కొలంబో: శ్రీలంకలో విదేశీయులకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల పై నిషేధం విధించారు. భారతీయ దర్యాప్తు బృందాలు ఇక్కడి నుంచి కిడ్నీలు కొనుగోలు చేసి ఆపరేషన్లు చేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు లంక ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం 4 ఆస్పత్రుల్లో ఆరుగురు డాక్టర్లు ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. భారత్ హెచ్చరికలతో హుటాహుటిన కదిలిన లంక ఆరోగ్యశాఖ వెంటనే దర్యాప్తుకు ఆదేశించింది.