Taliban Afghanistan: FaceBook Bans Accounts Content Supporting Taliban - Sakshi
Sakshi News home page

Afghanistan: తాలిబన్లకు భారీ షాకిచ్చిన ఫేస్‌బుక్‌..!

Published Tue, Aug 17 2021 4:28 PM | Last Updated on Tue, Aug 17 2021 5:44 PM

Facebook Bans Accounts Content Supporting Taliban - Sakshi

లండన్‌: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తాలిబన్లపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది.  ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లను వినియోగించకుండా తాలిబన్లపై ఫేస్‌బుక్‌ నిషేధం విధించింది. తాలిబన్లకు మద్దతుగా ఉన్న కంటెంట్‌పై కూడా ఫేస్‌బుక్‌ నిషేధం విధించనుంది. తాలిబన్లకు  అనుకూలంగా ఉన్న కంటెంట్‌, వీడియోలను, పోస్ట్‌లను తొలగించేందుకు ప్రత్యేకమైన అఫ్గాన్‌ నిపుణుల బృందాన్ని ఫేస్‌బుక్‌ ఏర్పాటుచేసింది.(చదవండి: Afghanistan: తాలిబన్ల కీలక ప్రకటన.. అఫ్గాన్‌లకు..)


తాలిబన్లను యూఎస్‌ టెర్రరిస్టు సంస్థగా గుర్తించిన్నట్లు ఫేస్‌బుక్‌ పేర్కొంది. గత కొన్నేళ్లుగా తాలిబన్‌ తన సందేశాలను వ్యాప్తి చేయడానికి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలను వాడుకుంటుంది. తాలిబన్ల సందేశాలను నిర్మూలించడం కోసం ఫేస్‌బుక్‌ ప్రత్యేకంగా స్థానిక దరి పెర్షియన్‌, పష్తో భాషలను మాట్లాడే అఫ్గాన్‌ నిపుణులను నియమించినట్లు ఫేసుబుక్‌ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. 

తాలిబన్లు కమ్యూనికేట్‌ చేసుకోవడం కోసం వాట్సాప్‌ యాప్‌ వాడుతున్నట్లు తమ వద్ద నివేదికలు ఉన్నాయని ఫేస్‌బుక్‌ ప్రతినిధి తెలిపారు. వాట్సాప్‌లో సర్క్యూలేట్‌ అయ్యే మెసేజ్‌లను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని ఫేస్‌బుక్‌ పేర్కొంది. (చదవండి: తాలిబన్ల దురాగతాలు.. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌ అలర్ట్‌! ఆ వీడియోలకు నోట్‌ తప్పనిసరి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement