ఇప్కా లాబ్స్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్‌ | Ipca Labs slips 15% after USFDA bans import of drugs from 3 plants | Sakshi
Sakshi News home page

ఇప్కా లాబ్స్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్‌

Published Fri, Jun 16 2017 11:33 AM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

ఇప్కా లాబ్స్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ  షాక్‌ - Sakshi

ఇప్కా లాబ్స్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్‌

ముంబై: దేశీయ ఫార్మా సంస్థ  ఇప్కా లేబ్స్‌ తయరు చేసిన మందును అమెరికా డ్రగ్‌  రెగ్యులేటరీ  షాక్‌ తగిలింది. రత్లాం,  సిల్‌వస్సా,  పీతంబూర్‌  మూడు యూనిట్లలో తయారయ్యే అన్ని రకాల ఔషధాల  దిగుమతులపై యూఎస్‌ఎఫ్‌డీఏ  బ్యాన్‌ విధించడంతో ఇప్కా లేబ్స్‌ షేర్‌ భారీ పతనాన్ని నమోదు  చేసింది.   బీఎస్‌ఈలో ఈ షేరు 15 శాతం కుప్పకూలింది.  

మధ్యప్రదేశ్‌లోని పీతంపూర్‌, రత్లాం,  సిల్‌వస్సా (దాద్రా నగర్‌ హవేలి) లో తయరుచేసిన అన్ని ఔషధాలపై నిషేధం కొనసాగుతుందని ఇప్కా లాబొరేటరీస్ ఒక ప్రకటనలో తెలిపింది . ఈ తయారీ కేంద్రాల నుండి తయారైన ఔషధ ఉత్పత్తులు ,  అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన మందులు  నిబంధనలకు  అనుగుణంగా ఉన్నాయని ప్రకటించేదాకా  బ్యాన్‌ కొనసాగుతుందని పేర్కొంది.   

కాగా రత్లాం యూనిట్లో క్లోరోక్విన్‌ ఏపీఐ తయారీకి మాత్రం యూఎస్‌ఎఫ్‌డీఏ వెసులుబాటు కల్పించినట్లు కంపెనీ పేర్కొంది. అమెరికా మార్కెట్లో ఈ ఏపీఐకు కరవు ఏర్పడినా లేదా అవసరం ఏర్పడినా వీటి విక్రయాలను అనుమతించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేశీయ మార్కెట్లో పార్మా బలహీనత కొనసాగుతోంది.  దీంతో  ఫార్మాసెక్టార్‌కు  దూరంగా ఉండాలని కూడా ఎనలిస్టులు సూచిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement