స్టాక్మార్కెట్లో సూచీల ర్యాలీ ఈ వారంలోనూ కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధి ఊపందుకునేందుకు కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతామని ఆర్బీఐ పరపతి విధాన కమిటీ ప్రకటించింది. దేశీయ ఈక్విటీల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి బుల్లిష్ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు అంచనాలకు తగ్గట్లు క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అగ్ర రాజ్యం అమెరికా మార్కెట్లు ఆల్‌టైం హై స్థాయిల వద్ద కదలాడుతున్నాయి. ఈ సానుకూల పరిణామాల దృష్ట్యా రానున్న రోజుల్లో సూచీలు పరిమిత శ్రేణిలో ట్రేడవుతూ సరికొత్త రికార్డులను నమోదు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో గతవారంలో సూచీలు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1691 పాయింట్లు, నిఫ్టీ 16,238 పాయింట్లను ఆర్జించాయి. ఇక వారంలో క్యూ1 ఆర్థిక ఫలితాలు, జూన్ పారిశ్రామికోత్పత్తి, జూలై ద్రవ్యోల్బణ గణాంకాల(ఆగస్ట్ 12న విడుదల)తో పాటు ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చు. వర్షపాత నమోదు, కరోనా కేసులు, వ్యాక్సినేషన్ వార్తలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు మార్కెట్లకు కీలకంగా మారనున్నాయి. ‘‘మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ మరింతకాలం కొనసాగవచ్చు. పతనాన్ని కొనుగోళ్లకు అవకాశంగా భావించాలి. సాంకేతికంగా నిఫ్టీ 16,300 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16,500 – 16,600 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని పరీక్షిస్తుంది’’ అని దీన్ దయాళ్ ఇన్వెస్ట్మెంట్స్ సాంకేతిక నిపుణుడు మనీష్ హతిరామణి తెలిపారు. చివరి దశకు క్యూ1 ఫలితాలు... దేశీయ కార్పొరేట్ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన చివరి దశకు చేరుకుంది. ఈ వారంలో మొత్తం 1900 కంపెనీలు తమ క్యూ1 గణాంకాలను వెల్లడించున్నాయి. టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, భారత్ పెట్రోలియం, ఐషర్ మోటార్స్, శ్రీ సిమెంట్స్, ఎమ్ఆర్ఎఫ్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, మదర్సన్ సుమీ, పిడిలైట్, క్యాడిల్లా హెల్త్‌కేర్, ఎన్ఎండీసీ, ఓఎన్జీసీ, గ్రాసీం, ఇంద్రప్రస్థ, తదితర కంపెనీలు ఉన్నాయి. ఇటీవల ఐపీఓను పూర్తి చేసుకొని ఎక్సే్చంజీల్లో షేర్లను లిస్ట్ చేసిన జొమాటో, క్లీన్ సైన్స్ టెక్నాలజీ కంపెనీలు సైతం ఇదే వారంలో తమ క్వార్టర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. మారిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి గత కొంతకాలంగా భారత ఈక్విటీలను అమ్మేసిన విదేశీ ఇన్వెస్టర్లు తాజాగా కొనుగోళ్లు చేపట్టారు. ఈ ఆగస్ట్ నెల తొలి ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.1,210 కోట్ల షేర్లను కొన్నారు. ఈ జూలైలో రూ.7,273 కోట్ల షేర్లను విక్రయించారు. ‘‘దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలను సడలించాయి. కార్పొరేట్ క్యూ1 ఫలితాలు మెప్పిస్తున్నాయి. ఈ అంశాలన్నీ విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి’’ అని కోటక్ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణుడు శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. రోలెక్స్ రింగ్స్ లిస్టింగ్ నేడు... ఆటో ఉపకరణాల తయారీ సంస్థ రోలెక్స్ రింగ్స్ షేర్లు సోమవారం(ఆగస్ట్ 9న) ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఈ ఐపీఓ ఈ జూలై 28న మొదలై.., 30వ తేదీన ముగిసింది. షేరుకి రూ.900 గరిష్ట ధరతో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 731 కోట్లు సమకూర్చుకుంది. ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. చివరి రోజు నాటికి 130.43 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 56.85 లక్షల షేర్లను జారీ చేయగా.., ఏకంగా 74.15 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇష్యూ ధర రూ.900 తో పోలిస్తే గ్రే మార్కెట్లో రూ.450ల ప్రీమియం పలుకుతోంది. దీనిబట్టి ఇష్యూ లిస్టింగ్ రోజు లాభాల్ని పంచవచ్చని తెలుస్తోంది. -
సరికొత్త శిఖరానికి సెన్సెక్స్
ముంబై: ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడికి ముందు స్టాక్ మార్కెట్లో గురువారం సూచీలు సరికొత్త రికార్డులను లిఖించాయి. గత రెండురోజుల పాటు పరిమిత శ్రేణిలో ట్రేడైన సెన్సెక్స్, నిఫ్టీలు.., బ్యాంకింగ్, ఆర్థిక, మౌలిక రంగాల షేర్లు రాణించడంతో భారీ లాభాల్ని మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 383 పాయింట్లు లాభపడి 52,232 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు సూచీకి జీవితకాల గరిష్టస్థాయి. అంతకు ముందు సెన్సెక్స్‌కు (ఈ ఫిబ్రవరి 15న) జీవితకాల గరిష్ట ముగింపు స్థాయి 52,154 గా ఉంది. ఇక నిఫ్టీ 114 పాయింట్లు పెరిగి 15,690 వద్ద ముగిసింది. ఇంట్రాడే 130 పాయింట్లు లాభపడి 15,705 స్థాయిని తాకింది. ముగింపు, ఇంట్రాడే స్థాయిలు నిఫ్టీకి జీవితకాల గరిష్టాలు కావడ విశేషం. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. తిరిగి మిడ్‌సెషన్ నుంచి లాభాల్లోకి మళ్లాయి. అయితే ఫార్మా, ఆటో, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో బీఎస్ఈ స్మాల్ మిడ్‌క్యాప్ సూచీలు ఒక శాతానికి పైగా ర్యాలీ చేశాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మూడురోజుల నష్టాలకు ముగింపు పలుకుతూ 18 పైసలు బలపడి 72.91 వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1079 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.279 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. సూచీల రికార్డు ర్యాలీని తిరిగి అందుపుచ్చుకోవడంతో ఇన్వెస్టర్ల సంపద కూడా పెరిగింది. గురువారం ఒక్కరోజే రూ.1.88 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రికార్డు స్థాయి రూ.226 లక్షల కోట్లకు చేరింది. అమెరికా స్థూల ఆర్థిక గణాంకాల ప్రకటనకు ముందు అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. ఏడోరోజూ రిలయన్స్ షేరు ర్యాలీ... డైవర్సిఫైడ్ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ర్యాలీ ఏడోరోజూ కొనసాగింది. భారీ ఎత్తున నిధులను సమీకరించుకోవడంతో పాటు బ్యాలెన్స్ షీటును మరింత పటిష్టపరుచుకున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ ప్రకటనతో ఈ షేరుకు గురువారం డిమాండ్ పెరిగింది. బీఎస్ఈలో ఒక శాతం లాభంతో రూ.2222 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో రెండుశాతానికి పైగా రాణించి రూ.2250 స్థాయిని తాకింది. చివర్లో లాభాల స్వీకరణ జరగడంతో అరశాతం స్వల్పంగా పెరిగి రూ.2209 వద్ద ముగిసింది. ఈ ఏడు సెషన్లలో షేరు 14.53 శాతం ర్యాలీ చేసింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ రూ.1,423,883 కోట్లకు చేరుకుంది. -
నిఫ్టీ @ 15000
ముంబై: ట్రేడింగ్‌లో ఒడిదుడుకులకు లోనైన సూచీలు శుక్రవారం చివరికి లాభాలతోనే ముగిశాయి. ఇంట్రాడేలో 51 వేల స్థాయిని అందుకున్న సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 50,732 వద్ద స్థిరపడింది. అలాగే తొలిసారి 15000 స్థాయిని తాకిన నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 14,924 వద్ద నిలిచింది. సూచీలకిది అయిదో రోజు లాభాల ముగింపు. ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా, రియల్టీ, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆటో, ఐటీ, మీడియా, ప్రైవేట్ రంగ బ్యాంకు షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. వరుస ర్యాలీతో జోష్ మీదున్న సూచీలు ఉదయం లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్ 51 వేల స్థాయిని, నిఫ్టీ 15 వేల మార్క్‌ను అందుకున్నాయి. అనంతరం... ఊహించినట్లుగానే ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో సూచీల గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 508 పాయింట్ల రేంజ్లో 50,565 – 51,073 శ్రేణిలో కదలాడింది. నిఫ్టీ 150 పాయింట్ల పరిధిలో 14,865 – 15,015 స్థాయిలో ట్రేడైంది. ఈ వారంలో సెన్సెక్స్ 4446 పాయింట్లు, నిఫ్టీ 1289 పాయింట్లను ఆర్జించాయి. గతేడాది ఏప్రిల్ 10తో ముగిసిన వారం తర్వాత సూచీలు అత్యధికంగా లాభపడిన వారం ఇదే. ‘‘మంచి వ్యాల్యూమ్స్ మద్దతుతో మార్కెట్ పటిష్టమైన స్థితిలో ముగిసింది. నిఫ్టీకి 15,000 స్థాయి కీలక నిరోధంగా మారింది. ఇప్పటికీ బుల్లిష్ వైఖరినే కలిగి ఉన్నాము. త్వరలో నిఫ్టీ 15200 స్థాయికి చేరుకోవచ్చు. పతనమైన ప్రతిసారి కొనుగోలు చేసే వ్యూహాన్ని అమలు చేస్తే మంచింది.’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ నిపుణుడు రుస్మిక్ ఓజా సలహానిస్తున్నారు. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► డిసెంబర్ క్వార్టర్లో ఆస్తుల నాణ్యత మెరుగుపడిందని ఎస్బీఐ ప్రకటించడంతో ఈ బ్యాంకు షేరు 11% లాభంతో రూ.393 వద్ద ముగిసింది. ► ఫిబ్రవరి 11న జరిగే బోర్డు సమావేశంలో మధ్యంతర డివిడెండ్ ప్రకటనపై చర్చిస్తామని ఐటీసీ ఎక్సే్చంజ్‌లకు సమాచారం ఇవ్వడంతో కంపెనీ షేరు రెండు శాతం లాభపడింది. ► క్యూ3 లో మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో బజాజ్ ఎలక్ట్రానిక్స్ షేరు 20% లాభపడింది. -
ఒడిదుడుకుల ట్రేడింగ్..!
