gpf
-
చెట్ల ట్రాన్స్లోకేషన్పై విధాన నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: చెట్లను కొట్టేయకుండా, వాటిని వేళ్లతో సహా పెకిలించి మరో చోట నాటే ప్రక్రియ (ట్రాన్స్‌లొకేషన్)కు ప్రాధాన్యతనివ్వాలని, దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్‌లొకేషన్‌కు అవసరమైన యంత్రాలు ఖరీదైనవే అయినప్పటికీ, అవి లేవని చెప్పొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు, నిర్వహణ తదితరాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా చెట్లను విచక్షణారహితంగా కొట్టేస్తుండటంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. చెట్ల నరికివేత పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించిందని తెలిపింది. చెట్ల నరికివేతను గణనీయంగా తగ్గించడంతో పాటు ట్రాన్స్‌లొకేషన్ అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందో సలహాలు ఇచ్చేందుకు ఓ కమిటీని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని హైకోర్టు ఆదేశించింది.ఈ కమిటీలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు, పర్యావరణ నిపుణులను సభ్యులుగా నియమించాలని ఆదేశించింది. ఆ కమిటీ సలహాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. మూడు నెలల్లో పూర్తి వివరాలతో స్పందనను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 12కి వాయిదా వేసింది. ఇదే వ్యవహారంలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) దాఖలు చేసిన కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకుంది. ట్రాన్స్‌లొకేషన్ కోసం పిల్... రోడ్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు తదితరాల పేరుతో భారీ చెట్లను విచక్షణారహితంగా కొట్టేస్తున్నారని, చెట్లను కొట్టేయకుండా వాటిని మరో చోట నాటేలా ఆదేశాలు ఇవ్వాలంటూ గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థి అస్మద్ మహ్మద్ షేక్ షా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు వచ్చిoది. పిటిషనర్ తరఫు న్యాయవాది బషీర్ అహ్మద్ వాదనలు వినిపిస్తూ.. చాలా రాష్ట్రాల్లో చెట్లను నరికేయకుండా వాటిని మరో చోట నాటుతున్నారని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాలకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి, మరో చోట విజయవంతంగా నాటారని తెలిపారు. ఇందుకోసం హైకోర్టులో ఓ సంస్థ పనిచేస్తోందని వివరించారు. జీపీఎఫ్, ఈపీఎఫ్ దేనిని ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం » ఫలానా స్కీంను వర్తింపజేయాలని కోర్టులు ఆదేశించలేవు »ఉద్యోగులు జీపీఎఫ్ కోరుతున్నందున దానిపై నిర్ణయం తీసుకోండి » ఆర్థిక, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులకు హైకోర్టు ఆదేశం సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్ స్కీం లేదా జీపీఎఫ్ స్కీంలలో దేనిని వర్తింపజేయాలన్నది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని హైకోర్టు తేల్చి చెప్పింది. నిర్దిష్టంగా ఫలానా స్కీంను వర్తింపజేయాలని న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని ఆదేశించలేవని స్పష్టం చేసింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) స్కీం వర్తింపజేయాలంటూ పలువురు విద్యుత్ ఉద్యోగులు అభ్యర్థనలు పెట్టుకున్న నేపథ్యంలో దీనిపై మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. తమకు పాత పెన్షన్ స్కీం అయిన జీపీఎఫ్‌ను వర్తింపజేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థల్లో (డిస్కం) పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు ఉద్యోగులు, ప్రస్తుతం సర్వీసులో ఉన్న కొందరు ఉద్యోగులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సుబ్బారెడ్డి శుక్రవారం విచారణ జరిపారు. ఉద్యోగుల తరఫున న్యాయవాది పీటా రామన్ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం 2023లో జారీ చేసిన మెమోరాండం ప్రకారం పిటిషనర్లందరూ జీపీఎఫ్‌కు అర్హులని చెప్పారు. జీపీఎఫ్ కోసం పిటిషనర్లు పై అధికారులకు వినతులు ఇచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇది ఆర్థికపరమైన అంశమని, దీనికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని డిస్కంలు, ఆరి్థక, ఇంధన శాఖల న్యాయవాదులు వాదనలు చెప్పారు. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని చెప్పారు. -
విద్యుత్‌సౌధ అష్టదిగ్బంధనం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్‌సౌధను ఉద్యోగులు అష్టదిగ్బంధనం చేశారు. వేతన సవరణ, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఆర్టిజన్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చలో విద్యుత్‌సౌధ కార్యక్రమానికి 24 సంఘాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్(టీఎస్పీఈ జేఏసీ) కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జేఏసీ పిలుపు మేరకు గ్రేటర్ హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, ఆర్టీజన్ కార్మి కులు ఉదయం పదిగంటలకే పెద్దసంఖ్యలో సోమాజిగూడలోని విద్యుత్‌సౌధకు చేరుకున్నారు. అనుకున్న దానికంటే అధిక సంఖ్యలో తరలిరావడంతో విద్యుత్‌సౌధ ప్రాంగణమంతా నిండిపోయింది. మిగిలినవాళ్లంతా ప్రధాన కార్యాలయం ముందున్న రహదారిపైనే నిలబడాల్సి వచ్చింది. దీంతో ఇటు ఖైరతాబాద్ చౌరస్తా నుంచి అటు పంజగుట్ట వరకు రోడ్డంతా విద్యుత్ కార్మి కులతో నిండిపోయింది. ట్రాఫిక్ మళ్లింపు.. ఎక్కడి వాహనాలు అక్కడే.. విద్యుత్ ఉద్యోగుల ధర్నాతో లక్డీకాపూల్, పంజగుట్ట, ఎన్టీఆర్ మార్గ్, సోమాజిగూడ, ఎర్రమంజిల్ పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు అప్రమత్తమై ఖైరతాబాద్ చౌరస్తా నుంచి పంజగుట్ట వైపు వెళ్లే రోడ్డుమార్గాన్ని బారికేడ్లతో మూసివేశారు. అసెంబ్లీ మీదుగా వచ్చి న వాహనాలను రాజ్‌భవన్ మీదుగా బేగంపేట వైపు మళ్లించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. ఆందోళనకారులు ఒక్కసారిగా పెద్దసంఖ్యలో రోడ్డుపైకి రావడం, సీఎం కేసీఆర్, సీఎండీ ప్రభాకర్‌రావుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని ముందే పసిగట్టిన జేఏసీ నేతలు ధర్నా విజయవంతమైందని చెప్పి ఆందోళన కార్యక్రమాన్ని ముగించారు. ధర్నా కారణంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. మొండివైఖరిపై మండిపడిన జేఏసీ ఉద్యోగుల వేతనాలను వెంటనే సవరించాలని, 1999 నుంచి 2004 మధ్యకాలంలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ నుంచి జీïపీఎస్ సదుపాయాన్ని కల్పించాలని, ఆర్టీజన్ కార్మి కుల సమస్యలను పరిష్కరించాలని జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు, చైర్మన్ సాయిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నావేదికపై నుంచి వీరు కార్మి కులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ఇప్పటికే పలుమార్లు యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయినా వారి నుంచి కనీసస్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగులకు నగదురహిత అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని అమలు చేయాలని, రూ.కోటి లైఫ్‌టైమ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలని, రిటైర్మెంట్ గ్యారంటీని జీపీఎఫ్ ఉద్యోగులకు రూ.16 లక్షలు, ఈపీఎఫ్ ఉద్యోగులకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా విద్యుత్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
జడ్జీల జీపీఎఫ్ ఖాతాలు క్లోజ్ చేస్తారా?: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తమ జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) ఖాతాలను నిలిపివేశారని పేర్కొంటూ పాట్నా హైకోర్టు న్యాయమూర్తులు దాఖలు చేసిన విజ్ఞప్తి పట్ల సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. దీనిపై శుక్రవారం విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఏడుగురు జడ్జీల జీపీఎఫ్ ఖాతాలను క్లోజ్ చేశారని వారి తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై సాధ్యమైనంత త్వరగా విచారణ ప్రారంభించాలని కోరారు. న్యాయమూర్తుల జీపీఎఫ్ ఖాతాలను మూసేయడం ఏమిటని సీజేఐ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చదవండి నా తండ్రిని రక్షణ శాఖ కార్యదర్శిగా... ఇందిర తొలగించారు -
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ సంస్థల్లో 1999 నుంచి 2004 మధ్య కాలంలో చేరిన ఉద్యోగులకు పాతపెన్షన్, జీపీఎఫ్‌లను అమలు చేయాలని టీఎస్పీఈ జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ఆ సంఘం ప్రతినిధులు టీఎస్‌పీఈఏ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఐదేళ్ల కాలంలో 4700 మంది సంస్థలో ఉద్యోగులుగా చేరారని, వీరందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేసి ఆదుకోవాలని కోరారు. శుక్రవారం ఇదే అంశం ప్రధాన డిమాండ్‌గా చలో హైదరాబాద్ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశం అనంతరం తెలంగాణ విద్యుత్ సంస్థల చైర్మన్ ప్రభాకర్‌రావు నేతృత్వంలో ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్‌ను కలిసి మరోసారి విజ్ఞప్తి చేయనున్నట్లు జేఏసీ ప్రతినిధులు రత్నాకర్‌రావు, సదానందం, సాయిబాబా, కుమారస్వామి, వెంకటనారాయణ, తదితరులు ఉన్నారు. -
సాంకేతిక సమస్యే కారణం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌లో నిధులు క్రెడిట్, డెబిట్ కావడానికి సాంకేతిక సమస్యే కారణమని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం తమను కలసిన ఉద్యోగ సంఘాల నేతలతో అధికారులు చర్చించారు. ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఉద్యోగ సంఘాల నేతలు అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసులు మాట్లాడుతూ.. జీపీఎఫ్‌లో డబ్బు మాయంపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ట్రెజరీ, సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ద్వారా బిల్లులు పాస్ చేసే విధానంలో జరిగిన పొరపాటు వల్ల సమస్య ఉత్పన్నమైందన్నారు. 2018 జూలై 1 నుంచి రావాల్సిన డీఏ ఎరియర్స్ బకాయిలు కొందరికి క్రెడిట్, మరికొందరికి డెబిట్ కావడం ప్రభుత్వ తప్పిదం కాదని అధికారులు తెలిపారన్నారు. సాంకేతికంగా ఏం జరిగిందన్నదానిపై అధికారులు తెలుసుకుంటున్నారని చెప్పారు. జూలై నెలాఖరు లోపు జీపీఎఫ్, మొత్తం డీఏ బకాయిలు చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. బిల్లులు ఒకేసారి చేయడం వల్లే.. జీపీఎఫ్‌లో డబ్బు క్రెడిట్, డెబిట్ అంశంలో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేయలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు అన్నారు. సీపీఎస్, ఓపీఎస్ ఉద్యోగుల బిల్లులు ఒకేసారి చేయడంతో ఈ సమస్య ఏర్పడిందని తెలిపారు. ఈ సమస్యను త్వరలో పరిష్కరించి.. భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూస్తామని అధికారులు చెప్పారన్నారు. అధికారులను కలిసిన వారిలో ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్ చైర్మన్ ఫణి పేర్రాజు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ కిషోర్ కుమార్ తదితరులు ఉన్నారు. -
ఉద్యోగుల కష్టార్జితం ఉఫ్!
సాక్షి, అమరావతి: గతంలో ఏ సర్కారు హయాంలోనూ జరగని విధంగా టీడీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు సైతం ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లాల్సిన పరిస్థితులను మాజీ సీఎం చంద్రబాబు కల్పించారు. అంతేకాదు.. ఉద్యోగుల కష్టార్జితాన్ని కూడా చంద్రబాబు సర్కారు వాడుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం నిర్వహించిన సమీక్షలో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇతర అవసరాల కోసం జీపీఎఫ్ డబ్బులు .. ఉద్యోగులు ప్రతి నెలా వారి వేతనాల్లో కొంత మొత్తాన్ని భవిష్యనిధికి (జీపీఎఫ్) జమ చేస్తారు. ఉద్యోగులు తమ అత్యవసరాల కోసం లేదా పదవీ విరమణ అనంతరం ఆ నిధినుంచి డబ్బులు తీసుకుంటారు. అయితే చంద్రబాబు సర్కారు ఉద్యోగుల జీపీఎఫ్ నిధి నుంచి ఏకంగా రూ.66,108 కోట్లను ఇతర అవసరాలకు విచ్చలవిడిగా వినియోగించేసింది. జీపీఎఫ్ నిధి నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఇతర అవసరాలకు వినియోగించుకోవడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. జీపీఎఫ్ నిధి నుంచి ఇంత పెద్ద మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకున్నట్లు తేలింది. దీన్ని తిరిగి జీపీఎఫ్ నిధికి జమ చేయాల్సి ఉంటుంది. చేతులెత్తేసిన పౌరసరఫరాల సంస్థ మరోవైపు వివిధ కార్పొరేషన్ల పేరిట ప్రభుత్వ గ్యారెంటీతో తీసుకున్న అప్పులను వాటి అవసరాల కోసం వినియోగించుకోనివ్వకుండా చంద్రబాబు సర్కారు ఎన్నికల తాయిలాలకు వినియోగించడం పట్ల విస్తుపోతున్నారు. కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పులను ఎన్నికల ముందు పసుపు కుంకుమ తదితర రాజకీయ ప్రయోజనాల పథకాల కోసం వాడుకోవటంపై నివ్వెరపోతున్నారు. చంద్రబాబు పాలనలో రాజకీయ అవసరాల కోసం కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులను వాడుకోవడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తం ఆయా కార్పొరేషన్లకు బకాయి పడింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల కార్పొరేషన్ తీసుకున్న రూ.4,800 కోట్ల అప్పును చంద్రబాబు సర్కారు ఎన్నికల తాయిలాలు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు మళ్లించేసింది. దీంతో పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేయలేక చేతులెత్తేసింది. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను కూడా ఇవ్వలేకపోతోంది. ఇళ్ల నిధులు గుల్ల గృహ నిర్మాణ అభివృద్ధి కార్పొరేషన్ పేరుతో తీసుకున్న రూ.400 కోట్లను కూడా బాబు సర్కారు ఇతర అవసరాల కోసం వినియోగించేసింది. దీంతో పేదల ఇళ్లకు సంబంధించిన బిల్లులు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ మంచినీటి కార్పొరేషన్ పేరుతో తీసుకున్న రూ.900 కోట్లను కూడా టీడీపీ సర్కారు దారి మళ్లించడంతో మంచినీటి పనుల బిల్లులు ఆగిపోయాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు సర్కారు నిర్వీర్యం చేసినట్లు శనివారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్వహించిన సమీక్షలో వెల్లడైంది. ఉద్యోగులకు చెల్లించాల్సిన జీపీఎఫ్ అప్పుతో కలిపి టీడీపీ పాలనలో చేసిన అప్పులు (కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులు మినహా) 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.2,58,928 కోట్లకు చేరుకున్నాయి. -
జీపీఎఫ్ వడ్డీరేటు 0.4 శాతం పెంపు
న్యూఢిల్లీ: జనరల్ ప్రావిడెండ్ ఫండ్ (జీపీఎఫ్), సంబంధిత ఇతర స్కీమ్‌ల వడ్డీరేటును అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ప్రభుత్వం 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) రేటుకు అనుగుణంగా ఈ రేట్లలో మార్పు చేసినట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పెంపు నిర్ణయంతో జీపీఎఫ్‌పై వడ్డీరేటు 7.6 శాతం (జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో) నుంచి 8 శాతానికి ఎగసింది. ప్రావిడెంట్ ఫండ్స్‌పై వడ్డీరేటు పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వేలు, డిఫెన్స్ దళాలకు వర్తిస్తుంది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి ఎన్ఎస్సీ, పీపీఎఫ్‌సహా పొదుపు పథకాలపై వడ్డీరేటును గత నెల్లో ప్రభుత్వం 0.4 శాతం పెంచిన సంగతి తెలిసిందే. బ్యాంకుల్లో పెరిగిన డిపాజిట్ రేట్లకు అనుగుణంగా ఈ రేట్లు పెరిగాయి. -
ఆ విద్యుత్ ఉద్యోగులకు జీపీఎఫ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 మధ్య నియమితులైన ఉద్యోగులకు శుభవార్త! వీరికి ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)కి బదులు సాధారణ భవిష్య నిధి(జీపీఎఫ్) పథకాన్ని వర్తింపజేసేందుకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కసరత్తు పూర్తి చేశాయి. విద్యుత్ కార్మిక సమ్మె పిలుపు విరమణ కోసం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్(టీఈటీయూఎఫ్)కు 2016 జూన్‌లో విద్యుత్ శాఖ మంత్రి ఇచ్చిన పలు హామీల్లో జీపీఎఫ్ అమలు ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో ఆ సమయంలో నియమితులైన 4,717 మంది విద్యుత్ ఉద్యోగులకు జీపీఎఫ్ అమలు ద్వారా విద్యుత్ సంస్థలపై పడే ఆర్థిక భారంపై ఓ ప్రైవేటు కన్సల్టెన్సీతో ట్రాన్స్‌కో యాజమాన్యం అధ్యయనం జరిపించింది. జీపీఎఫ్ అమలు చేస్తే విద్యుత్ సంస్థలపై రూ.792.22 కోట్ల అదనపు భారం పడనుందని కన్సల్టెన్సీ నివేదించింది. పెన్షన్ల చెల్లింపులకు రూ.1,068.17 కోట్లు, గ్రాట్యుటీకి రూ.175.49 కోట్లు కలిపి మొత్తం రూ.1,243.66 కోట్ల భారం పడనుందని తేల్చింది. ప్రస్తుతం ఉన్న గ్రాట్యుటీ ట్రస్ట్ నుంచి రావాల్సిన రూ.175.49 కోట్లు, ఈపీఎఫ్ నుంచి రావాల్సిన రూ.275.95 కోట్ల నిధులను సర్దుబాటు చేస్తే తుదకు రూ.792.22 కోట్ల అదనపు భారం పడనుందని లెక్కగట్టింది. ఆ విద్యుత్ ఉద్యోగులకు జీపీఎఫ్ పథకాన్ని వర్తింపజేసేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు లేఖ రాశారు. ప్రభుత్వం అనుమతిస్తే ట్రాన్స్‌కోలో 163 మంది, జెన్కోలో 1,304 మంది, టీఎస్ఎస్పీడీసీఎల్లో 1,636 మంది, టీఎస్ఎన్పీడీసీఎల్లో 1,614 మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. -
జీపీఎఫ్ వడ్డీరేటు యథాతథం
సాక్షి, న్యూఢిల్లీ: జీపీఎఫ్ (ఉద్యోగుల భవిష్యనిధి)పై ఇచ్చే వడ్డీని యథాతధంగా కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జిపిఎఫ్) ఇతర సంబంధిత పథకాలకు 7.8 శాతం వడ్డీ రేటును చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ వడ్డీరేటు అక్టోబర్ 1నుంచి డి సెంబర్ 21, 2017 వరకు వర్తిస్తుందని పక్రటించింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే, రక్షణ బలగాల భవిష్య నిధిపై ఈ వడ్డీరేటు వర్తిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో,ఇతర భవిష్యనిధి పథకాలైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) చిన్న పొదుపు పథకాల వడ్డీరేటులో ఎలాంటి మార్పు చేయకుండా అక్టోబర్-డిసెంబరులో 7.8 శాతంగా ఉంచింది. -
పీఆర్సీ బకాయిలను జీపీఎఫ్‌లో జమచేయాలి
నాగార్జునసాగర్ : పీఆర్సీ బకాయిలను జీపీఎఫ్‌లో జమ చేయాలని పీఆర్టీయూ టీఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు బానావత్ సకృనాయక్, ఎం.సీ.రామచంద్రారెడ్డిప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పెద్దవూర మండలంలోని ¯ð ల్లికల్లు, చలకుర్తి కాంప్లెక్సు పరిధిలోగల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పల్రెడ్డి నర్సింహారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి,శ్రీనివాస్, ఈశ్వరయ్య, జయకుమార్, జబ్బార్, పాపిరెడ్డి, భాస్కర్‌గౌడ్, వీరబాబు, రవి, రూపారెడ్డి, గోవిందు, చింతలవెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మధుబాబు, కూర్మారెడ్డి, నూర్‌పాషా పాల్గొన్నారు.