స్టాక్ మార్కెట్ ఈ వారంలో ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం ఎక్స్ఛేంజీలకు సెలవు కావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగుతుంది. ఆర్థిక, ఆటో విక్రయ గణాంకాల పాటు ఇదే వారంలో జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధి వార్తలపై ఇన్వెస్టర్లు దృష్టిని సారించనున్నారు. గత వారాంతాన విడుదలైన దేశ క్యూ2(జూలై– సెప్టెంబర్)జీడీపీ గణాంకాలు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. దేశీయ మార్కెట్లోకి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు)పెట్టుబడుల పరంపర కొనసాగడం, అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బిడైన్ పాలన దిశగా అడుగులు వేయడం లాంటి అంశాలతో గతవారం సెన్సెక్స్ 267 పాయింట్లను, నిఫ్టీ 110 పాయింట్లు ఆర్జించిన సంగతి తెలిసిందే. తగిన స్థాయిలో వాహన విక్రయాలు దేశీయ ఆటో కంపెనీలు మంగళవారం తమ నవంబర్ నెల వాహన విక్రయ గణాంకాలను విడుదల చేయనున్నాయి. దీంతో ఈ వారంలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఆశోక్ లేలాండ్, ఐషర్ మోటర్స్, హీరో మోటోకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎస్కార్ట్స్ లాంటి ఆటో కంపెనీల షేర్లు అధిక పరిమాణంతో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. పండుగ సీజన్‌తో ప్యాసింజర్ వాహన విక్రయాల్లో వృద్ధి కనబడే అవకాశం ఉందని, వ్యవస్థలో రికవరీతో వాణిజ్య వాహన అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉండొచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో మెరుగైన వర్షాలతో ట్రాక్టర్ అమ్మకాలు పెరిగి ఉండొచ్చని, ద్వి – చక్ర వాహన విభాగపు అమ్మకాల్లో మాత్రం ఫ్లాట్ లేదా స్వల్ప క్షీణత నమోదు కావచ్చని వారంటున్నారు. పాలసీ సందర్భంగా జాగరూకత! ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మానిటరీ పాలసీ సమావేశం డిసెంబర్ 2న (బుధవారం) ప్రారంభమవుతుంది. కమిటీ డిసెంబర్ 4న(శుక్రవారం)తన నిర్ణయాలు ప్రకటించనుంది. మూడురోజుల పాటు జరిగే ఈ సమావేశ నిర్ణయాలు స్టాక్ మార్కెట్‌కు ఎంతో కీలకం కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. వ్యవస్థలో అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో సర్దుబాటు ద్రవ్య విధానానికి కట్టుబడుతూ పాలసీ కమిటీ కీలక వడ్డీరేట్లలో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 4 శాతం గానూ, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉన్నాయి. అండగా ఎఫ్ఐఐల పెట్టుబడులు.. ఈ నవంబర్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) రూ. 65,317 కోట్ల విలువైన దేశీయ ఈక్విటీలను కొన్నారు. గత రెండు దశాబ్దాలలోనే నవంబర్ పెట్టుబడుల్లో ఇది అత్యధికమని గణాంకాలు చెబుతున్నాయి. ఇది దేశీయంగా ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చే అంశమని నిపుణులంటున్నారు. అమెరికా, యూరప్ దేశాల కేంద్ర బ్యాంకుల మానిటరీ పాలసీ సమావేశాల నేపథ్యంలో ఎఫ్ఐఐలు స్వల్పకాలం పాటు దేశీయ మార్కెట్లోకి తమ పెట్టుబడులను తగ్గించుకోవచ్చని అంటున్నారు. అయితే దీర్ఘకాలం దృష్ట్యా భారత మార్కెట్ల పట్ల ఎఫ్ఐఐలు బుల్లిష్‌గానే ఉన్నట్లు నిఫుణులంటున్నారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం... ఈ వారంలో అమెరికా, ఐరోపా, చైనాతో జపాన్ దేశాలు నవంబర్ నెల పీఎంఐ గణాంకాలను విడుదల చేయనున్నాయి. వారాంతపు రోజున యూఎస్ నిరుద్యోగ గణాంకాలు, యూరప్ దేశాల అక్టోబర్ రిటైల్ విక్రయ గణాంకాలు వెల్లడికానున్నాయి. అలాగే ఓపెక్ సమావేశం కూడా నవంబర్ 30న ప్రారంభమై, డిసెంబర్ 1న ముగుస్తుంది. వ్యాక్సిన్ ఆశలతో నవంబర్‌లో క్రూడాయిల్ ధరలు 28 శాతం పెరిగాయి. దీంతో ఓపెక్ క్రూడ్ ధరలను పెంచదని నిపుణులు భావిస్తున్నారు. బుధవారం బర్గర్ కింగ్ ఐపీఓ ప్రారంభం... ప్రముఖ చెయిన్ రెస్టారెంట్ల సంస్థ బర్గర్ కింగ్ ఐపీఓ డిసెంబర్ 2 న ప్రారంభమై డిసెంబర్ 4 న ముగియనుంది. ఐపీఓకు ధరల శ్రేణి రూ.59 – 60 గా నిర్ణయించారు. ఇష్యూ ద్వారా కంపెనీ రూ.810 కోట్లను సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 450 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ప్రమోటర్ల వాటాలో క్యూఎస్ఆర్ ఆసియా పీటీఈ లిమిటెడ్ 6 కోట్ల షేర్లను అమ్మనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 250 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఐపీఓ అనంతరం డిసెంబర్ 14న షేర్లను ఎక్చ్సేంజీల్లో లిస్ట్ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది(2020)లో బర్గర్ కింగ్ ఐపీఓ 14వది. గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు. మంగళవారం నాడు స్టాక్ మార్కెట్ యధావిధిగా పనిచేస్తుంది. -
రెపో షాక్: ఆ రుణాలు ఇక భారమే
సాక్షి,ముంబై: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ సమీక్షలో బుధవారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. గత నాలుగేళ్లలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తొలిసారి రెపో రేటును పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. అలాగే 2016 జూన్ లో మానిటరీ పాలసీ ఏర్పడినప్పటి నుంచీ రెపో రేటుపెంచడం ఇదే మొదటిసారి. రెపో రేట్‌ను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచి దీన్ని 6.25 శాతంగా నిర్ణయించింది. దీనితోపాటు రివర్స్ రెపోను సైతం 0.25 శాతం పెంచి 6 శాతానికి చేర్చింది. ఆర్బీఐ ఎంపిసి సభ్యులందరూ రేట్ల పెంపునకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో సామాన్య వినియోగదారుడి నెత్తిన రుణ పిడుగు పడగనుంది. కీలక వడ్డీ రేట్ల పెంపుతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత భారం కానున్నాయి. సాధారణ రెండు రోజులకు బదులుగా ఈసారి మూడు రోజులపాటు ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్ల పెంపునకే మొగ్గు చూపింది. ముడి చమురు ధరల పెరుగుదల, సీపీఐ బలపడుతుండటం వంటి ప్రతికూల అంశాల నడుమ పావు శాతం రెపో రేటు పెంపునకు నిర్ణయించామని ఉర్జిత్ ప్రకటించారు. ఈ బెంచ్‌మార్క్ రేట్లను చివరిసారి జనవరి 2014 లో పెంచారు. రిపో రేటు పెరుగుదల బ్యాంకుల నుంచి రుణాలను తీసునేవారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. రెపో రేటు పెంపుతో ఆయా బ్యాంకులు రుణాలపై వడ్డీ పెంచడం ఖాయం. ముఖ్యంగా గృహ రుణ, కారు లేదా, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటును పెంచుతాయి. రెపో, రివర్స్ రెపో రేటు అంటే? ఆర్బీఐనుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీరేటు రెపో రేటు. బ్యాంకులు స్వల్పకాలానికి రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేసే నిధులకు అందుకునే వడ్డీ రివర్స్ రెపో. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ నెలవారీ ద్రవ్య విధాన సమీక్షకు కొద్ది రోజుల ముందే దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఐసిఐసిఐ బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకులు ఇప్పటికే రుణాలపై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచేసిన సంగతి తెలిసిందే. ఇది ఆరంభం మాత్రమే ఇది ఇలా ఉంటే ఆర్బీఐ కీలక వడ్డీ రేటు పెంపు క్రమంలో ఇది ఆరంభమని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎంపీసీ ప్రకటనకు ముందే రెపో రేటు పెంపును హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ అంచనా వేసింది. అంతేకాదు 2018 ఆర్థిక సంవత్సరంలో రివర్స్, రెపో రేట్లపై 25 బేసిస్ పాయింట్లు పెంపు రెండుసార్లు వుంటుందని ఉంటుందని పేర్కొంది. ఇదే అభిప్రాయాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా ట్విటర్లో వెల్లడించింది. -
నాలుగేళ్లలో తొలిసారి రెపో రేటు పెంపు
ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రెపో రేటుపై కీలక నిర్ణయం ప్రకటించింది. నాలుగేళ్లలో తొలిసారి రెపోను పావు శాతం పెంచుతున్నట్టు ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష కమిటీ తెలిపింది. దీంతో రెపో రేటు 6 శాతం నుంచి 6.25 శాతానికి పెరిగింది. మరోవైపు రివర్స్ రెపోను సైతం పావు శాతం పెంచింది. దీంతో రివర్స్ రెపో 5.75 శాతం నుంచి 6 శాతంగా ఉండనుంది రూపాయి క్షీణత, ద్రవ్యోల్బణం పెంపు భయాలు, ముడిచమురు ధరలు ర్యాలీతో ఆర్బీఐ ఎంపీసీ రేటు పెంపుకే మొగ్గు చూపింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ఎంపీసీ మూడు రోజుల క్రితమే ఈ పాలసీ సమావేశాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నేడు ఈ కీలక రేటుపై ఎంపీసీ నిర్ణయం ప్రకటించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. రేటు పెంపును ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్టు తెలిసింది. ఈ సారి పాలసీలో రెపో పెంపు పావు శాతం ఉంటుందని ముందస్తుగానే మార్కెట్ విశ్లేషకులు అంచనావేశారు. మార్కెట్లు అంచనావేసిన విధంగానే రెపో రేటును ప్రకటించడంతో మార్కెట్లు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు పైన 35,111 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంలో 10,653 వద్ద కొనసాగుతున్నాయి. -
లాభాలతో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు
ముంబై : మార్కెట్ విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు ముందుగా ఊహించిన మాదిరిగానే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా నిర్ణయం వెలువరించడంతో, మార్కెట్లలో ఎలాంటి కదలికలు కనిపించలేదు. సాధారణంగానే సెన్సెక్స్, నిఫ్టీలు కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 82.99 పాయింట్ల లాభంతో, 26,860 వద్ద, నిఫ్టీ 24.65 లాభంతో 8,225 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నేడు జరిగిన ద్రవ్యవిధాన పరపతి సమీక్షలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ రెపోను 6.50శాతం, సీఆర్ఆర్ 4 శాతంగానే ఉంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజన్ నిర్ణయం స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. కేవలం భవిష్యత్ లో రేట్లు ఎలా ఉండబోతున్నాయో అనే ప్రకటనపైనే దలాల్ స్ట్రీట్ దృష్టిసారించింది. ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్ యూఎల్, హీరో మోటార్ కార్పొరేషన్, ఓఎన్ జీసీ మార్కెట్లో లాభాలను పండిస్తుండగా.. యాక్సిస్ బ్యాంకు, అదానీ పోర్ట్స్, హెచ్ డీఎఫ్ సీ, లుపిన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నష్టాల్లో నడుస్తున్నాయి. మరోవైపు పసిడి, వెండి ధరలు నష్టాల బాట పట్టాయి. పసిడి ధర రూ.65నష్టపోతూ రూ.29385 వద్ద, సిల్వర్ రూ.108 నష్టంతో రూ.39,034వద్ద నమోదవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.84గా ఉంది. -
కొంచెం ఊరట !
ముంబై: గతానికి భిన్నంగా... మార్కెట్ అంచనాలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడ్డాయి. పాలసీరేట్లలో ఎటువంటి మార్పులూ జరగలేదు. దీనితో గృహ, కారు వంటి వాటిపై బ్యాంకింగ్ రుణ వినియోగదారుడిపై నెలసరి వాయిదా చెల్లింపు(ఈఎంఐ)ల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకునే అవకాశం లేదు. మార్కెట్ అంచనాలకు భిన్నమైన నిర్ణయాలను గత రెండు పాలసీ సమీక్షల్లో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు. ఈ దఫా ద్రవ్యోల్బణం పెరుగుదల వాతావరణం నెలకొని ఉండడమే రేట్లు తగ్గించకపోవడానికి కారణమని ఆర్బీఐ సూచించింది. అయితే తగ్గుదల ధోరణి కొనసాగినంతకాలం రేట్ల పెంపునకు కూడా అవకాశం ఉండదని పేర్కొంది. వెరసి మొదటి ద్వైమాసిక పరపతి సమీక్ష సందర్భంగా రెపో రేటు ప్రస్తుత 8% వద్ద, సీఆర్ఆర్ 4% వద్ద యథాతథంగా కొనసాగనున్నాయి. పరపతి విధాన సమీక్షలో ముఖ్యాంశాలు... స్వల్పకాలిక రుణ(రెపో-బ్యాంకులకిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ) రేటు యథాతథం. రెపో ప్రస్తుతం 8%గా ఉంది. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నిర్దిష్ట మొత్తానికి సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)లో సైతం మార్పు లేదు. ఇది 4 శాతంగా కొనసాగనుంది. {దవ్యోల్బణం తగ్గుదల ధోరణి కొనసాగుతున్నంతకాలం రేటులో ఎటువంటి పెంపూ ఉండబోదు. 2014-15లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు అంచనా స్వల్పంగా 5.6 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గింపు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్- క్యాపిటల్ ఫ్లోస్ అంటే ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీల మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య ఉన్న నికర వ్యత్యాసం) సైతం జీడీపీలో 2 శాతంగా ఉండే అవకాశం ఉంది. 2014లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉంటుందని అంచనా. బ్యాంకింగ్ విలీనాలకు ద్వారాలు. అయితే ఈ విషయంలో పోటీ, స్థిరత్వం అంశాల్లో రాజీ ప్రశ్నే ఉండబోదు. బ్యాంకుల విలీనం వల్ల మరింత విలువ సృష్టి జరిగే అవకాశం ఉంది. 7 రోజులు, 14 రోజుల రెపో పరిమితులను 0.50 శాతం నుంచి 0.75 శాతానికి పెంచడం జరిగింది. ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) పెరుగుదల అవసరాలకు ఈ అంశాలు దోహదపడతాయి. తదుపరి పాలసీ 0సమీక్ష జూన్3న జరుగుతుంది. కనీస బ్యాలెన్స్ లేకుంటే జరిమానాలొద్దు.. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిబంధనలను పాటించని కస్టమర్లపై జరిమానానాలు విధించరాదని బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. ఏదైనా సమస్యల వల్ల ఖాతాదారులు ఈ నిబంధన పాటించ లేకపోతుండవచ్చని, అంతమాత్రం చేత బ్యాంకులు దీన్నుంచి అనుచిత లబ్ది పొందాలని చూడకూడదని ఆయన పేర్కొన్నారు. కనీస బ్యాలెన్స్ పాటించని బేసిక్ సేవింగ్స్ ఖాతాలపై జరిమానాలు విధించడం కాకుండా...అవసరమైతే కొన్ని సర్వీసులను కుదించాలని రాజన్ సూచించారు. మళ్లీ ఖాతాలో బ్యాలెన్స్ నిర్దేశిత స్థాయికి వచ్చిన తర్వాత ఆయా సేవలను పునరుద్ధరించవచ్చని తెలిపారు. అలాగే, నిర్వహణలో లేని ఖాతాల విషయంలో కూడా మినిమం బ్యాలెన్స్ లేని వాటిపై పెనాల్టీ విధించొద్దని రాజన్ చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగానికి చెందిన ఎస్బీఐ.. కనీస బ్యాలెన్స్ లేని ఖాతాలపై ఎటువంటి పెనాల్టీలూ విధించడం లేదు. అయితే, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటివి మాత్రం త్రైమాసికానికి రూ. 750 మేర చార్జీలు విధిస్తున్నాయి. ఈ తరహా బ్యాంకులకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో మూణ్నెల్లకు రూ. 10,000, ఓ మాదిరి పట్టణ ప్రాంతాల్లో రూ. 5,000 కనీస బ్యాలెన్స్ పాటించాల్సి ఉంటోంది. మరోవైపు, చలన వడ్డీ రేటుపై రుణాలను ముందస్తుగా చెల్లించాలనుకునే వారిపై కూడా ఎలాంటి పెనాల్టీ విధించకుండా ఉండేలా చూసే అంశాన్ని కూడా బ్యాంకులు పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. వడ్డీరేట్లు తగ్గిస్తేనే వృద్ధికి చేయూత: పరిశ్రమలు వృద్ధి రేటు పెరగడానికి వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గించాల్సిందేనని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. ద్రవ్యోల్బణం దిగివస్తున్న ధోరణిని పాలసీ రేట్లను తగ్గించడానికి అవకాశంగా ఆర్బీఐ తీసుకుంటే బాగుండేదని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. ఇలాంటి నిర్ణయం వల్ల పెట్టుబడుల పునరుత్తేజానికి అవకాశం ఉంటుందని అన్నారు. కేవలం పరపతి విధానంపై ఆధారపడి ద్రవ్యోల్బణం కట్టడి అసాధ్యమన్నది తమ అభిప్రాయమని ఫిక్కీ అధ్యక్షుడు సిద్దార్థ్ బిర్లా అన్నారు. దీనికి పాలనా పరమైన చర్యలు కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు. పాలసీ రేటు తగ్గితే ఇన్వెస్టర్ సెంటిమెంట్ మెరుగుపడే అవకాశం ఉంటుందని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ యథాతథ విధానం పారిశ్రామిక వృద్ధికి నిరుత్సాహకరమేనని, నిధుల కోసం అధికంగా వ్యయపర్చాల్సివుంటుందని పీహెచ్డీ చాంబర్ ప్రెసిడెంట్ శరద్ జైపూరియా అన్నారు. వడ్డీరేట్లలో మార్పుండదు: బ్యాంకర్లు ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో వడ్డీరేట్లలో ఎటువంటి మార్పూ ఉండకపోవచ్చని బ్యాంకర్లు పేర్కొన్నారు. దీనివల్ల వినియోగదారు నెలవారీ చెల్లింపులపై(ఈఎంఐలు) తక్షణం ఎటువంటి ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. వడ్డీరేట్ల విషయంలో మరికొంతకాలం ప్రస్తుత పరిస్థితే కొనసాగే అవకాశం ఉందని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ కేఆర్ కామత్ వ్యాఖ్యానించారు .రియల్టీ హర్షం... కాగా వడ్డీరేట్లు తగ్గించకపోయినా, పెంచకపోవడమూ ఒక సానుకూల అంశమేనని రియల్టర్ల సంస్థ క్రెడాయ్ పేర్కొంది. వడ్డీరేట్లు అధిక స్థాయిలో ఉన్నాయని, భవిష్యత్తులో ఇవి తగ్గడానికే అవకాశం ఉందని పాలసీ సంకేతాలు ఇస్తోందని భారత రియల్డీ డెవలపర్ల సంఘం (క్రెడాయ్) చైర్మన్ లలిత్ కుమార్ జైన్ అన్నారు. యథాతథం... తప్పదు: రాజన్ ప్రస్తుత పరిస్థితుల్లో పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించక తప్పదని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. గత యేడాది సెప్టెంబర్, అలాగే 2014 జనవరి మధ్య రేట్ల పెంపు నిర్ణయం ఆర్థిక వ్యవస్థలో తన లక్ష్యాలను నెరవేరుస్తోందని రాజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆహారం, ఇంధనాలను మినహాయిస్తే, రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 8 శాతంగానే కొనసాగుతోందని ఆయన అన్నారు. డిమాండ్ ఇంకా అధిక స్థాయి వద్దే వున్న అంశాన్ని ఈ పరిస్థితి ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. అయితే ద్రవ్యోల్బణం 2015 జనవరి నాటికి 8 శాతం, అటుపై యేడాది 6 శాతం దిశగా కొనసాగుతుంటే మాత్రం రెపోరేటును పెంచబోమని గవర్నర్ స్పష్టం చేశారు. వృద్ధి సామర్థ ్యం 6 శాతం కంటే తక్కువే... పాలసీ సమీక్ష నేపథ్యంలో ఆర్బీఐ స్థూల ఆర్థిక వ్యవస్థ, పరపతి పరిణామాలపై ఒక నివేదికను సైతం ఆవిష్కరించింది. భారత్ వృద్ధి సామర్థ్యం ప్రస్తుత పరిస్థితుల్లో 6 శాతంకన్నా తక్కువేనని ఈ నివేదికలో పేర్కొంది. ఈ మేరకు ఇంతక్రితం 8 శాతం అంచనాలను సవరించింది. ఫైనాన్షియల్ పొదుపులు, పెట్టుబడులు తగ్గుతుండడం, అధిక ద్రవ్యోల్బణం, దిగువ స్థాయిలో వాణిజ్య విశ్వాసం వంటి అంశాలను ఈ సందర్భంగా నివేదిక ప్రస్తావించింది. -
బాదుడుకు బ్రేక్..!
ముంబై: ఆర్బీఐ బుధవారం చేపట్టిన మధ్యంతర త్రైమాసిక పాలసీ సమీక్షలో ఆర్బీఐ కాస్త ఉదారంగా వ్యవహరించింది. కీలకమైన రెపో రేటు(ఆర్బీఐ వద్దనుంచి తీసుకునే స్వల్పకాలిక నిధులపై బ్యాంకులు చెల్లించే వడ్డీ)ను యథాతథంగా 7.75 శాతంగానే వదిలేసింది. అదేవిధంగా నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్-బ్యాంకుల వద్ద నున్న డిపాజిట్ నిధుల్లో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన మొత్తం-దీనిపై ఎలాంటి వడ్డీ లభించదు)ని ఇప్పుడున్న 4% వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. కాగా, రివర్స్ రెపో(బ్యాంకులు ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసే నిధులపై ఆర్బీఐ చెల్లించే వడ్డీ) 6.75%గా ప్రస్తుత స్థాయిలోనే ఉంటుంది. ఇక మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్-8.75%) ఎలాంటి మార్పూ లేదు. కాగా, తదుపరి మూడో త్రైమాసిక పాలసీ సమీక్ష జనవరి 28న జరగనుంది. అంతా అవాక్కు...! అటు టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం, ఇటు రిటైల్ ద్రవ్యోల్బణం కూడా చుక్కలు చూపిస్తుండటంతో ఆర్బీఐ మరోవిడత రేట్లను పెంచుతుందని విశ్లేషకులు, నిపుణులు అంచనాలు వేశారు. పావు శాతం పెంచొచ్చని అత్యధికులు అభిప్రాయపడ్డారు. కొంతమంది అర శాతం పెంపును కూడా కొట్టిపారేయలేమన్నారు. అయితే, రాజన్ మాత్రం ఎక్కడి రేట్లు అక్కడే ఉంచుతూ మార్కెట్ వర్గాలు, విశ్లేషకులను అవాక్కయ్యేలా చేశారు. సెప్టెంబర్‌లో ఆర్బీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రాజన్... వరుసగా రెండు సమీక్షల్లో కూడా పావు శాతం చొప్పున రెపో రేటును పెంచడం తెలిసిందే. కాగా, నవంబర్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టానికి(7.52%), రిటైల్ ద్రవ్యోల్బణం 9 నెలల గరిష్టానికి(11.24%) ఎగబాకడం విదితమే. దీంతో ఆర్బీఐ కచ్చితంగా పాలసీ రేట్లను మరోసారి పెంచుతుందనే అంచనాలు వెల్లువెత్తాయి. మరోపక్క, అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి తిరోగమన బాటలోకి జారి మైనస్ 1.8 శాతానికి కుంగడంతో కార్పొరేట్లు వడ్డీరేట్ల తగ్గింపు డిమాండ్లు జోరందుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ పాలసీ యథాతథంగా కొనసాగడం గమనార్హం. పసిడి నియంత్రణలపై... కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)ను తగ్గించేందుకుగాను బంగారం దిగుమతులపై విధించిన నియంత్రణలను ఎత్తివేసేందుకు సుముఖమేనని... అయితే, ఇది సరైన సమయం కాదని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. దీనికి ఇంకా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్బీఐ, ప్రభుత్వ చర్యల ప్రభావంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(2013-14, క్యూ2)లో క్యాడ్ 1.2 శాతానికి దిగొచ్చిన సంగతి తెలిసిందే. క్యూ1లో ఇది 4.9 శాతంగా ఉంది. క్రితం ఏడాదిలో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టాన్ని(4.8%) తాకడం తెలిసిందే. మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికిపోయే విదేశీ మారక నిధుల మధ్య వ్యత్యాసమే క్యాడ్. త్వరలో ధరల ఆధారిత పొదుపు పత్రం వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణానికి అనుసంధానమైన ‘పొదుపు పత్రాన్ని’ ఈ నెలాఖరుకల్లా ఆర్బీఐ ఆవిష్కరించనుంది. సీపీఐ వార్షిక సగటుకన్నా 1.5% అధికంగా ఈ ప్రొడక్ట్‌పై వడ్డీరేటు ఉంటుందని రాజన్ తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో డిపాజిట్ చేసిన సొమ్ముకు నిర్దిష్ట టర్మ్ తర్వాత తగిన రిటర్న్స్ రాకపోగా, నెగిటివ్ రాబ డులు నమోదవుతున్న నేపథ్యంలో తాజా పథకానికి ఆర్బీఐ రూపకల్పన చేసింది. ద్రవ్యోల్బణం సూచీ అ నుసంధాన పత్రం(ఐఐఎస్సీ)గా ఇది విడుదలవుతోం ది. పెట్టుబడులు, పొదుపు కోణంలో ద్రవ్యోల్బణం స వాళ్లను అధిగమించడానికి ఆర్బీఐ అంతక్రితం ప్రారంభించిన ఐఐబీ(ఇన్ఫ్లేషన్ ఇండెక్డ్స్ బాండ్లు) తర్వాత, ప్రతిపాదిత పొదుపు పత్రాలు కొత్త సిరీస్‌లోకి వస్తాయి. ఎప్పుడైనా పెంచుతాం: రాజన్ ఆహార, ఇంధన ద్రవ్యోల్బణం గనుక దిగొస్తున్న సంకేతాలు వెలువడకపోతే... పాలసీ తేదీతో సంబంధం లేకుండా ఆర్బీఐ రేట్ల పెంపు ఇతరత్రా చర్యలను తీసుకుంటుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం చాలా అధికస్థాయిలో ఉంది. మరోపక్క ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పాలసీ చర్యల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాం. అనిశ్చిత పరిస్థితులు తొలగేందుకు మరింత డేటా కోసం వేచిచూడటం వల్ల కొన్ని సానుకూలతలు ఉన్నాయి. మరోపక్క, దీనివల్ల కొన్ని రిస్క్‌లూ లేకపోలేదు. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల ఉపసంహరణను మొదలుపెడితే... వర్ధమాన మార్కెట్లపై తీవ్ర ప్రభావంచూపే అవకాశం ఉంటుంది. దీంతో ద్రవ్యోల్బణంపై పోరు విషయంలో కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొనే ఆర్బీఐ మరింత అప్రమత్తంగా వ్యవహరించనుంది. చాన్నాళ్లుగా ఆర్థిక వ్యవస్థ బలహీన ధోరణిలో ఉండటం వల్లే.. ద్రవ్యోల్బణం కంటే వృద్ధిరేటుకు తోడ్పాటు దిశగా తాజా పాలసీలో ప్రధానంగా దృష్టిపెట్టాల్సి వచ్చింది. కాగా, వ్యవసాయ రంగం మెరుగైన వృద్ధి, ఎగుమతుల మెరుగుదల, జాప్యాలతో నిలిచిపోయిన ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుండటంతో ఈ ఏడాది ద్వితీయార్ధంలో వృద్ధి రేటు పుంజుకునే అవకాశాలున్నాయి. స్వాగతించిన కార్పొరేట్లు... వడ్డీరేట్లను పెంచకుండా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని కార్పొరేట్లు స్వాగతించారు. ‘సమీక్షలో ఆర్బీఐ దూరదృష్టిని కనబరిచింది. వృద్ధి-ద్రవ్యోల్బణం అంశాలను ఎదుర్కోవడానికి సమన్వయంతో వ్యవహరించింది’ అని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ‘పారిశ్రామిక రంగం చాలా దుర్భర పరిస్థితుల్లో ఉందన్న విషయాన్ని ఆర్బీఐ ఎట్టకేలకు గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉంది. తదుపరి సమీక్షలో వడ్డీరేట్ల తగ్గింపు దిశగా చర్యలు ఉండొచ్చని భావిస్తున్నాం’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనా లాల్ కిద్వాయ్ పేర్కొన్నారు. తగినంత లిక్విడిటీ వ్యవస్థలో ఉన్నందున బ్యాంకులు రుణ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. పెట్టుబడులకు చేయూతనివ్వాలని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ అభిప్రాయపడ్డారు. రుణ, డిపాజిట్ రేట్లు తగ్గవు: బ్యాంకర్లు ఆర్బీఐ ఆశ్చర్యకరమైన నిర్ణయం నేపథ్యంలో తాము రుణ, డిపాజిట్ రేట్లను తగ్గించే అవకాశాల్లేవని బ్యాంకర్లు పేర్కొన్నారు. అయితే, దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఇది దోహదపడుతుందని ఆర్బీఐ చర్యలను ఆహ్వానించారు. ఎవరేమన్నారంటే... డిపాజిట్ రేట్లను తగ్గించే యోచనేదీ లేదు. ఇది వారిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. జూలై 15 నాటితో పోలిస్తే మా డిపాజిట్లు రేట్లు చాలా అధికస్థాయిలోనే ఉన్నప్పటికీ.. తక్షణం వీటిని తగ్గించే అవకాశాల్లేవు. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్మన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రుణ, డిపాజిట్ రేట్లను తగ్గించేందుకు చాన్స్ లేదు. ద్రవ్యోల్బణం చాలా అధికస్థాయిలో ఉండటమే దీనికి కారణం. అయితే, బల్క్ డిపాజిట్ రేట్లను తగ్గించే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం’ - విజయలక్ష్మి ఆర్. అయ్యర్,బీఓఐ చైర్పర్సన్ రానున్న కాలంలో టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం మరింత ఎగబాకే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న దృక్పథంతోనే ఆర్బీఐ పాలసీని యథాతథంగా కొనసాగించింది’ - ఎం. నరేంద్ర,ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఎండీ కీలక పాలసీ రేట్లలో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయకపోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. కొనసాగుతున్న వృద్ధి మందగమనం ధోరణి, రానున్న రోజుల్లో ఆహార ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశాలను దృష్టిలోపెట్టుకొనే ఆర్బీఐ ఈ విధంగా వ్యవహరించింది. ఆర్థిక రికవరీకి ఇది తోడ్పడుతుంది’ - చందా కొచర్,ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